బాలకృష్ణ లేకుండా చిరంజీవి ఇంట్లో మరో మీటింగ్.. ఏం జరుగుతుంది..?

Chiranjeevi CCC meeting: ఇండస్ట్రీలో జరుగుతున్న మీటింగ్స్‌కు తనను పిలవడం లేదని.. అసలక్కడ ఏం జరుగుతుందో కూడా తనకు తెలియదని బాలయ్య చేసిన వ్యాఖ్యలు ఎంతటి దుమారాన్ని రేపాయో..

Praveen Kumar Vadla | news18-telugu
Updated: May 29, 2020, 3:28 PM IST
బాలకృష్ణ లేకుండా చిరంజీవి ఇంట్లో మరో మీటింగ్.. ఏం జరుగుతుంది..?
బాలయ్య, చిరంజీవి (balakrishna chiranjeevi)
  • Share this:
ఇండస్ట్రీలో జరుగుతున్న మీటింగ్స్‌కు తనను పిలవడం లేదని.. అసలక్కడ ఏం జరుగుతుందో కూడా తనకు తెలియదని బాలయ్య చేసిన వ్యాఖ్యలు ఎంతటి దుమారాన్ని రేపాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇది జరిగి 24 గంటలు కూడా గడవకముందే మరోసారి మీటింగ్ జరిగింది. ఇండస్ట్రీ పెద్దలంతా కలిసి మరో మీటింగ్ ఏర్పాటు చేసుకున్నారు. ఈ సారి కూడా చిరంజీవి ఇంట్లోనే ఈ భేటీ జరగడం విశేషం. అయితే ఈ సారి జరిగిన మీటింగ్‌కు కూడా బాలయ్యను పిలవకపోవడం.. ఆయన ప్రస్థావన లేకుండానే ఈ భేటీని ముగించడం జరిగిపోయాయని తెలుస్తుంది.

చిరంజీవి ఇంట్లో మరో మీటింగ్ (CCC Chiranjeevi meeting)
చిరంజీవి ఇంట్లో మరో మీటింగ్ (CCC Chiranjeevi meeting)


అసలు ఇందులో బాలయ్య పేరు కూడా ఎవరూ తీసుకురాలేదని వార్తలు వినిపిస్తున్నాయి. ఇందులో ఇండస్ట్రీ గురించి చర్చ కాదని.. కేవలం సిసిసికి మాత్రమే సంబంధించిన భేటీ అని తెలుస్తుంది. దీనికి అధ్యక్షుడు చిరంజీవి కాబట్టి ఆయన ఇంట్లోనే కలిసారని తెలుస్తుంది. అందులో షూటింగ్స్ వగైరా గురించి కాకుండా ఈ నెల కూడా సినీ కార్మికులకు ఎలా అండగా నిలబడాలి.. ఏయే నిత్యావసర సరుకులు ఎంత మందికి ఇవ్వాలనే విషయంపై చర్చించారని ప్రచారం జరుగుతుంది. దాంతో పాటు ప్రభుత్వం షూటింగ్‌లకు అనుమతులిస్తే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే దానిపై కూడా చర్చ జరిగినట్టు బయటికి వచ్చిన సమాచారం.

చిరంజీవి, బాలకృష్ణ (Chiranjeevi Vs Balakrishna)
చిరంజీవి, బాలకృష్ణ (Chiranjeevi Vs Balakrishna)


ఇదే సమావేశంలో బాలకృష్ణ వ్యాఖ్యలపై మాట్లాడటానికి మాత్రం ఎవరూ ఆసక్తి చూపించలేదని.. అసలు అలాంటి టాపిక్ కూడా ఎవరూ తీసుకురాలేదని తెలుస్తుంది. ఇప్పటికే తొలి విడత నిత్యావసర సరుకుల పంపిణీ జరగడంతో దానిపై రివ్యూ చేసారని.. అలాగే మలి విడత సరుకుల విషయంపై చర్చించారని తెలుస్తుంది. బాలయ్య వ్యాఖ్యలపై తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ.. అవసరం వున్న వాళ్లనే ఇటీవల జరిగిన మీటింగ్‌లకు పిలిచారని.. దీన్ని వివాదం చేయాల్సిన అవసరం లేదని తెలిపాడు. ఇక నాగబాబు చేసిన వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతమని తమ్మారెడ్డి చెప్పడం గమనార్హం.
First published: May 29, 2020, 3:28 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading