హోమ్ /వార్తలు /సినిమా /

Pawan Kalyan - Rana: పవన్ కళ్యాణ్, రానా మల్టీస్టారర్ నుంచి మరో వీడియో విడుదల..

Pawan Kalyan - Rana: పవన్ కళ్యాణ్, రానా మల్టీస్టారర్ నుంచి మరో వీడియో విడుదల..

పవన్ కళ్యాణ్ ప్రస్తుతం అయ్యప్పునుమ్ కోశీయుమ్ రీమేక్‌లో నటిస్తున్నాడు. ఈ చిత్ర దర్శకుడు సాగర్ కే చంద్ర కూడా ఫ్లాపుల్లోనే ఉన్నాడు.

పవన్ కళ్యాణ్ ప్రస్తుతం అయ్యప్పునుమ్ కోశీయుమ్ రీమేక్‌లో నటిస్తున్నాడు. ఈ చిత్ర దర్శకుడు సాగర్ కే చంద్ర కూడా ఫ్లాపుల్లోనే ఉన్నాడు.

Pawan Kalyan - Rana: పవన్ కళ్యాణ్, రానా(Pawan Kalyan - Rana) నటిస్తున్న మల్టీస్టారర్ సినిమా షూటింగ్ అనుకున్న దానికంటే చాలా వేగంగా జరుగుతుంది. ఇహనో ఇప్పుడో దీన్ని పూర్తి చేయాలని కంకణం కట్టుకున్నాడు పవర్ స్టార్.

పవన్ కళ్యాణ్, రానా నటిస్తున్న మల్టీస్టారర్ సినిమా షూటింగ్ అనుకున్న దానికంటే చాలా వేగంగా జరుగుతుంది. ఇహనో ఇప్పుడో దీన్ని పూర్తి చేయాలని కంకణం కట్టుకున్నాడు పవర్ స్టార్. అందుకే వేరే ఏ సినిమాలకు డేట్స్ ఇవ్వకుండా కేవలం అయ్యప్పునుమ్ కోశియుమ్ రీమేక్ కోసమే డేట్స్ కేటాయించాడు పవర్ స్టార్. మరో నెల రోజుల్లో ఈ చిత్ర షూటింగ్ పూర్తి కానుందని తెలుస్తుంది. మరోవైపు త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా తన సినిమాను కూడా పక్కనబెట్టి పవన్ సినిమాపై ఫోకస్ చేసాడు. త్వరలోనే ఈయన మహేష్ బాబుతో ప్రాజెక్ట్ అనౌన్స్ చేసాడు. ప్రస్తుతం సూపర్ స్టార్ సర్కారు వారి పాట సినిమాతో బిజీగా ఉన్నాడు. అక్కడ ఆ షూటింగ్ అయ్యేలోపు ఇక్కడ పవన్ సినిమాను పూర్తి చేయాలని చూస్తున్నాడు త్రివిక్రమ్.

నిజానికి అయ్యప్పునుమ్ కోశియుమ్ రీమేక్‌కు సాగర్ కే చంద్ర దర్శకుడు అయినా కూడా అక్కడ అంతా త్రివిక్రమ్ హవానే కనిపిస్తుంది. స్క్రీన్ ప్లే, మాటలు ఆయనే రాస్తున్నాడు. అంతేకాదు షూటింగ్ సమయంలో కూడా అనుక్షణం త్రివిక్రమ్ వెంటే కనిపిస్తున్నాడు. అసలు ఈ సినిమాను పవన్ దగ్గరికి తీసుకొచ్చిందే త్రివిక్రమ్. మీరు చేస్తే బాగుంటుందని ఒప్పించింది కూడా ఈయనే. మీరు చూసుకుంటానంటే నేను దిగుతానని పవన్ చెబితే.. అన్నట్లుగానే ఇప్పుడు తన స్థాయిని తగ్గించుకుని మరి స్నేహితుడి కోసం మాటలు, స్క్రీన్ ప్లే రాస్తున్నాడు త్రివిక్రమ్.

' isDesktop="true" id="979542" youtubeid="WMY60ehqbqM" category="movies">

ఈ సినిమా షూటింగ్ 40 శాతం పూర్తయింది. ఇప్పటికే రెండు మేకింగ్ వీడియోలతో పాటు ఫోటోలు కూడా విడుదల చేసారు దర్శక నిర్మాతలు. ఇప్పుడు మరో వీడియోను రిలీజ్ చేసారు. ఈ సినిమాలోని తొలిపాట విడుదల కాబోతుంది. శ్రీ కృష్ణ పాడనున్న ఈ పాటకు థమన్ సంగీతం అందిస్తున్నాడు. జనవరి 12, 2022న సంక్రాంతి బరిలో ఈ సినిమా రాబోతుంది.

Published by:Praveen Kumar Vadla
First published:

Tags: Pawan kalyan, Rana daggubati, Telugu Cinema, Tollywood

ఉత్తమ కథలు