Jabardasth: సుడిగాలి సుధీర్, రష్మి ప్రేమకథను మించిపోయేలా జబర్దస్త్‌లో మరో లవ్ స్టోరీ..

Jabardasth: అమ్మాయి ఉంటే అదృష్టం వస్తుందని కొందరు అంటుంటారు. అలా ఎంతమందికి దశ తిరిగిందో తెలియదు కానీ కొందరికి మాత్రం ఈ సూత్రం మాత్రం కొందరు జబర్దస్త్‌ కమెడియన్లకు బాగా కలిసొచ్చింది.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: December 5, 2020, 3:26 PM IST
Jabardasth: సుడిగాలి సుధీర్, రష్మి ప్రేమకథను మించిపోయేలా జబర్దస్త్‌లో మరో లవ్ స్టోరీ..
జబర్దస్త్ వర్ష, ఇమ్మాన్యుయేల్ (jabardasth emmanuel varsha)
  • Share this:
జబర్దస్త్‌లో లవ్ స్టోరీ అంటే వెంటనే గుర్తొచ్చేది సుడిగాలి సుధీర్, రష్మి గౌతమ్ జోడీ. ఇప్పుడు వాళ్లను మించిపోయేలా మరో ప్రేమకథ కూడా పురుడు పోసుకుంటుంది. అమ్మాయి ఉంటే అదృష్టం వస్తుందని కొందరు అంటుంటారు. అలా ఎంతమందికి దశ తిరిగిందో తెలియదు కానీ కొందరికి మాత్రం ఈ సూత్రం మాత్రం కొందరు జబర్దస్త్‌ కమెడియన్లకు బాగా కలిసొచ్చింది. వాళ్ల జీవితాలు నిజంగానే అమ్మాయిలు వచ్చిన తర్వాత మారిపోయాయి. రియల్ లైఫ్‌లో కాకపోయినా రీల్ లైఫ్‌లో వాళ్లకు ఆన్ స్క్రీన్ జోడీలు కుదిరిన తర్వాతే వాళ్ల కెరీర్‌కు మరింత రెక్కలొచ్చాయి. వాళ్లే సుడిగాలి సుధీర్, హైపర్ ఆది. సుధీర్ అంటే వెంటనే మరో పేరు కూడా గుర్తొస్తుంది. అదే రష్మి గౌతమ్. ఈ ఇద్దరి మధ్య ఏం లేదని అందరికీ తెలుసు.. కానీ ఏదో ఉందనే భ్రమతోనే సుధీర్ కెరీర్ మారిపోయింది. ఈ విషయం తనే ఒప్పుకున్నాడు కూడా. సుడిగాలి సుధీర్ అంటే తెలియని వాళ్లకు కూడా రష్మి సుధీర్ అంటే తెలుసు అని. అలాగే తన విజయం వెనక ఉన్న అమ్మాయి పేరు రష్మీ గౌతమ్ అంటూ తెలిపాడు. అలాగే హైపర్ ఆది కూడా వర్షిణితో ఆన్ స్క్రీన్ రొమాన్స్ ఇరగదీస్తున్నాడు.



ఇలా కొందరు కమెడియన్లు తమ జోడీలను కూడా వెతుక్కుంటున్నారు. ఇప్పుడు మరో కమెడియన్ కూడా ఇదే చేస్తున్నాడు. అతడే జబర్దస్త్ న్యూ సెన్సేషన్ ఎమ్మాన్యుయెల్. మనోడు చేసింది చేసింది తక్కువ స్కిట్స్ అయినా కూడా కుమ్మేస్తున్నాడు. స్క్రీన్ పై తన కామెడీతో మాయ చేస్తున్నాడు. వచ్చిన కొన్ని రోజుల్లోనే స్పెషల్ క్రేజ్ తెచ్చుకున్నాడు. అప్పట్లో హైపర్ ఆది రెచ్చిపోయినట్లు చాలా ఫాస్టుగా ఈయన పేరు తెచ్చుకుంటున్నాడు. ఇప్పుడు తన జోడీని కూడా వెతుక్కుంటున్నాడు ఇమ్మాన్యుయేల్. ఆ ముద్దుగుమ్మ పేరు వర్ష. సీరియల్స్‌తో గుర్తింపు తెచ్చుకున్న ఈ భామ ఇప్పుడు జబర్దస్త్ షోలో కనిపిస్తుంది.

jabardasth emmanuel varsha,jabardasth emmanuel varsha love story,jabardasth emmanuel varsha love,jabardasth emmanuel varsha affair,jabardasth emmanuel varsha skits,jabardasth emmanuel varsha romance,sudigali sudheer rashmi gautam,hyper aadi varshini,జబర్దస్త్ వర్ష,జబర్దస్త్ ఇమ్మాన్యుయేల్ వర్ష,జబర్దస్త్ కామెడీ షో
జబర్దస్త్ వర్ష ఇమ్మాన్యుయేల్


ఈ మధ్య వరసగా స్కిట్స్‌లో ఇమ్మాన్యుయేల్‌తో కలిసి రొమాన్స్ చేస్తుంది. ఈ ఇద్దరిపై రాసిన స్కిట్స్ కూడా బాగానే పేలుతున్నాయి. దానికితోడు అదిరిపోయే నడుము షోతో పిచ్చెక్కిస్తుంది ఈమె. మొన్నటికి మొన్న సాయి కుమార్ షోకు వచ్చిన ఈ ఇద్దరూ అక్కడ కూడా రొమాన్స్ చేసారు. అంతేకాదు ఇంట్లో ఒప్పించి పెళ్లి కూడా చేసుకుంటానంటూ ఇమ్మాన్యుయేల్ చెప్పాడు. ఇప్పుడు జబర్దస్త్ కామెడీ షోలో రోజా ఈ ఇద్దరి మధ్య ఏదో నడుస్తుందంటూ లేనిపోని హైప్ క్రియేట్ చేసింది. వర్ష, ఇమ్మాన్యుయేల్ మధ్య ప్రేమ బ్లాక్ అండ్ వైట్‌గా ఉందంటే.. వెంటనే వర్ష కలర్ ఏముంది మేడమ్ మనిషి బంగారం అనేసింది. మొత్తానికి వర్ష, ఇమ్మాన్యుయేల్ ప్రేమకథ జబర్దస్త్‌కు మరింత హైప్ తెచ్చేలా కనిపిస్తుంది.
Published by: Praveen Kumar Vadla
First published: December 5, 2020, 3:25 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading