Jabardasth Getup Srinu: సుడిగాలి సుధీర్ బ్యాచ్‌లో మరో హీరో.. అదిరిందయ్యా శ్రీను..

Jabardasth Getup Srinu: జబర్దస్త్ కమెడియన్స్ హీరోలుగా మారడం ఇప్పట్నుంచి వస్తున్న ఆనవాయితీ కాదు. ఎప్పట్నుంచో వస్తుంది.. ఇంకా కొనసాగుతూనే ఉంది. తాజాగా మరొకరు కూడా జబర్దస్త్ స్టేజ్ నుంచి హీరో అవుతున్నారు.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: November 22, 2020, 3:33 PM IST
Jabardasth Getup Srinu: సుడిగాలి సుధీర్ బ్యాచ్‌లో మరో హీరో.. అదిరిందయ్యా శ్రీను..
జబర్దస్త్ గెటప్ శ్రీను (jabardasth getup srinu)
  • Share this:
జబర్దస్త్ కమెడియన్స్ హీరోలుగా మారడం ఇప్పట్నుంచి వస్తున్న ఆనవాయితీ కాదు. ఎప్పట్నుంచో వస్తుంది.. ఇంకా కొనసాగుతూనే ఉంది. తాజాగా మరొకరు కూడా జబర్దస్త్ స్టేజ్ నుంచి హీరో అవుతున్నారు. ఇప్పటికే ఈ స్టేజ్ నుంచి షకలక శంకర్ అరడజన్ సినిమాలు హీరోగా చేసాడు. అవి హిట్టా ఫట్టా అనేది పక్కనబెడితే హీరోగా అయితే నటించాడు శంకర్. మరోవైపు సుడిగాలి సుధీర్ కూడా హీరోగా కంటిన్యూ అవుతూనే ఉన్నాడు. సాఫ్ట్ వేర్ సుధీర్ సినిమాతో హీరో అయిన ఈయన.. 3 మంకీస్ అనే మరో సినిమా చేసాడు. ఈ రెండూ ఫ్లాప్ అయినా కూడా ఇప్పుడు కాలింగ్ సహస్రతో పాటు మరో రెండు సినిమాలు కూడా కమిటయ్యాడు. వీళ్ళ కంటే ముందే ధన్‌రాజ్, అదిరే అభి హీరోలుగా నటించారు. ఇప్పుడు గెటప్ శ్రీను కూడా హీరో అవుతున్నాడు. ఈయన ఓ విభిన్నమైన కథతో వస్తున్నాడు. సాయి వరుణవి క్రియేషన్స్ బ్యానర్‌పై ప్రశాంత్ రెడ్డి 'రాజు యాదవ్‌' సినిమాతో హీరో అవుతున్నాడు. ఐఐటీ మద్రాస్‌లో ఇంటర్నేషనల్ స్క్రీన్ రైటింగ్ కోర్స్ చేసి, 'విన్సెంట్ ఫెరర్' అనే స్పానిష్ ఫిల్మ్‌కు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేసిన కృష్ణమాచారి ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు.
getup srinu twitter,getup srinu movie as hero,extra jabardasth,jabardasth getup srinu as hero,jabardasth getup srinu new movie,getup srinu jabardasth punches,jabardasth getup srinu punch dialogues,jabardasth getup srinu new movie opening video,getup srinu new movie launch as a hero,jabardasth getup sinu new movie,jabardasth srinu short films,గెటప్ శ్రీను,జబర్దస్త్ గెటప్ శ్రీను హీరోగా సినిమా ప్రారంభం
జబర్దస్త్ గెటప్ శ్రీను సినిమా ప్రారంభం (Jabardasth Getup Srinu)


తెలుగులో ప్రముఖ దర్శకుడు వేణు ఊడుగుల రూపొందించిన 'నీది నాది ఒకే కథ', 'విరాటపర్వం' చిత్రాలకు చీఫ్ అసోసియేట్ డైరెక్టర్‌గా పని చేసిన కృష్ణమాచారి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. గెటప్ శ్రీను సరసన నాయికగా అంకిత కరత్ నటిస్తుంది. హైదరాబాద్‌లో ఈ చిత్ర షూటింగ్ లాంఛనంగా ఆరంభమైంది. హీరో హీరోయిన్లపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి కుర్ర దర్శకుడు సాగర్ కె. చంద్ర క్లాప్ కొట్టాడు. దర్శకుడు వేణు ఊడుగుల, ప్రముఖ నిర్మాత సుధాకర్ చెరుకూరి, తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ సంయుక్తంగా స్క్రిప్టును దర్శకుడు కృష్ణమాచారికి అందజేశారు. సూడో రియలిజం జానర్‌లో, ఒక టౌన్ బ్యాక్‌డ్రాప్‌లో నడిచే ఈ చిత్రం సహజసిద్ధమైన పాత్రలతో, ఆర్గానిక్ మేకింగ్‌తో ఉంటుందని కృష్ణమాచారి తెలిపారు.
getup srinu twitter,getup srinu movie as hero,extra jabardasth,jabardasth getup srinu as hero,jabardasth getup srinu new movie,getup srinu jabardasth punches,jabardasth getup srinu punch dialogues,jabardasth getup srinu new movie opening video,getup srinu new movie launch as a hero,jabardasth getup sinu new movie,jabardasth srinu short films,గెటప్ శ్రీను,జబర్దస్త్ గెటప్ శ్రీను హీరోగా సినిమా ప్రారంభం
జబర్దస్త్ కమెడియన్ గెటప్ శ్రీను (Source: Twitter)

కమర్షియల్ హంగులకు దూరంగా, వాస్తవికతకు దగ్గరగా, సమాజంలో మనం చూసే ఎన్నో పాత్రలకు, ఘటనలకు రిప్రజెంటేటివ్‌లా ఉంటూ, సగటు కుటుంబంలోని వైరుధ్య మనస్తత్వాలు, వారి ఊహలు, కోరికలు, ప్రయాణం, చివరగా డెస్టినీ ఏమిటనేదే ఈ సినిమా కథ అని ఆయన తెలిపాడు. గెటప్ శ్రీనునే తీసుకోడానికి కారణం ఈ చిత్ర కథ అంతా నటనకు ప్రాధాన్యం కావడమే అంటున్నాడు దర్శకుడు. గెటప్ శ్రీనులోని నటుడిని కొత్త కోణంలో ప్రేక్షకులకు పరిచయం చేయబోతున్నట్లు దర్శకుడు కృష్ణమాచారి చెప్పారు. అర్జున్ రెడ్డి ఫేమ్ హర్షవర్ధన్ రామేశ్వర్ 'రాజు యాదవ్‌'కు స్వరాలు అందిస్తున్నాడు. డిసెంబర్ తొలి వారం నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుంది. 2021లో సినిమా విడుదల కానుంది. మరి చూడాలిక.. గెటప్ శ్రీను వెండితెరపై ఎలాంటి మాయ చేస్తాడో..?
Published by: Praveen Kumar Vadla
First published: November 22, 2020, 3:32 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading