విడాకుల దిశగా మరో జంట.. షాక్ అవుతున్న అభిమానులు..

Konkona Sen Sharma: ఇండస్ట్రీలో కలిసుండే స్వాతంత్ర్యం కంటే కూడా విడిపోయే స్వేచ్ఛ ఎక్కువగా ఉంది. ఇప్పటికే చాలా మంది విడిపోతున్నారు. తాజాగా మరో జంట కూడా విడిపోవడానికి సిద్ధమైపోతున్నారు. ఐదేళ్ల కిందే వాళ్లు విడిపోయారు..

Praveen Kumar Vadla | news18-telugu
Updated: February 27, 2020, 2:33 PM IST
విడాకుల దిశగా మరో జంట.. షాక్ అవుతున్న అభిమానులు..
కొంకణసేన్ శర్మ (konkana sen sharma ranvir shorey divorce)
  • Share this:
జల్సా సినిమాలో ఓ డైలాగ్ ఉంటుంది. మన దేశంలో ప్రతీ పదిమందిలో ఇద్దరితో తుపాకులు ఉన్నాయి.. అంటే ఇక్కడ బతికే హక్కు కంటే కూడా చచ్చే స్వాతంత్ర్యమే ఎక్కువుందని. ఇప్పుడు మన సెలబ్రిటీస్ కూడా ఇదే చేస్తున్నారు ఇప్పుడు. అయితే ఇక్కడ చావు బతుకుల మ్యాటర్ కాదు. విడాకుల మ్యాటర్. ఇక్కడ కలిసుండే స్వాతంత్ర్యం కంటే కూడా విడిపోయే స్వేచ్ఛ ఎక్కువగా ఉంది. ఇప్పటికే చాలా మంది విడిపోతున్నారు. తాజాగా మరో జంట కూడా విడిపోవడానికి సిద్ధమైపోతున్నారు. ఐదేళ్ల కిందే వాళ్లు విడిపోయారు.. అయితే ఇప్పుడు అఫీషియల్‌గా విడిపోతున్నారు. బాలీవుడ్ నటి, దర్శకురాలు కొంకణ సేన్‌ శర్మ తాజాగా విడాకులకు దరఖాస్తు చేసుకుంది.
కొంకణసేన్ శర్మ (konkana sen sharma ranvir shorey divorce)
కొంకణసేన్ శర్మ (konkana sen sharma ranvir shorey divorce)

నటుడు రణ్‌వీర్‌ షోరేను పదేళ్ల కింద పెళ్లి చేసుకుంది ఈమె. ఐదేళ్ల పాటు వీళ్ల కాపురం బాగానే సాగింది. 2015లో ఈ జంట విడిపోయారు.. అయితే విడాకులు మాత్రం తీసుకోలేదు. దూరంగా ఉంటున్నారంతే. ఇప్పుడు చట్టప్రకారం విడిపోవడానికి సిద్ధమైపోయారు. బాలీవుడ్‌లో ట్రాఫిక్‌ సిగ్నల్‌, మిక్స్‌డ్‌ డబుల్స్‌, ఆజా నాచ్లే వంటి సినిమాల్లో కలిసి నటించిన ఈ జంట ఆ తర్వాత ప్రేమలో పడి పెళ్లి చేసుకున్నారు. 2015లో వైవాహిక బంధానికి గుడ్ బై చెప్పి పరస్పర అంగీకారంతో విడిపోతున్నట్లు వెల్లడించారు.

కొంకణసేన్ శర్మ (konkana sen sharma ranvir shorey divorce)
కొంకణసేన్ శర్మ (konkana sen sharma ranvir shorey divorce)

ఈ జంటకు ఆరేళ్ల కుమారుడు హరూన్‌ ఉన్నాడు. ఇద్దరూ విడిగా ఉంటూనే కుమారుడి బాధ్యతలు చూసుకుంటున్నారు. 2015 నుంచి దూరంగానే ఉంటున్నా ఇప్పుడు అఫీషియల్‌గా విడిపోతున్నారు. ఈ క్రమంలోనే వీళ్లు అధికారికంగా విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. దీనికి సంబంధించిన ప్రక్రియ కూడా పూర్తైపోయింది. దీనికి ముందు కొంకణ, రణవీర్‌ ఇద్దరూ కౌన్సిలింగ్‌ తీసుకున్నారు అయినా కూడా పెద్దగా వర్కవుట్ కాలేదు. వీళ్లు మనసు మార్చుకోలేదు. దాంతో త్వరలోనే విడాకులు మంజూరు చేయనుంది ఫ్యామిలీ కోర్ట్.

First published: February 27, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు