హోమ్ /వార్తలు /సినిమా /

Puneeth Rajkumar: పునీత్ రాజ్‌కుమార్ ఇంట మరో విషాదం.. కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతం..

Puneeth Rajkumar: పునీత్ రాజ్‌కుమార్ ఇంట మరో విషాదం.. కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతం..

Puneeth Rajkumar: కన్నడ పవర్ స్టార్, దివంగత పునీత్ రాజ్‌కుమార్ (Puneeth Rajkumar) ఇంట మరో విషాదం చోటు చేసుకుంది. ఈయన చనిపోయి నాలుగు నెలుల కూడా కాకముందే మరో మరణం ఆ ఇంటి సభ్యులను కన్నీరు పెట్టిస్తుంది. తాజాగా పునీత్ భార్య అశ్విని తండ్రి భగ్మనే రేవనాథ్ కన్నుమూశారు.

ఇంకా చదవండి ...

కన్నడ పవర్ స్టార్, దివంగత పునీత్ రాజ్‌కుమార్ ఇంట మరో విషాదం చోటు చేసుకుంది. ఈయన చనిపోయి నాలుగు నెలుల కూడా కాకముందే మరో మరణం ఆ ఇంటి సభ్యులను కన్నీరు పెట్టిస్తుంది. తాజాగా పునీత్ భార్య అశ్విని తండ్రి భగ్మనే రేవనాథ్ కన్నుమూశారు. భర్త పునీత్ రాజ్‌కుమార్ మరణ వార్త నుంచే ఇంకా పూర్తిగా కోలుకోలేదు అశ్విన్. అంతలోనే మరో తీవ్ర ఆవేదనకు గురయ్యే వార్త ఆమెకు వచ్చింది. అల్లుడు మరణం తర్వాత రేవనాథ్ తీవ్ర మనస్థాపానికి లోనయ్యాడు. అప్పట్నుంచే ఆయన అనారోగ్యం పాలయ్యాడు. తీవ్ర ఒత్తిడిలోనే ఉంటూ వచ్చారు కూడా. ఆనందంగా ఉన్న కుటుంబంలో ఉన్నపాటుగా పునీత్ మరణం పిడుగులా వచ్చింది. దాంతో కుటుంబం అంతా విషాదంలోకి వెళ్లిపోయారు. ముఖ్యంగా పునీత్ భార్య అశ్విని తండ్రి రేవనాథ్ అల్లుడు మరణం తట్టుకోలేకపోయారు. ఆ ఒత్తిడి తట్టుకోలేక గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. ఆయన వయసు 78 సంవత్సరాలు.

Bheemla Nayak: పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌కు ఊహించని షాక్.. ‘భీమ్లా నాయక్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ వాయిదా..

రేవనాథ్‌కు గుండెపోటు వచ్చిన వెంటనే బెంగళూరులోని ఎంఎస్ రామయ్య ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆయన మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు. ఆయన మృతితో కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. పునీత్ భార్య అశ్విని పరిస్థితి మరి అయితే దారుణంగా ఉంది. పాపం మొన్నే భర్తను కోల్పోయిన ఈమెకు.. ఇప్పుడు కొండంత అండగా ఉన్న తండ్రిని కూడా కోల్పోయింది. దాంతో ఆమె పరిస్థితి చూసి అందరూ ఆవేదనకు గురవుతున్నారు. మరోవైపు పునీత్ మామ మరణంతో ఆ కుటుంబానికి సంతాపం వ్యక్తం చేస్తున్నారు. 2021 అక్టోబర్ 29న పునీత్ సైతం కేవలం 46 ఏళ్ల వయసులో గుండెపోటుతోనే మరణించారు. ఇప్పుడు ఆయన మామగారు కూడా గుండెపోటుతోనే మరణించడం విషాదకరం.

First published:

Tags: Kannada Cinema, Puneeth RajKumar

ఉత్తమ కథలు