ANOTHER BIOPIC COMING ON TAMILNADU EX CHIEF MINISTER CUM ACTRESS LATE JAYALALITHAA NEW BIOPIC TITLE AS SASILALITHAA TA
అమ్మ ‘జయలలిత’ మర్డర్ మిస్టరీ నేపథ్యంలో ‘శశిలలిత’ బయోపిక్..
శశిలలిత బయోపిక్
ప్రస్తుతం అన్ని ఇండస్ట్రీస్‌లో బయోపిక్‌ల హవా నడస్తోంది. ఇంకోవైపు మాజీ హీరోయిన్ కమ్ తమిళనాడు మాజీ సీఎంగా ప్రజల మన్ననలు అందుకున్న జయలలిత జీవిత కథ ఆధారంగా ఇప్పటికే మూడు నాలుగు బయోపిక్‌లు తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే కదా. తాజాగా జయలలిత, శశికళ ఇద్దరి జీవితాల మిక్స్ చేసి ప్రముఖ దర్శకుడు కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి ‘శశిలలిత’ అనే బయోపిక్‌ను తెరకెక్కిస్తున్నట్టు ప్రకటించడమే కాక ఫస్ట్ లుక్ పోస్టర్‌ను కూడా విడుదల చేశాడు.
ప్రస్తుతం అన్ని ఇండస్ట్రీస్‌లో బయోపిక్‌ల హవా నడస్తోంది. ఇప్పటికే ఎన్టీఆర్ జీవితంపై మూడు బయోపిక్‌లు వచ్చాయి. ఇపుడు ‘లక్ష్మీస్ వీరగ్రంథం’అంటూ మరో బయోపిక్ రాబోతుంది. ఇంకోవైపు మాజీ హీరోయిన్ కమ్ తమిళనాడు మాజీ సీఎంగా ప్రజల మన్ననలు అందుకున్న జయలలిత జీవిత కథ ఆధారంగా ఇప్పటికే మూడు నాలుగు బయోపిక్‌లు తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే కదా. మరోవైపు జయలలిత నెచ్చెలి శశికళ జీవిత కథ ఆధారంగా సంచలనదర్శకుడు ‘శశికళ’ బయోపిక్‌ను తెరకెక్కించబోతున్నట్టు ప్రకటించాడు. తాజాగా జయలలిత, శశికళ ఇద్దరి జీవితాల మిక్స్ చేసి ప్రముఖ దర్శకుడు కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి ‘శశిలలిత’ అనే బయోపిక్‌ను తెరకెక్కిస్తున్నట్టు ప్రకటించడమే కాక ఫస్ట్ లుక్ పోస్టర్‌ను కూడా విడుదల చేశాడు. సగం జయలలిత,సగం శశికళ ముఖంతో ఉన్న ఈ పోస్టర్‌కు మంచి రెస్పాన్స్ వస్తోంది.
కంగన రనౌత్ జయలలిత
‘శశిలలిత’ పేరిట తెరకెక్కుతోన్న ఈ సినిమాను జయలలిత అనారోగ్యంగా ఆస్పత్రిలో ఉన్న 75రోజుల్లో ఏం జరిగిందనేది ఈ సినిమాలో చూపెట్టబోతున్నారు. ఈ సినిమాను జయలలిత జీవితంలో చోటుచేసుకున్న అన్ని విషయాలను చూపెట్టబోతున్నట్టు సమాచారం. జయలలిత బాల్యం,నటిగా స్టార్డమ్, రాజకీయ ప్రవేశం వంటి ఈ సినిమాలో హైలెట్‌గా తెరకెక్కించనున్నట్టు చెప్పాడు దర్శకుడు కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి. అంతేకాదు జయలలిత ఆత్మ చెప్పిన విషయాలు..వాటి ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించబోతున్నట్టు సమాచారం. అంతేకాదు జయలలిత ఆత్మ కూడా దర్శకుడికి కొన్ని విషయాలు చెప్పిందని ఆ అంశాల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించబోతున్నట్టు దర్శకుడు జగదీశ్వర్ రెడ్డి మీడియాకు తెలిపారు.
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.