హోమ్ /వార్తలు /సినిమా /

Mahesh Babu: మహేష్ బాబు ఫ్యామిలీ నుంచి మరో నట వారసుడు.. హీరోగా రంగం సిద్ధం..

Mahesh Babu: మహేష్ బాబు ఫ్యామిలీ నుంచి మరో నట వారసుడు.. హీరోగా రంగం సిద్ధం..

Super Star Mahesh Babu | ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీతో పాటు అన్ని ఇండస్ట్రీస్‌లో వారసులదే హవా. తాజాగా మహేష్ బాబు ఇంటి నుంచి మరో నట వారసుడు ఎంట్రీ ఇవ్వబోతున్నాడు.

  ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీతో పాటు అన్ని ఇండస్ట్రీస్‌లో వారసులదే హవా. ఇక సూపర్ స్టార్ కృష్ణ కుటుంబం నుంచి ముందుగా రమేష్ బాబు హీరోగా ఎంట్రీ ఇచ్చారు. కానీ ప్రేక్షకాదరణ పొందలేకపోయాడు. ఆ తర్వాత మహేష్ బాబు తండ్రి బాటలో హీరోగా ఎంట్రీ ఇచ్చి టాలీవుడ్ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తూ తండ్రి తగ్గ తనయుడు అనిపించుకున్నాడు. ఆ తర్వాత కృష్ణ ఫ్యామిలీ పేరు చెప్పుకొని.. చిన్నల్లుడు సుధీర్ బాబు పోసాని కూడా హీరోగా ఎంట్రీ ఇచ్చేసాడు. ఇపుడు కృష్ణ మనవడు.. మహేష్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా కూడా హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఇక కృష్ణ రెండో భార్య విజయనిర్మల ఫ్యామిలీ నుంచి సీనియర్ నరేష్ కామెడీ హీరోగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు.

  కృష్ణకు వరుసకు మనవడు శరణ్ (File/Photo)

  అటు ఆయన కుమారుడు నవీన్ విజయ్ కృష్ణ కూడా ‘నందిని నర్సింగ్ హోం’ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చి సంగతి తెలిసిందే కదా. మరోవైపు కృష్ణ రెండో కూతురు మంజుల భర్త సంజయ్ స్వరూప్ సహాయ నటుడి పాత్రలో అలరిస్తున్నాడు. తాజాగా కృష్ణ ఫ్యామిలీ నుంచి మరో హీరో ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అవుతున్నాడు. అతను కూడా విజయనిర్మలకు మనవడే. ఈ శరన్. ఈయన కృష్ణ కూడా మనవడి వరసే అవుతాడు. త్వరలోనే ఇతుడు రామచంద్ర వట్టికూటి అనే డైరెక్టర్ చిత్రంతో శరన్ హీరోగా ఎంట్రీ ఇవ్వనున్నట్టు సమాచారం. మరోవైపు రమేష్ బాబు తనయుడు జయకృష్ణ కూడా త్వరలోనే టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనున్నట్టు సమాచారం.

  First published:

  Tags: Krishna, Mahesh Babu, Sarkaru Vaari Paata, Telugu Cinema, Tollywood

  ఉత్తమ కథలు