Annabelle Sethupathi Release on OTT | మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి (Vijay Sethupathi), తాప్సీ (Taapsee) హీరోయిన్స్‌గా నటించిన లేటెస్ట్ మూవీ ‘అన్నాబెల్ సేతుపతి’ (Annabelle Sethupathi). గత కొన్నేళ్లుగా బాలీవుడ్ చిత్రాలకే పరిమితమైన ఈ భామ చాలా రోజుల తర్వాత సౌత్‌లో నటించిన చిత్రం ‘అన్నాబెల్ సేతుపతి’. తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్ విడుదల చేసారు. ఈ సినిమాను దీపక్ సుందర్ రాజన్ డైరెక్ట్ చేసారు. ఈ గురువారం ఈ సినిమా ఫస్ట్ లుక్ విడుదల చేశారు. అయితే ఈ సినిమాను థియేట్రికల్ రిలీజ్ కాకుండా నేరుగా డిస్నీ హాట్ స్టార్ ఓటీటీ వేదికగా విడుదల చేస్తున్నారు. సెప్టెంబర్ 17న ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది. ఈ ఫస్ట్ లుక్ పోస్టర్‌లో విజయ్ సేతుపతి, తాప్సీలు క్రైస్తవ సంప్రదాయ పెళ్లి బట్టల్లో మెరిసిపోతున్నారు. వరుసగా డిఫరెంట్ కథా చిత్రాలు చేస్తోన్న విజయ్ సేతుపతి, తాప్సీలు కలిసి నటించడంతో ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి.
విజయ్ సేతుపతి విషయానికొస్తే.. ‘పిజ్జా’ అనే తమిళ డబ్బింగ్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడే. ఆ తర్వాత చాలా యేళ్లకు తెలుగులో చిరంజీవి హీరోగా నటించిన ‘సైరా నరసింహారెడ్డి’ సినిమాతో తెలుగులో డైరెక్ట్ ఎంట్రీ ఇచ్చారు విజయ్ సేతుపతి. ఆ తర్వాత తెలుగులో వైష్ణవ్ తేజ్ హీరోగా నటించిన ‘ఉప్పెన’ మూవీలో ప్రతినాయకుడిగా పాత్రలో నటించి విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. ఇపుడు బాలకృష్ణ, గోపీచంద్ మలినేని చిత్రంలో విలన్ పాత్రలో నటించబోతున్నట్టు సమాచారం. ఒకవేళ విజయ్ సేతుపతి నటిస్తే ఈ సినిమాలో బాలయ్య, విజయ్ సేతుపతి పై యాక్షన్ సన్నివేశాలు ఓ రేంజ్‌లో ఉండే అవకాశాలున్నాయి.
Makkal selvan @VijaySethuOffl & @taapsee in #AnnabelleSethupathi First look is here.
Streaming from Sep 17th on @DisneyplusHSVIP
@IamJagguBhai @realradikaa @iYogiBabu @vennelakishore @SDeepakDir @Sudhans2017 @PassionStudios_ @goutham_george
#AnabelleSethupathiOnHotstar pic.twitter.com/Zw0tDHLWXU
— BA Raju's Team (@baraju_SuperHit) August 26, 2021
హీరోయిన్ తాప్సీ పన్ను విషయానికొస్తే.. తెలుగులో దర్శకేంద్రుడు కే.రాఘవేంద్రరావు తెరకెక్కించిన ‘ఝుమ్మంది నాదం’ మూవీతో తెలుగులో హీరోయిన్‌గా కెరీర్ ప్రారంభించింది. ఫస్ట్ మూవీలోనే తన గ్లామర్‌తో యూత్ తనవైపుకు తిప్పుకుంది. ఈ మూవీలో హీరో మనోజ్‌తో తాప్సీ ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ అదిరిపోయింది. ఆ తర్వాత తెలుగులో చాలా సినిమాలు చేసింది. అయితే ఏ సినిమా పెద్దగా గుర్తింపును తీసురాలేదు. అదీకాక.. తెలుగులో తాప్సీని చాలా వరకు గ్లామర్ పాత్రలకే పరిమితం చేశారు.
ఇక్కడి దర్శక నిర్మాతలు. అయితే హిందీలో మాత్రం నటనకు ప్రాధాన్యమున్న పాత్రల్నీ ఎంచుకుంటూ అక్కడ అదరగొడుతోంది. అందులో భాగంగా వచ్చినవే..'పింక్', 'ముల్క్','బద్లా' 'గేమ్ ఓవర్' సాండ్ కి ఆంఖ్ లాంటి సినిమాలు.. ఇలా వరుస హిట్ సినిమాలతో హిందీ పరిశ్రమలో దూసుకుపోతుంది తాప్సీ. దాంతో పాటు తన స్నేహితులతో కలిసి నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టింది. ప్రస్తుతం తాప్సీ చేతిలో హిందీలో పలు క్రేజీ ప్రాజెక్ట్స్ చేస్తోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Annabelle Sethupathi, Kollywood, Taapsee Pannu, Tollywood, Vijay Sethupathi