కాస్టింగ్ కౌచ్..(Casting Couch) కొన్నేళ్ల కిందట... వచ్చిన ఈ మాట.. సినిమా ఇండస్ట్రీలో కలకలం రేపింది. అనేకమంది ప్రముఖ నటుల పేర్లు తెరపైకి వచ్చాయి. అప్పట్లో క్యాస్టింగ్ కౌచ్ ఎదుర్కొన్నామంటూ అనేకమంది నటులు హాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు గళం విప్పారు. అయితే తాజాగా మరోసారి కాస్టింగ్ కౌచ్‌పై కీలక వ్యాఖ్యలు చేశాడు ప్రముఖ టీవీ నటుడు. తాను కూడా క్యాస్టింగ్ కౌచ్ ఎదుర్కొన్నానంటున్నాడు టీవీ నటుడు అంకిత్ సివాచ్ ( Ankit siwach). అంకిత్ మోడల్‌గా 12 ఏళ్ల క్రితమే తన కెరీర్ ప్రారంభించాడు.2017లో బుల్లితెరపై ఎంట్రీ ఇచ్చాడు. పలు హిందీ సీరియళ్లలో నటిస్తూ మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు అంకిత్.
అయితే ఒకప్పుడు తాను కూడా ఇండస్ట్రీని వదిలి వెళ్లిపోదామనుకున్నాడు అంకిత్. మోడలింగ్ చేసేటప్పుడు తాను ఇబ్బందులు పడ్డానని చెప్పాడు. ఒంటి మీద బట్టలు లేకుండా ఫోటోలు పంపాలని తనను కొంతమంది కోరేవారని చెప్పాడు. అంతేకాకుండా తనకు ఇచ్చిన పనితో సంబంధం లేకుండా పార్టీలకు రావాలని కూడా ఒత్తిడి చేసేవాడన్నాడు. తనను అనేక రకాలుగా వేధింపులకు గురి చేశారని ఆవేదన వ్యక్తం చేశాడు అంకిత్. ఆ సమయంలో మోడలింగ్(Modeling) మానేసి వెళ్లిపోదామా అని చాలా సార్లు తనకు అనిపించిందని చెప్పుకొచ్చాడు.
'అందరూ మంచివాళ్లు అని తాను ఎప్పుడూ అనుకుంటూ ఉండేవాడినని అన్నాడు. కానీ అలా అనుకోవడమే తనకు బలహీనతగా మారిందన్నాడు అంకిత్ సివాచ్. మన ఈ వీక్‌నెస్‌ను ఎదుటివాళ్లు యూజ్ చేసుకోవచ్చు. ప్రతి ఒక్కరిలోనూ చెడు కూడా ఉంటుంది. కానీ అది రాక్షసత్వంగా మారి మిమ్మల్ని ముప్పుతిప్పలు పెట్టొచ్చు అంటూ సోషల్ మీడియాలో తాను చేసిన పోస్టులో రాసుకొచ్చాడు. కొంతమందిని చూసినప్పుడు మన కళ్ల ముందు రాబంధులు నిలబడి మనల్ని పీక్కు తినడానికి వస్తున్నాయనిపించేది. అలాంటివారిని చూసినప్పుడు అన్నీ వదిలేసి వెనక్కివెళ్లిపోదాం అనిపించేదన్నాడు. అనేక సార్లు తాను మానసిక ఒత్తిడికి లోనయ్యానని.. తనలో తాను ఎంతగానో కుమిలిపోయానని తన ఆవేదన వ్యక్తం చేశాడు. కానీ అధికారంలో ఉన్నవారు ఇతరులను దగా చేయడం మానవ స్వభావమని తనకు తానే సర్ది చెప్పుకున్నానన్నడు అంకిత్(Ankit siwach).
ఇది ప్రతి ఇండస్ట్రీలో ఇలాంటి ఉంటాయని... వాటినుంచి మనం తప్పించుకోలేమన్నాడు. ఏదో ఒకసారి ఫేస్ చేయాల్సిందే అన్నాడు అంకిత్. అtvలా నాకు ఎన్నో ప్రపోజల్స్ వచ్చాయి. ‘నీకు ఇష్టమున్నా లేకపోయినా నీ కెరీర్ కోసమైనా ఆ పని చేసి తీరాల్సిందే’ అని ఒత్తిడి తెచ్చినవాళ్లు కూడా ఉన్నారు. అప్పుడు నేను స్వయంకృషితో ఎదిగిన సెలబ్రిటీల గురించి ఉదాహరణగా చెప్పేవాడిని. మేము చెప్పినదానికి కాంప్రమైజ్ కాకుండా ‘నువ్వు ముందుకు వెళ్లగలననుకుంటున్నావా?’ అని బెదిరించేవాళ్లు కూడా!' అని చెప్పుకొచ్చాడు అంకిత్ సివాచ్. మరి అంకిత్ తాజాగా చేసిన ఈ కాస్టింగ్ కౌచ్ వ్యాఖ్యలు ఎలాంటి దుమారం లేపుతాయో చూడాలి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Casting Couch, Model, Tv serials