Karthika Deepam: చిప్పకూడు తినేందుకు రెడీ అయిన మోనిత.. పూసగుచ్చినట్టు డాక్టర్ బాబుకు నిజాలు చెప్పిన అంజి?

Karthika Deepam

Karthika Deepam: కార్తీకదీపం సీరియల్ మరింత హైలెట్ గా మారింది. ఓవైపు మోనిత మరోవైపు దీప తమ న్యాయాల కోసం బాగా పోరాడుతున్నారు. ఇక మధ్యలో ట్విస్ట్ ల మీద ట్విస్ట్ లు రావడంతో సీరియల్ బాగా ఆసక్తిగా మారింది.

  • Share this:
    Karthika Deepam: కార్తీకదీపం సీరియల్ మరింత హైలెట్ గా మారింది. ఓవైపు మోనిత మరోవైపు దీప తమ న్యాయాల కోసం బాగా పోరాడుతున్నారు. ఇక మధ్యలో ట్విస్ట్ ల మీద ట్విస్ట్ లు రావడంతో సీరియల్ బాగా ఆసక్తిగా మారింది. ప్రేక్షకులు మాత్రం ఈ సీరియల్ ను అసలు మిస్ అవ్వట్లేరు. దీప, మోనిత ఒకే కారులో ప్రయాణించిన సంగతి తెలిసిందే. ఇక మోనిత మొత్తానికి అంజి దగ్గరికి వెళ్లి తను మారినట్లుగా మాట్లాడుతుంది. కానీ అంజి నమ్మకపోవడంతో తన అసలు రూపాన్ని చూపిస్తుంది. అంజి తలపై గన్ పెడుతూ బెదిరిస్తుంది. ఇదంతా దీప.. తన కార్ డ్రైవర్ ఫోన్ తీసుకొని రికార్డు చేస్తుంది. హిమను చంపింది నేనే అని చెప్పేస్తుంది. అంతేకాకుండా కార్తీక్ కు ఏమి కాకుండా యాక్సిడెంట్ చేసినందుకు మంచి మేలు చేశావని అంటుంది.

    అంజి కూడా మోనితను తన మాటలతో బెదిరిస్తాడు. కార్తీక్, దీపమ్మ కాళ్లపై పడేసేలా చేస్తాను అంటాడు. దాంతో మోనిత కోపంతో ఊగిపోయి.. దీపమ్మ.. దీపమ్మ అంటావేంటిరా.. ఆ దీపమ్మ కోసం నీ దీపాన్ని ఆర్పేసుకో.. తనకోసం చచ్చిపో.. కానీ కార్తీక్ ను వదలను అంటుంది.ఇక అంజిని.. తన పెళ్లికి ముందు చంపడం కరెక్ట్ కాదని అంటూ తనతో రమ్మంటుంది. వెంటనే ఓ వ్యక్తిని పిలిపించి అంజిని తాళ్లతో కట్టి పడేస్తుంది. ఇక దీప ఇదంతా ఫోన్ లో రికార్డు చేసేస్తుంది. మరోవైపు కార్తీక్ దీప కోసం తెగ టెన్షన్ పడుతుంటాడు. వారణాసి ని అడుగుతాడు. ఇక వెంకటేష్ కారులో వెళ్లిందని తెలియడంతో వెంకటేష్ ఫోన్ కు చేస్తాడు.

    karthika deepam, monitha, doctor babu, nirupam paritala, karthik, vantalakka, nalla deepa, deepa, premi vishwanath

    అదే సమయంలో వెంకటేష్ ఫోన్ స్విచాఫ్ అవుతుంది. ఇక తెల్లారి ప్రియమణి మోనితకు కార్తీక్ వచ్చిన విషయాన్ని చెబుతుంది. దీప ఇంటికి చేరుకునే సరికి కార్తీక్ ఉలిక్కిపడి లేచి ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తాడు. మరోవైపు భాగ్యం మోనిత పెళ్లిని ఆపడానికి కిడ్నాప్ చేయాలనుకుంటుంది. తన మాయమాటలతో మోనితకు కొన్ని విషయాలు చెప్పడంతో అందులో మోనిత ఇదంతా డ్రామా అని తెలుసుకొని.. మీతో వస్తాను పిన్నిగారు అంటూ భాగ్యమును గదిలోకి తీసుకుని వెళుతుంది. ఇక దీప కార్తీక్ ను అంజి ఉన్న చోటికి పంపిస్తుంది. అంజిని చూసి షాక్ అయిన కార్తీక్ మోనిత కిడ్నాప్ చేసిన విషయాన్ని తెలుపుతాడు అంజి. మరోవైపు అంజి తప్పించుకున్నాడని మోనితకు ఫోన్ వస్తుంది. ఇక అంజి.. హిమ యాక్సిడెంట్ గురించి కార్తీక్ చెబుతున్నట్లు తెలుస్తోంది.
    Published by:Navya Reddy
    First published: