Anjali : ఒక్కోసారి మన కళ్ళను మనమే నమ్మలేం. ఇప్పుడు అంజలిని చూస్తుంటే ఇదే అనిపిస్తుంది. ఒకప్పుడు బొద్దుగుమ్మలా ఉండే ఈ తెలుగు అందం.. చాలా సన్నబడి.. అదరగొడుతోంది. ఇప్పుడు మెరుపుతీగలా మారిపోయింది. కాగా అంజలి.. మొదట 'షాపింగ్‌మాల్' సినిమాతో పరిచయమైంది. ఆ సినిమాలో అదిరిపోయే నటనతో అందరినీ అబ్బురపరిచిన విషయం తెలిసిందే. 'షాపింగ్ మాల్' సూపర్ హిట్ తర్వాత డైరెక్టర్ మురుగదాస్ నిర్మించిన 'జర్నీ'లో చక్కటి హావభావాలతో అంజలి అందరి మనసుల్నీ దోచుకుంది. ఆ తర్వాత సీతగా... తెలుగులో 2013లో వచ్చిన 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' సినిమాలో అమాయకంగా కనిపిస్తూ.. అంజలి చేసిన యాక్టింగ్‌కు తెలుగు వారందరూ ఫిదా అయ్యారు. ఆ తర్వాత వరుసగా.. 'బలుపు' 'గీతాంజలి', 'చిత్రంగద' వంటి హారర్ సినిమాలలో తనదైన నటనతో ప్రేక్షకులను అలరించింది అంజలి. అది అలా ఉంటే అంజలి తన సోషల్ మీడియాలో ఓ ఫ్యాన్ మేడ్ చేసిన వీడియోను షేర్ చేసింది. అందులో అంజలి రంగస్థలంలో సమంత పాటకు అదిరిపోయే డ్యాన్స్ చేస్తూ.. అదరగొట్టింది.
ఈ భామ ప్రస్తుతం 'నిశ్శబ్దం' అనే సినిమా చేస్తోంది. ఈ సినిమాలో అంజలి ప్రముఖ పాత్ర పోషిస్తోంది. ప్రధాన పాత్రలో అనుష్క నటిస్తోంది. దీనికి సంబందించిన ఓ టీజర్ ఇటీవలే విడుదలైంది.
View this post on Instagram
ఫారెన్ టూర్‌ను ఎంజాయ్ చేస్తోన్న తెలుగందం.. అంజలి
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Anjali, Samantha, Telugu Movie News