హోమ్ /వార్తలు /సినిమా /

ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ ఇంట తీవ్ర విషాదం.. !

ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ ఇంట తీవ్ర విషాదం.. !

అనిరుధ్ ఇంట విషాదం

అనిరుధ్ ఇంట విషాదం

ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ ఇంట తీవ్ర విషాదం.. చోటుచేసుకుంది, ఆయన తాత. ప్రముఖ డబ్బింగ్ ఆర్టిస్ట్ అయిన ఎస్వీ రమణన్ అనారోగ్యంతో కన్నుమూశారు.

 • News18 Telugu
 • Last Updated :
 • Hyderabad, India

  సినీ ఇండస్ట్రీలో మరో విషాదం చోటు చేసుకుంది. కోలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచంద్రన్ ఇంట్లో విషాదం నెలకొంది. అనిరుధ్ తాత ఎస్వీ రమణన్(87) తుదిశ్వాస విడిచారు. వయసు భారం, అనారోగ్యం సమస్యల కారణంగానే ఆయన చనిపోయారని కుటుంబసభ్యులు పేర్కొన్నారు. ఎస్వీ రమణన్ మృతితో కోలీవుడ్‌ ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. ఈయన మృతిపై పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు. అనిరుధ్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తున్నారు. సినీ బ్యాక్ గ్రౌండ్ ఫ్యామిలీ నుంచి వచ్చిన ఆయన.. రేడియో డబ్బింగ్ ఆర్టిస్ట్, దర్శకుడు గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన తండ్రి సుబ్రహ్మణ్యం.. 1930, 1940లలో పలు చిత్రాలకు దర్శకత్వం వహించారు.

  ఇక రమణన్.. రేడియోలో వేలాది కార్యక్రమాలకు డబ్బింగ్ చెప్పారు. దర్శకుడిగా లఘ చిత్రాలు రూపొందించారు. భక్తిరస డాక్యుమెంటరీలని చిత్రీకరించారు.1983లో రమణన్.. ‘ఊరువంగల్ మరాళం’ అనే సినిమాకు దర్శకత్వం వహించారు. ఇందులో మహేంద్రన్, సుహాసిని హీరోహీరోయిన్లుగా నటించగా.. స్టార్ హీరోలు కమల్ హాన్, రజనీకాంత్.. అతిథి పాత్రల్లో కనిపించారు. ఇకపోతే రమణన్.. తమిళ ఇండస్ట్రీలో మల్టీ టాలెంటెడ్ పర్సన్ గా గుర్తింపు తెచ్చుకున్నారు. రమణన్ కి ఇద్దరు కుమార్తెలు లక్ష్మీ, పార్వతి ఉన్నారు. లక్ష్మీ కుమారుడే యువ సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచంద్రన్. తాత మరణించడంతో అనిరుధ్ ఫ్యామిలీ శోకసంద్రంలో మునిగిపోయింది.

  తాత వారసత్వాన్ని అందుకున్న అనిరుధ్.. సంగీత దర్శకుడిగా పేరు ప్రఖ్యాతలు సంపాదించారు. తెలుగు, తమిళ భాషల్లో స్టార్ హీరోల సినిమాలకు మ్యూజిక్ అందిస్తూ, ఫుల్ బిజీగా మారిపోయాడు. ఎస్వీ రమణన్ అంత్యక్రియలు ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు చెన్నైలో జరగనున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు.

  Published by:Sultana Shaik
  First published:

  Tags: Anirudh Ravichander, Kollywood, Kollywood News

  ఉత్తమ కథలు