Home /News /movies /

ANIL RAVIPUDI WILL ATTEND TO MACHERLA NIYOJAKAVARGAM TRAILER LAUNCH EVENT SB

Nithiin: మాచర్ల నియోజకవర్గం ట్రైలర్ రిలీజ్ ఈవెంట్‌కు .. ముఖ్య అతిథిగా స్టార్ డైరెక్టర్.. !

మాచర్ల నియోజకవర్గం నుంచి నితిన్ ఫస్ట్ లుక్ విడుదల (Twitter/Photo)

మాచర్ల నియోజకవర్గం నుంచి నితిన్ ఫస్ట్ లుక్ విడుదల (Twitter/Photo)

ఈ ట్రైలర్ ను జూలై 30 తేదీన రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఇప్పుడు తాజాగా వేదికను ఖరారు చేస్తూ ప్రోమో రిలీజ్ చేసింది చిత్ర యూనిట్.

    నితిన్ హీరోగా ఎం.ఎస్ రాజశేఖర్ రెడ్డి దర్శకత్వం లో తెరకెక్కిన మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ మాచర్ల నియోజకవర్గం. రాజ్ కుమార్ ఆకెళ్ళ సమర్పణ లో శ్రేష్ట్ మూవీస్ పతాకంపై సుధాకర్ రెడ్డి, నిఖిత రెడ్డి లు ఈ చిత్రాన్ని సంయుక్తం గా నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుండి విడుదల అయిన ప్రచార చిత్రాలకి, పాటలకు ప్రేక్షకుల నుండి, అభిమానుల నుండి సూపర్ రెస్పాన్స్ వస్తోంది.

    ఈ చిత్రం ను ఆగస్ట్ 12, 2022 న థియేటర్ల లో భారీగా విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది. అందుకు సంబంధించిన ప్రమోషన్స్ ను సైతం వేగవంతం చేయడం జరిగింది. ఇందులో భాగంగా రేపు సాయంత్రం 5 గంటలకు LEM స్కూల్ గ్రౌండ్, బ్రోడిపేట్, గుంటూరు లో ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ను నిర్వహించనున్నారు మేకర్స్. ఈ ట్రైలర్ ను జూలై 30 తేదీన రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఇప్పుడు తాజాగా వేదికను ఖరారు చేస్తూ ప్రోమో రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. ట్రైలర్ కు సర్వం సిద్ధం అంటూ మాస్ ప్రోమో విడుదల చేసింది.



    ఇక  ఈ ఈవెంట్ కి చీఫ్ గెస్ట్ గా టాలీవుడ్ బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి విచ్చేయనున్నారు. కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రానికి మహతి స్వర సాగర్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రంలో దుర్మార్గులైన రాజకీయ నాయకులను భరతం పట్టే ఎలక్షన్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నారు. మాచర్ల నియోజకవర్గంలో పరిస్థితులను నితిన్ ఏ విధంగా చక్కదిద్దాడనే ఇతివృత్తంతో ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ చిత్రాన్ని వినాయక చవితి కానుకగా విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారు.

    ఇటీవలే మాచర్ల యాక్షన్ ధమ్కీ రిలీజ్ చేశారు. ఈ సాలిడ్ వీడియో నెక్స్ట్ లెవెల్ మాస్ గా ఉందని చెప్పాలి. నితిన్ డైలాగ్ తో మంచి ఇంటెన్స్ యాక్షన్ సీక్వెన్స్ ఇందులో కనిపిస్తుంది. ‘ మహాభారతంలో ధర్మాన్ని కాపాడేందుకు లక్షలాది మంది తమ సమాధుల్ని పునాదులుగ వేశారు. మాచర్ల నియోజకవర్గంలో ధర్మాన్ని కాపాడటం కోసం.. నా సమాధిని పునాదిగా వేయడానికి నేను సిద్ధం’ అంటూ సాగే నితిన్ డైలాగ్స్ హైలెట్‌గా నిలిచాయి. అలాగే మహతి సాగర్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇంకో లెవెల్లో అనిపిస్తుంది.
    Published by:Sultana Shaik
    First published:

    Tags: Nithiin, Tollywood

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు