హోమ్ /వార్తలు /సినిమా /

Anjali : తెలుగు అందం అంజలికి బంపర్ ఆఫర్.. కారణం ఆ హీరోనా..

Anjali : తెలుగు అందం అంజలికి బంపర్ ఆఫర్.. కారణం ఆ హీరోనా..

Anil Ravipudi: వరుస బ్లాక్ బస్టర్ సినిమాలతో దూసుకుపోతున్న అనిల్ రావిపూడి ప్రస్తుతం ఎఫ్ 3 అనే సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. వెంకటేష్, వరుణ్ తేజ్‌లు హీరోలుగా చేస్తున్నారు.

Anil Ravipudi: వరుస బ్లాక్ బస్టర్ సినిమాలతో దూసుకుపోతున్న అనిల్ రావిపూడి ప్రస్తుతం ఎఫ్ 3 అనే సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. వెంకటేష్, వరుణ్ తేజ్‌లు హీరోలుగా చేస్తున్నారు.

Anil Ravipudi: వరుస బ్లాక్ బస్టర్ సినిమాలతో దూసుకుపోతున్న అనిల్ రావిపూడి ప్రస్తుతం ఎఫ్ 3 అనే సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. వెంకటేష్, వరుణ్ తేజ్‌లు హీరోలుగా చేస్తున్నారు.

  Anil Ravipudi: వరుస బ్లాక్ బస్టర్ సినిమాలతో దూసుకుపోతున్న అనిల్ రావిపూడి ప్రస్తుతం ఎఫ్ 3 అనే సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. వెంకటేష్, వరుణ్ తేజ్‌లు హీరోలుగా చేస్తున్నారు. ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటుంది. అనిల్ రావిపూడి విషయానికి వస్తే.. టాలీవుడ్‌లో పటాస్ మూవీతో దర్శకుడిగా పరిచయం అయ్యాడు. ఆ తర్వాత సాయి తేజ్ ‘సుప్రీమ్’ , రవితేజ ‘రాజా ది గ్రేట్’, వంటి సినిమాలతో హాట్రిక్ సక్సెస్ అందుకున్నాడు. ఇక దిల్ రాజు నిర్మాణంలో వచ్చిన కామెడీ ఎంటర్టైనర్‌ ఎఫ్ 2 తో మరో బ్లాక్ బస్టర్ హిట్‌ను అందుకున్నాడు. ఈ సినిమాలో వెంకటేష్, వరుణ్ తేజ్‌‌లు హీరోలుగా చేయగా.. తమన్నా, మెహ్రీన్ హీరోయిన్స్‌గా చేశారు. ఇక ఆ తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా తెరకెక్కించి మరో బ్లాక్ బస్టర్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇపుడు మరోసారి వెంకటేస్, వరుణ్ తేజ్‌లతో ‘ఎఫ్ 2’ సీక్వెల్ ‘ఎఫ్ 3’ సినిమాను తెరకెక్కిస్తున్నాడు.  ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ అతిథి పాత్రలో నటించబోతున్నట్టు సమాచారం. కాగా ఈ సినిమా మరో అప్ డేట్ వచ్చింది. ఈ సినిమాలో తెలుగు అందం అంజలి నటిస్తున్నట్లు తెలుస్తోంది. అంజలి మొదట తమిళ సినిమాలతో అలరించిన ఆ తర్వాత తెలుగులో నటిస్తూ తెలుగు వారికి చాలా దగ్గరైంది.

  ముఖ్యంగా వెంకటేష్ మహేష్ బాబుల "సీత‌మ్మ వాకిట్లో సిరిమ‌ల్లె చెట్టు"తో సీతగా ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. ఇక ఈ భామ ఎఫ్ 3లో కనిపించనుందని తెలుస్తోంది. ఒక‌ప్పుడు బొద్దుగుమ్మ‌లా ఉండే ఈ బ్యూటీ.. చాలా సన్నబడి.. అదరగొడుతోంది. ఇప్పుడు మెరుపుతీగలా మారిపోయిన ఈ తెలుగు అందం.. ఇటీవల అంజలి వకీల్ సాబ్‌లో నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాను వేణు శ్రీరామ్ దర్శకత్వం వహించగా.. పవన్ కళ్యాన్ హీరోగా చేశాడు. దిల్ రాజు నిర్మించాడు. ఈ సినిమా ఏప్రిల్ 9న విడుదలై మంచి వసూళ్లను రాబడుతోంది. దీంతో ఫామ్‌లో ఉన్నా అంజలి తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇదంత పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ సినిమా ఇచ్చిన పాపులారిటీ అంటున్నారు ఆమె అభిమానులు.

  ఎఫ్ 3 విషయానికి వస్తే.. వెంకటేష్, యంగ్ హీరో వరుణ్ తేజ్ కాంబినేషన్’లో వస్తున్న ఈ సినిమాలో ఇప్పటికే తమన్నా, మెహ్రీన్‌లు హీరోయిన్స్‌గా నటిస్తుండగా.. మూడో హీరోయిన్ క్యారెక్టర్ ఉందట. ఈ క్యారెక్టర్ కోసం బాలయ్య హీరోయిన్ మొదట సోనాలీ చౌహాన్ ను తీసుకున్నారు. అయితే ఇప్పుడు ఆ క్యారెక్టర్ లో అంజలిని తీసుకున్నారని తాజా సమాచారం. ఈ సినిమాలో వెంకటేష్, వరుణ్ తేజ్‌లతో పాటు ఇతర ముఖ్య పాత్రల్లో రాజేంద్రప్రసాద్, వెన్నెల కిషోర్, సునీల్ కూడా నటిస్తున్నారు. దిల్ రాజు నిర్మిస్తున్నాడు.

  First published:

  Tags: Tollywood news

  ఉత్తమ కథలు