• HOME
  • »
  • NEWS
  • »
  • MOVIES
  • »
  • ANIL RAVIPUDI THAMAN MEHREEN PRANEETHA CHIEF GUESTS FOR BB 4 GRAND FINALE MNJ

BB 4 Grand Finale: సంద‌డిగా గ్రాండ్ ఫినాలే.. పార్టీకి రెడీగా ఉండండి.. ప్రోమో విడుదల

BB 4 Grand Finale: సంద‌డిగా గ్రాండ్ ఫినాలే.. పార్టీకి రెడీగా ఉండండి.. ప్రోమో విడుదల

బిగ్ బాస్ 4 గ్రాండ్ ఫినాలే

బుల్లితెర ప్రేక్ష‌కుల‌కు ఇవాళ బిగ్‌బాస్(Bigg Boss 4 Telugu) డే. నాగార్జున(Nagarjuna) వ్యాఖ్యతగా 105 రోజులుగా కొన‌సాగిన బిగ్‌బాస్ నాలుగో సీజ‌న్ గ్రాండ్ ఫినాలే ఇవాళ జ‌ర‌గ‌నుండ‌గా.. విన్న‌ర్ ఎవ‌రో తేల‌నుంది.

  • Share this:
    BB Telugu Grand Finale: బుల్లితెర ప్రేక్ష‌కుల‌కు ఇవాళ బిగ్‌బాస్ డే.  నాగార్జున వ్యాఖ్యతగా 105 రోజులుగా కొన‌సాగిన బిగ్‌బాస్ నాలుగో సీజ‌న్ గ్రాండ్ ఫినాలే ఇవాళ జ‌ర‌గ‌నుండ‌గా.. విన్న‌ర్ ఎవ‌రో తేల‌నుంది. ఈ సీజ‌న్ విన్న‌ర్ ఎవ‌రో తెలుసుకునేందుకు ఇటు వీక్ష‌కులు కూడా ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. విన్న‌ర్‌పై లీకులు వ‌స్తున్నా.. డైరెక్ట్‌గా షో చూసేందుకు అంద‌రూ సిద్ధంగా ఉన్నారు. ఇక ఈ గ్రాండ్ ఫినాలే మరింత గ్రాండ్‌గా చేసేందుకు ప‌లువురు ప్ర‌ముఖులు ఇందులో భాగం కాబోతున్నారు. దీనికి సంబంధించిన ప్రోమోను స్టార్ మా త‌న సోష‌ల్ మీడియాలో విడుద‌ల చేసింది.

    అందులో ఈ సీజ‌న్‌లో పాల్గొన్న కంటెస్టెంట్‌లు, టాప్ 5 కంటెస్టెంట్‌ల త‌ల్లిదండ్రులను చూపించారు. వీరంద‌రూ స్టేజ్‌పైన సంద‌డి చేయ‌బోతున్నారు. ఇక వీరితో పాటు ద‌ర్శ‌కుడు అనిల్ రావిపూడి, సంగీత ద‌ర్శ‌కుడు థ‌మ‌న్‌, హీరోయిన్లు మెహ్రీన్‌, ప్ర‌ణీత‌లు ఇవాళ్టి షోలో ర‌చ్చ చేయ‌బోతున్నారు. అయితే క‌రోనా నేప‌థ్యంలో ఇప్ప‌టివ‌ర‌కు బ‌య‌టి వారిని లోప‌ల‌కి పంప‌క‌పోగా.. ఫైన‌ల్ రోజున అనిల్‌, మెహ్రీన్‌ల‌ను హౌజ్‌లోకి పంపారు.



    ఈ సంద‌ర్భంగా వారు కూడా అక్క‌డ ర‌చ్చ చేయనున్నారు. అలాగే కంటెస్టెంట్‌ల డ్యాన్స్‌, వారి మ‌ధురానుభూతుల‌తో ఈ రోజు ఉండ‌బోతోంది. మొత్తానికి తాజాగా విడుద‌లైన ప్రోమో ఇవాళ్టి ఎపిసోడ్‌పై ఆస‌క్తిని మ‌రింత పెంచింది. అయితే ఫైన‌ల్‌కి మెగాస్టార్ చిరంజీవి వ‌స్తాడ‌ని టాక్ న‌డిచిన‌ప్ప‌టికీ.. దానిపై ఇంకా క్లారిటీ రావ‌డం లేదు.
    Published by:Manjula S
    First published:

    అగ్ర కథనాలు