అనిల్ రావిపూడి.. అభిమానించడంలో సరిలేరు నీకెవ్వరు..

Anil Ravipudi Son name: తెలుగు ఇండస్ట్రీలో ప్రస్తుతం సరిలేని విజయాలతో దూసుకుపోతున్న కుర్ర దర్శకుడు అనిల్ రావిపూడి. ఈయనకు ఈ మధ్యే వారసుడు కూడా పుట్టాడు.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: July 13, 2020, 5:23 PM IST
అనిల్ రావిపూడి.. అభిమానించడంలో సరిలేరు నీకెవ్వరు..
అనిల్ రావిపూడి (anil ravipudi)
  • Share this:
తెలుగు ఇండస్ట్రీలో ప్రస్తుతం సరిలేని విజయాలతో దూసుకుపోతున్న కుర్ర దర్శకుడు అనిల్ రావిపూడి. ఈయనకు ఈ మధ్యే వారసుడు కూడా పుట్టాడు. సరిలేరు నీకెవ్వరు సినిమా విడుదలకు సరిగ్గా వారం రోజుల ముందు ఈయన ఇంటికి అడుగుపెట్టాడు తనయుడు. దాంతో పట్టలేని ఆనందంలో తేలిపోయాడు అనిల్. ఆ వారం రోజుల తర్వాత సరిలేరు నీకెవ్వరు విడుదల కావడం.. అది మంచి విజయం సాధించడంతో మనోడి ఆనందానికి పట్టపగ్గాల్లేకుండా పోయాయి. ఇంటికి వారసుడు రావడం.. సూపర్ స్టార్‌తో చేసిన సినిమా సూపర్ హిట్ కావడంతో అంతా ఈ దర్శకుడికి అలా కలిసొచ్చిందంతే.

భార్యతో అనిల్ రావిపూడి (anil ravipudi wife)
భార్యతో అనిల్ రావిపూడి (anil ravipudi wife)


ఇప్పుడు తన కొడుకుకి ఏం పేరు పెట్టారని అడిగితే.. ఊహించని సమాధానం చెప్పాడు ఈయన. ఈ మధ్యే అభిమానులతో ఛాట్ చేసాడు అనిల్. అందులో చాలా విషయాలు చెప్పాడు. ముఖ్యంగా తన నెక్ట్స్ సినిమా గురించి కూడా చెప్పాడు ఇక కొడుకు పేరు గురించి చెబుతూ.. మహేష్ బాబుతో సినిమా చేస్తున్నపుడు పుట్టాడు కాబట్టి వాడికి అజయ్ సూర్యన్ష్ అనే పేరు పెట్టుకున్నాడు అనిల్. ఈ పేరుతో మహేష్ బాబుకు చాలా మంచి సంబంధం ఉంది. ఒక్కడు, దూకుడు, సరిలేరు నీకెవ్వరు సినిమాల్లో మహేష్ బాబు పేరు ఇదే.

అనిల్ రావిపూడి మహేష్ బాబు (anil ravipudi mahesh babu)
అనిల్ రావిపూడి మహేష్ బాబు (anil ravipudi mahesh babu)


తను తెరకెక్కించిన సరిలేరు నీకెవ్వరులో హీరో పేరు అజయ్ కృష్ణ కాబట్టి.. ఆ సినిమా విజయానికి గుర్తుగా తన కొడుకు పేరు కూడా అజయ్ అని పెట్టుకున్నట్లు చెప్పాడు అనిల్. ఈయన సమాధానం విన్న సూపర్ స్టార్ అభిమానులు పొంగిపోతున్నారు. ప్రస్తుతం ఈయన ఎఫ్3 సినిమా పనులతో బిజీగా ఉన్నాడు. షూటింగ్స్ మొదలైన తర్వాత ఈ సినిమా పట్టాలెక్కించడానికి సిద్ధమవుతున్నాడు ఈ దర్శకుడు. అన్నీ కుదిర్తే వచ్చే ఏడాది మహేష్ బాబుతో ఈయన మరో సినిమా చేయడం ఖాయంగా కనిపిస్తుంది. ఇప్పటికే మహేష్ ఈ దర్శకుడిని మరో సినిమా చేయమని అడిగాడు కూడా.
Published by: Praveen Kumar Vadla
First published: July 13, 2020, 5:23 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading