ANIL RAVIPUDI REMEMBERS HIS COLLEGE DAYS AND SAYS ABOUT LOVE STORY SLB
నా భార్య ఫ్రెండ్‌కే లైనేశా.. ఇంట్లో రోజూ అదో తంటా! లవ్ స్టోరీ రివీల్ చేసిన అనిల్ రావిపూడి
Photo Twitter
F3 చిత్ర ప్రమోషన్స్ లోనూ తనదైన స్టైల్ మాటలతో ప్రేక్షకులకు వినోదం పంచుతున్నారు అనిల్ రావిపూడి. తన సినిమా విశేషాలతో పాటు వ్యక్తిగత మ్యాటర్స్ మాట్లాడుతూ ఓపెన్ అవుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఓ ఇంటర్వ్యూలో భాగమైన ఆయన.. తన కాలేజీ రోజులను నెమరు వేసుకుంటూ కొన్ని ఫన్నీ ఇన్సిడెంట్స్ బయటపెట్టారు.
టాలీవుడ్ సక్సెస్ఫుల్ దర్శకుల్లో ఒకరిగా అనిల్ రావిపూడి (Anil Ravipudi) హవా నడిపిస్తున్నారు. తనదైన కామెడీ సెన్స్‌తో ప్రేక్షకులకు చక్కిలిగింతలు పెడుతున్నారు. ఈ క్రమంలోనే రేపు (మే 27) F3 సినిమాతో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయబోతున్న ఆయన.. చిత్ర ప్రమోషన్స్ లోనూ తనదైన స్టైల్ మాటలతో ప్రేక్షకులకు వినోదం పంచుతున్నారు. తన సినిమా విశేషాలతో పాటు వ్యక్తిగత మ్యాటర్స్ మాట్లాడుతూ ఓపెన్ అవుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఓ ఇంటర్వ్యూలో భాగమైన ఆయన.. తన కాలేజీ రోజులను నెమరు వేసుకుంటూ కొన్ని ఫన్నీ ఇన్సిడెంట్స్ బయటపెట్టారు. తన టీనేజ్ రోజుల్లో సైట్ కొట్టిన అమ్మాయిలు టాపిక్ తీస్తూ టాప్ సీక్రెట్స్ రివీల్ చేశారు. ఆ రోజుల్లో ఓ అమ్మాయి అంటే తెగ ఇష్టపడేవాడినని అయితే పెళ్లి విషయంలో మాత్రం సీన్ రివర్స్ అయిందని ఆయన చెప్పిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
తాను చదుకున్న కాలేజీలోనే తన భార్య భార్గవి కూడా చదువుకుందని ఇప్పటికే చాలా ఇంటర్వ్యూల్లో చెప్పిన అనిల్ రావిపూడి.. ఈ సారి మాత్రం కాలేజీ రోజులను గుర్తు చేసుకుంటూ ఓ ఆసక్తికర విషయాన్ని బయటపెట్టారు. కాలేజీలో పెద్ద బ్యాచ్ మెయిన్టైన్ చేసేవాడినని, ఆ బ్యాచ్ అంతా కలిసి మరో నలుగురు అమ్మాయిల బ్యాచ్‌ను తెగ ఫాలో అయ్యేవాళ్లమని చెబుతూ తన లవ్ మ్యాటర్ బయటకు తీశారు. ఆ నలుగురిలో ఓ అమ్మాయి అంటే తనకు చాలా ఇష్టమని, ఆ అమ్మాయికి ఎప్పుడూ సైట్ కొడుతూ ఉండే వాడినని అన్నారు. చివరకు అదే బ్యాచ్ లోని మరో అమ్మాయిని పెళ్లి చేసుకున్నానని చెప్పారు.
సో.. భార్య ఫ్రెండ్‌కు సైట్ కొడితే భార్య పడిందంటూ ఫన్నీగా చెప్పారు అనిల్. తన ఫ్రెండ్‌కు సైట్ కొట్టావంటూ ఇప్పటికీ తన భార్య అంటూనే ఉంటుందని, నిత్యం ఈ విషయమై చిన్న గొడవైనా జరుగుతుంటుందని చెబుతూ స్మైల్ ఇచ్చారు అనిల్ రావిపూడి. దీన్ని బట్టి చూస్తే సినిమాలే కాదు ఆయన రియల్ లైఫ్ కూడా ఫుల్ ఫన్‌తో నిండి ఉందని అర్థమవుతోంది కదూ.
ఇక అనిల్ రూపొందించిన F3 సినిమాలో వెంకటేష్, వరుణ్ తేజ్ కామెడీ పీక్స్‌లో ఉండబోతోందట. ఈ సినిమాలో వెంకటేష్‌కు జోడీగా మిల్కీ బ్యూటీ తమన్నా, వరుణ్ తేజ్‌కు జోడీగా యంగ్ హీరోయిన్ మెహ్రీన్ ఆడిపాడుతున్నారు. వీరితో పాటు హిందీ నటుడు బొమన్ ఇరానీ, శ్రీకాంత్ అయ్యంగార్, సునీల్, ఆలీ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ ఫన్ రైడ్ ఎంజాయ్ చేయాలని ఫ్యామిలీ ఆడియన్స్ ఆతృతగా ఎదురు చూస్తున్నారు.
Published by:Sunil Boddula
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.