బాలకృష్ణ ఫ్యాన్స్‌కు పండగే.. పవర్ ఫుల్ సబ్జెక్ట్ రెడీ చేసిన యువ దర్శకుడు..

దర్శకుడు అనిల్ రావిపూడికి నందమూరి బాలకృష్ణతో సినిమా చేయాలనేది ఎప్పటి నుంచో ఉన్న కోరిక. ఆ కోరిక అతి త్వరలో తీరనుంది.

news18-telugu
Updated: May 27, 2020, 6:59 AM IST
బాలకృష్ణ ఫ్యాన్స్‌కు పండగే.. పవర్ ఫుల్ సబ్జెక్ట్ రెడీ చేసిన యువ దర్శకుడు..
గతంలో సీఎం జగన్ తన అభిమాని అనే విషయం తనకు తెలుసు అని వివరించారు.
  • Share this:
బాలకృష్ణ ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఓ షెడ్యూల్ కూడా పూర్తి చేసుకున్న ఈ సినిమా కరోనా వల్ల ఏర్పడ్డ లాక్ డౌన్ కారణంగా వాయిదా పడింది. సింహా, లెజెండ్ తర్వాత ఈ సినిమా రావడంతో ఈ సినిమా పై మంచి అంచనాలు ఉన్నాయి. దానికి తగ్గట్లుగానే బోయపాటి తగిన కసరత్తులు చేసి స్క్రిప్ట్ సిద్ధం చేశాడట. ఈ సినిమాలో బాలయ్య సరసన ఓ కొత్త అమ్మాయి కనిపించనుందని సమాచారం. ఆ సినిమా తర్వా బాలయ్య బి గోపాల్ దర్శకత్వంలో ఓ సినిమాను చేయనున్నాడు. ఈ ఇద్దరి కాంబినేషన్‌లో గతంలో అదిరిపోయే సూపర్ హిట్ సినిమాలు వచ్చిన సంగతి తెలిసిందే. దీంతో ఈ సినిమాపై ఆయన అభిమానులు చాలా ఆశలు పెట్టుకున్నారు. ఇక్కడ మరో విశేషమేమంటే ఈ రెండు సినిమాలు అలా ఉండగానే మరో సినిమాకు బాలయ్య ఓకే అన్నట్లు తెలుస్తోంది. సూపర్ స్టార్ మహేష్ బాబుతో ఇటీవల సరిలేరు నీకెవ్వరు అంటూ వచ్చిన అనిల్ రావిపూడి ఓ ఫవర్ ఫుల్ కథను బాలయ్యకు వినిపించి సినిమాను ఓకే చేసుకున్నాడని సమాచారం. అనిల్ చెప్పిన కథ బాలయ్య నచ్చడంతో గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట బాలయ్య. అయితే ఇంతకు ముందోసారి కూడా అప్పట్లో బాలకృష్ణ 100వ సినిమా సమయంలోనే ఆయనకి అనిల్ రావిపూడి ఒక కథను వినిపించాడట.

అయితే కొన్ని కారణాల వలన ఆ ప్రాజెక్టు పట్టాలెక్కలేదు. మళ్లీ ఇటీవల బాలకృష్ణను కలిసి అనిల్ రావిపూడి ఒక కథను వినిపించాడట. ఈ సారి అనిల్ కథకు ఓకే అన్నాడట బాలకృష్ణ. అనిల్ రావిపూడి ప్రస్తుతం దిల్ రాజు నిర్మాతగా 'ఎఫ్ 3'ని తెరకెక్కించే పనిలో ఉన్నాడు. ఈ సినిమా పూర్తి కాగానే బాలయ్యతో సినిమా పట్టాలెక్కనుందని తెలుస్తోంది.
Published by: Suresh Rachamalla
First published: May 27, 2020, 6:59 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading