Home /News /movies /

ANIL RAVIPUDI LAUNCH LUCKY LAKSHMAN MOVIE FIRST LOOK

Anil Ravipudi: లక్కీ లక్ష్మణ్ సినిమా పోస్టర్ రిలీజ్ చేసిన అనిల్ రావిపూడి

దర్శకుడు అనిల్ రావీపూడి గారు ఎంతో బిజీగా ఉన్నా మేము అడిగిన వెంటనే మా ‘లక్కీ లక్ష్మణ్’ ఫస్ట్ లుక్ ను విడుదల చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు నిర్మాత.

దర్శకుడు అనిల్ రావీపూడి గారు ఎంతో బిజీగా ఉన్నా మేము అడిగిన వెంటనే మా ‘లక్కీ లక్ష్మణ్’ ఫస్ట్ లుక్ ను విడుదల చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు నిర్మాత.

దర్శకుడు అనిల్ రావీపూడి గారు ఎంతో బిజీగా ఉన్నా మేము అడిగిన వెంటనే మా ‘లక్కీ లక్ష్మణ్’ ఫస్ట్ లుక్ ను విడుదల చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు నిర్మాత.

    ఔట్ & ఔట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ “లక్కీ లక్ష్మణ్” సినిమా ఫస్ట్ లుక్‌ను ప్రముఖ డైరెక్టర్ అనిల్ రావిపూడి విడుదల చేశారు. ఈ సినిమాను దత్తాత్రేయ మీడియా పతాకంపై బిగ్ బాస్ ఫెమ్ సోహైల్, మోక్ష జంటగా ఎ.ఆర్ అభి దర్శకత్వంలో హరిత గోగినేని నిర్మిస్తున్నారు . శరవేగంగా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఫస్ట్ లుక్ ను ప్రముఖ దర్శకుడు అనిల్ రావి పూడి విడుదల చేయడం జరిగింది. ఈ సందర్బంగా ప్రముఖ దర్శకుడు అనిల్ రావి పూడి మాట్లాడుతూ.. ‘లక్కీ లక్ష్మణ్’ఫస్ట్ లుక్ చాలా బాగుందన్నారు. దర్శక, నిర్మాతలకు ఇది మొదటి చిత్రమైనా చాలా చక్కగా తెరకెక్కించారు. వీరిద్దరికీ ఈ చిత్రం మంచి పేరు తీసుకురావాలన్నారు. నటుడు సోహైల్ నాకు బిగ్ బాస్ నుండి తెలుసు తను నటన బాగుంటుందన్నారు అనిల్. వీరి ముగ్గురు కాంబినేషన్ లో వస్తున్న ఈ చిత్రం గొప్ప విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను అన్నారు.

    చిత్ర హీరో సొహైల్ మాట్లాడుతూ... మా అనిల్ రావిపూడి అన్న ఎంతో బిజీగా ఉన్నా మా ‘లక్కీ లక్ష్మణ్’ ఫస్ట్ లుక్ ను లాంచ్ చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు. తను లాంచ్ చేయడంతో మా సినిమా బిగ్ సక్సెస్ అవుతుందని భావిస్తున్నామని తెలిపారు.మా దర్శక, నిర్మాతలకు సినిమాపై ఎంత ప్యాషన్ ఉందో సినిమా కథలను సెలెక్ట్ చేసుకోవడంలో కూడా అంతే అభిరుచిని కలిగి ఉన్నారు ఈ సినిమాకు టెక్నికల్ పరంగా, ఔట్ ఫుట్ పరంగా ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా సీనియర్ టెక్నీషియన్స్ తో నిర్మించారని సోహైల్ తెలిపారు.ఈ చిత్రం అందరికీ తప్పకుండా నచ్చుతుంది అన్నారు.



    చిత్ర దర్శకుడు అభి మాట్లాడుతూ…నటీ, నటులు టెక్నిషియన్స్ అందరూ ఫుల్ సపోర్ట్ చేయడం జరిగింది. శరవేగంగా షూటింగ్ పూర్తి చేసుకొన్న ఈ చిత్రం ఫస్ట్ లుక్ లాంచ్ చేసుకునే వరకు రావడమే కాకుండా నా ఫెవరెట్ డైరెక్టర్ అయిన అనిల్ రావిపూడి గారి చేతుల మీదుగా మా ”లక్కీ లక్ష్మణ్” ఫస్ట్ లుక్ విడుదల కావడం చాలా సంతోషంగా ఉంది. మా జనరేషన్ దర్శకులకు ఆయనే ఇన్స్పిరేషన్. అవుట్‌ అండ్‌ అవుట్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందించిన ఈ చిత్రం ప్రేక్షకులందరికీ కచ్చితంగా నచ్చుతుంది అన్నారు.

    దర్శకుడు అనిల్ రావీపూడి గారు ఎంతో బిజీగా ఉన్నా మేము అడిగిన వెంటనే మా ‘లక్కీ లక్ష్మణ్’ ఫస్ట్ లుక్ ను విడుదల చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు నిర్మాత హరిత గోగినేని. వారికి మా ధన్యవాదాలు. మా ‘లక్కీ లక్ష్మణ్’ మోషన్ పోస్టర్ ను చూసిన చాలా మంది ఇది చాలా క్రియేటివ్ గా ఉందని చెప్పారన్నారు. దర్శక, నిర్మాతలు డిఫ్రెంట్ సబ్జెక్ట్ ను సెలెక్ట్ చేసుకొని తీస్తున్నారన్నారు. ప్రేక్షకులకు ఒక మంచి కాఫీ లాంటి సినిమాను ఇస్తారనే కామెంట్స్ రావడంతో మాకది ఎంతో ఎనర్జీని ఇచ్చినట్లు అయ్యిందన్నారు. దర్శకుడు అభి ఎంతో ట్యాలెండెడ్ పర్సన్ తను చెప్పిన కథ నచ్చడమే కాకుండా సినిమా కొరకు తను పడే కష్టం, తపన చూసి తనకోసం ఈ సినిమా చేస్తున్నాను.

    సోహైల్ తో పాటు సీనియర్ నటులు మరియు సీనియర్ టెక్నిషన్స్ అందరూ మాకు ఫుల్ సపోర్ట్ చేయడంతో షూటింగ్ కూడా పూర్తి చేసుకోవడం జరిగింది. మంచి డీఫ్రెంట్ సబ్జెక్టు తో వస్తున్న ఈ సినిమా ప్రేక్షకులందరికీ కచ్చితంగా నచ్చుతుందని తెలిపారు. త్వరలో ఈ చిత్రానికి సంబందించిన మరిన్ని విశేషాలతో మీ ముందుకు వస్తామని అన్నారు.లక్కీ లక్ష్మణ్ సినిమాలో సోహెల్, మోక్ష, దేవి ప్రసాద్, రాజా రవీంద్ర, సమీర్, కాదంబరి కిరణ్, షాని సాల్మన్, అనురాగ్, అమీన్, శ్రీదేవి కుమార్, మాస్టర్ రోషన్, మాస్టర్ అయాన్, మాస్టర్ సమీర్, మాస్టర్ కార్తికేయ, ఝాన్సీ, రచ్చ రవి , జబర్దస్త్ కార్తిక్ , జబర్దస్త్ గీతు రాయల్ కామెడీ స్టార్స్ ఫేమ్ యాదం రాజు తదితరులు నటిస్తున్నారు.
    Published by:Sultana Shaik
    First published:

    Tags: Anil Ravipudi, Tollywood, Tollywood actor

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు