దేశంలో మరే ఇండస్ట్రీకి సాధ్యం కాని రీతిలో తెలుగు ఇండస్ట్రీ చాలా త్వరగా కరోనా నుంచి కోలుకుంది. థియేటర్స్ పూర్తి స్థాయిలో ఓపెన్ అయిన తర్వాత వరస విజయాలు వస్తున్నాయి మనకు. ఇప్పటికే 2021లో క్రాక్, ఉప్పెన, జాతిరత్నాలు లాంటి బ్లాక్ బస్టర్స్ వచ్చాయి. దాంతో ఓటిటి రిలీజ్‌లకు కాస్త బ్రేక్ పడింది. అప్పట్లో కొన్ని క్రేజీ సినిమాలు నేరుగా ఆన్‌లైన్‌లో విడుదల చేసారు నిర్మాతలు. అయితే ఇప్పుడు పంథా మారిపోయింది. విడుదలైన మూడు నాలుగు వారాల్లోనే ఓటిటి రిలీజ్ అవుతున్నాయి సినిమాలు. కానీ గాలి సంపత్ మాత్రం విడుదలైన రెండో వారమే ఆహాలో స్ట్రీమ్ అవుతుంది. కనీసం నెల రోజుల గ్యాప్ కూడా లేకపోతే ఇంక థియేటర్స్ వైపు ప్రేక్షకులు ఎలా వస్తారంటూ ప్రశ్నలు తలెత్తుతున్న సమయంలో 8 రోజుల్లోనే ఓటిటికి తమ సినిమాను ఇచ్చేసారు గాలి సంపత్ నిర్మాతలు. అనిల్ రావిపూడి దర్శకత్వ పర్యవేక్షణలో వచ్చిన ఈ చిత్రంలో నట కిరీటి రాజేంద్ర ప్రసాద్, శ్రీవిష్ణు హీరోలుగా నటించారు. మార్చ్ 11న మహా శివరాత్రి కానుకగా విడుదలైన ఈ చిత్రం తొలిరోజే ఈ సినిమాకు నెగిటివ్ టాక్ తెచ్చుకుని డిజాస్టర్‌గా నిలిచింది. ఫుల్ రన్‌లో కనీసం 2 కోట్లు కూడా తీసుకురాలేదు. ఫిఫిఫి భాషలో రాజేంద్రుడు బాగానే చేసినా కథ, కథనం లేకపోవడంతో గాలి సంపత్ గాల్లో కలిసిపోయాడు. దాంతో థియేటర్స్‌లో ఎలాగూ రన్ అవ్వడం లేదని ఓటిటికి ఇచ్చేసారు నిర్మాతలు.
A fa fa fa faaa fun-filled entertainer coming your way!! #GaaliSampath premieres March 19, only on #ahavideoIN.@sreevishnuoffl #DrRajendraPrasad @AnilRavipudi @lovelysingh0508 @YoursSKrishna @achurajamani pic.twitter.com/Q2snVooOT4
— ahavideoIN (@ahavideoIN) March 16, 2021
ఒకవేళ సినిమా ఆడుంటే పరిస్థితి మరోలా ఉండేదేమో..? అనిల్ రావిపూడి పేరుతో ఈ సినిమాను ఆహా వాళ్లు మంచి రేటుకే సొంతం చేసుకున్నారు. వాళ్లకు కూడా వ్యూస్ రావాలంటే త్వరగానే విడుదల చేసుకోవాలి. అందుకే మార్చ్ 19న గాలి సంపత్ ఆహాలో స్ట్రీమ్ అవుతుందంటూ పోస్టర్ కూడా విడుదల చేసారు. ఈ ఏడాది క్రాక్, నాంది లాంటి సూపర్ హిట్ సినిమాలను కూడా కేవలం మూడు వారాల్లోనే ఆహాలో విడుదల చేసారు. ఇప్పుడు గాలి సంపత్ మరీ రెండో వారంలోనే వచ్చేస్తుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Anil Ravipudi, Telugu Cinema, Tollywood