చిరంజీవి పాటకు స్టేజ్‌పై స్టెప్పులేసిన అనిల్ రావిపూడి

రౌడీ అల్లుడు పాట ‘లవ్ మీ మై హీరో’ పాటకు డాన్స్ వేస్తే.. సబ్బు పెట్టె బహుమతిగా వచ్చిందన్నారు.

news18-telugu
Updated: January 6, 2020, 8:52 AM IST
చిరంజీవి పాటకు స్టేజ్‌పై స్టెప్పులేసిన అనిల్ రావిపూడి
రౌడీ అల్లుడు పాట ‘లవ్ మీ మై హీరో’ పాటకు డాన్స్ వేస్తే.. సబ్బు పెట్టె బహుమతిగా వచ్చిందన్నారు.
  • Share this:
సరిలేరు నీకెవ్వరు ప్రీరిలీజ్ ఈవెంట్ లో చిత్ర దర్శకుడు అనిల్ రావిపూడిసైతం స్టేజ్‌పై స్టెప్పులేశారు. వేదికపై మాట్లాడుతూ, తనలో మొట్టమొదట పుట్టిన కళ డ్యాన్స్ అన్నారు.  చిరంజీవి గారిని ఇనిస్పిరేషన్‌గా తీసుకొని తనకు డాన్స్ పై మక్కువ పెరిగిందన్నారు.నాలుగో తరగతిలో అబ్బని తీయని దెబ్బ పాటకు డాన్స్ వేస్తే స్కూల్లో జామిట్రీ బాక్స్ గిఫ్ట్‌గా ఇచ్చారన్నారు. ఆ తర్వాత రౌడీ అల్లుడు పాట ‘లవ్ మీ మై హీరో’ పాటకు డాన్స్ వేస్తే.. సబ్బు పెట్టె బహుమతిగా వచ్చిందన్నారు. స్టేజ్‌పై హమ్ చేస్తూ... డాన్స్ కూడా చేశారు. తాను దర్శకుడ్నయినా, మొదట తానో డ్యాన్సర్ నని చెప్పాడు. లవ్లీ మీ హీరో పాటలో దివ్యభారతి గారిని చిరంజీవి తన కాలిపై కూర్చోబెట్టుకుని వేసే స్టెప్పు తనకెంతో ఇష్టమన్నారు అనిల్. అనిల్ డ్యాన్స్ చేసిన విధానం చిరంజీవి , మహేష్ బాబు ముఖంలో నవ్వులు విరిసాయి.

First published: January 6, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు