హోమ్ /వార్తలు /సినిమా /

వెంకీ ఛాలెంజ్ స్వీకరించిన అనిల్ రావిపూడి.. ఏయే హీరోలను నామినేట్ చేసాడంటే..

వెంకీ ఛాలెంజ్ స్వీకరించిన అనిల్ రావిపూడి.. ఏయే హీరోలను నామినేట్ చేసాడంటే..

అనిల్ రావిపూడి (Twitter/Photo)

అనిల్ రావిపూడి (Twitter/Photo)

ప్రస్తుతం అన్ని సినీ ఇండస్ట్రీస్‌లో కరోనా లాక్‌డౌన్ కారణంగా  షూటింగ్స్ అన్ని రద్దైయాయి. దీంతో సినీ ప్రముఖులంతా ఇంటికే పరిమితమైపోయారు. తాజాగా వెంకటేష్ నిన్న మహేష్ బాబు, వరుణ్ తేజ్‌తో పాటు అనిల్ రావిపూడిని నామినేట్ చేసారు. ఐతే..ఈ ముగ్గురిలో అనిల్ రావిపూడి వెంకీ ఛాలెంజ్‌‌ను పూర్తి చేసి.. తనతో సినిమాలు చేసిన హీరోలను నామినేట్ చేసాడు.

ఇంకా చదవండి ...

    ప్రస్తుతం అన్ని సినీ ఇండస్ట్రీస్‌లో కరోనా లాక్‌డౌన్ కారణంగా  షూటింగ్స్ అన్ని రద్దైయాయి. దీంతో సినీ ప్రముఖులంతా ఇంటికే పరిమితమైపోయారు. అయితే ఈ లాక్ డౌన్ కారణంగా ఇంట్లో పనిమనుషులు రాక పోవడంతో ఇంట్లో ఆడవారికి సాయంగా ఉండాలనీ.. అంతేకాదు ఎవరైతే ఈ కష్టకాలంలో ఆడవారికి తోడుగా ఉంటారో వారే అసలైన మగవారని అర్జున్ రెడ్డి డైరెక్టర్ ఓ వీడియోను షేర్ చేస్తూ రాజమౌళికి మొదటగా ‘బి ది రియల్ మెన్ ఛాలెంజ్’ విసిరాడు. ఒక్కొక్కరుగా అందరు ‘బీ ది రియల్ మేన్’ ఛాలెంజ్‌ను స్వీకరిస్తూ.. వేరే హీరోలను, దర్శకులను నామినేట్ చేస్తున్నారు. తాజాగా నిన్న వెంకటేష్ విసిరిన ‘బీ ది రియల్ మేన్’ ఛాలెంజ్‌లో భాగంగా దర్శకుడు అనిల్ రావిపూడితో పాటు మహేష్ బాబుతో పాటు వరుణ్ తేజ్‌ను నామినేట్ చేసిన సంగతి తెలిసిందే కదా. తాజాగా దర్శకుడు అనిల్ రావిపూడి ఈ చాలెంజ్‌ను స్వీకరించాడు. ప్రస్తుతం అనిల్ రావిపూడి భార్య పుట్టింట్లో ఉన్నట్టుంది. దీంతో ఇంట్లో తల్లి తండ్రులకు తన వంతు సాయం చేసాడు. ఈ సందర్భంగా ఇంట్లో జంధ్యాలగారి ‘వివాహా భోజనంబు’ సినిమా పెట్టుకొని ఇంటి పనులను ఎంతో ఎంజాయ్ చేస్తూ చేసాడు.  అంతేకాదు తన తొలి సినిమా హీరో కళ్యాణ్ రామ్‌తో పాటు సాయి ధరమ్ తేజ్‌తో పాటు రవితేజను బీ ది రియల్ మేన్ ఛాలెంజ్ స్వీకరించమని సవాల్ విసిరాడు. మరి ఈ హీరోలు అనిల్ రావిపూడి ఛాలెంజ్‌ను ఏ రకంగా స్వీకరిస్తారనేది చూడాలి.

    Published by:Kiran Kumar Thanjavur
    First published:

    Tags: Anil Ravipudi, Kalyan Ram Nandamuri, Ravi Teja, Sai Dharam Tej, Tollywood, Venkatesh

    ఉత్తమ కథలు