• HOME
  • »
  • NEWS
  • »
  • MOVIES
  • »
  • ANGRY LOCALS PELTED STONES ON RAKUL PREET SINGH JOHN ABRAHAM MOVIE ATTACK SET IN UTTAR PRADESH SK

Rakul Preet singh: రకుల్ ప్రీత్‌సింగ్ మూవీ సెట్‌పై రాళ్ల దాడి.. అసలేం జరిగిందంటే..

Rakul Preet singh: రకుల్ ప్రీత్‌సింగ్ మూవీ సెట్‌పై రాళ్ల దాడి.. అసలేం జరిగిందంటే..

ర‌కుల్ ప్రీత్ సింగ్

ఉత్తరప్రదేశ్‌లోని ధనిపూర్‌లో అటాక్ మూవీ యాక్షన్ సన్నివేశాల షూటింగ్ జరుగుతోంది. అందులో భాగంగా డమ్మీ బాంబ్‌ను పేల్చారు. చుట్టుపక్కల ప్రజలు ఇబ్బందులు పడకుండా జాగ్రత్తలు తీసుకున్నారు.

  • Share this:
    హాట్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ బిజీ బిజీగా ఉంది. టాలీవుడ్‌పై ఫోకస్ తగ్గించిన ఈ ఢిల్లీ హీరోయిన్.. హిందీలో వరుసగా సినిమాలు చేస్తోంది. ప్రస్తుతం జాన్ అబ్రహం హీరోగా తెరకెక్కుతున్న అటాక్ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్‌గా నటిస్తోంది రకుల్ ప్రీత్ సింగ్. ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఐతే మూవీ చిత్రీకరణ సమయంలో యూనిట్‌కు చేదు అనుభవం ఎదరయింది. సినిమా సెట్‌పై రాళ్ల దాడి చేశారు. ఈ ఘటనలో పలువురికి గాయాలయ్యాయి. ఐతే హీరో హీరోయిన్లకు మాత్రం ఎలాంటి గాయాలు కాలేదని చిత్ర బృందం వెల్లడించింది.

    అసలేం జరిగింది?
    ఉత్తరప్రదేశ్‌లోని ధనిపూర్‌లో అటాక్ మూవీ యాక్షన్ సన్నివేశాల షూటింగ్ జరుగుతోంది. అందులో భాగంగా డమ్మీ బాంబ్‌ను పేల్చారు. చుట్టుపక్కల ప్రజలు ఇబ్బందులు పడకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ఐతే అక్కడ షూటంగ్ జరుగుతుందని తెలుసుకున్న చుట్టుపక్కల గ్రామాల ప్రజలు సెట్ వద్దకు భారీగా చేరుకున్నారు. 'అటాక్' మూవీ నటీ నటులను చూసేందుకు ఎగబడ్డారు. వారిని అడ్డుకునేందుకు సెక్యూరిటీ సిబ్బంది ప్రయత్నించారు. ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని కాస్త గట్టిగానే హెచ్చరించారు. వారి తీరుపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మమ్మల్నే తిడతారా? అని కోపోద్రిక్తులయ్యారు. ఈ క్రమంలోనే సినిమా సెట్‌పై రాళ్లను విసిరారు. పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. స్థానికుల రాళ్ల దాడిలో పలువురు మూవీ యూనిట్ సిబ్బందికి గాయాలయ్యాయి.

    అటాక్ మూవీకి లక్ష్యరాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. జాన్ అబ్రహం, రకుల్ జోడిగా నటిస్తున్న ఈ మూవీ.. స్వాతంత్ర్య దినోత్సవానికి రెండు రోజుల బముందు.. ఆగస్టు 13న విడుదల చేయనున్నట్లు దర్శక నిర్మాతలు ఇప్పటికే ప్రకటించారు. ఈ మూవీతో పాటు మరో మరికొన్ని బాలీవుడ్‌ సినిమాలతో రకుల్ ప్రీత్ సింగ్ బిజీగా ఉంది. అజయ్ దేవగన్ హీరోగా నటిస్తున్న 'మేడే' మూవీలో ఈ ఢిల్లీ బ్యూటీ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్ కూడా కీలక పాత్రలో నటిస్తున్నారు. మేడే చిత్రం ఏప్రిల్ 22న విడుదల కానుంది. రుకుల్ నటించిన నితిన్ మూవీ 'చెక్' ఫిబ్రవరి 26న విడుదల కానుంది.
    Published by:Shiva Kumar Addula
    First published: