Anekal Balaraj 2022 కూడా చిత్ర పరిశ్రమకు అసలు కలిసి రావడం లేదు. కరోనా కాలంలో చాలా మంది సినీ ప్రముఖులు ఈ లోకాన్ని విడిచి వెళ్లారు. ముఖ్యంగా భారతీయ సంగీత ప్రపంచంలో మేన నగధీరురాలు.. భారతరత్న లతా మంగేష్కర్ ఈ లోకాన్ని విడిచివెళ్లారు. మరోవైపు సూపర్ స్టార్ కృష్ణ తనయుడు.. మహేష్ బాబు అన్న రమేష్ బాబు కూడా అకాల మరణం చెందారు. ఆ తర్వాత తన సంగీతంతో ప్రేక్షకులను ఊర్రూతలూగించిన బప్పీలహరి కూడా కన్నుమూయడం సినీ సంగీతాభిమానులను తీవ్ర కలతకు గురి చేసింది. మరోవైపు టాలీవుడ్ సినీ సంగీతంలో తన పాటలతో మైమరిపించిన కందికొండ కాన్సర్‌తో కన్నుమూసారు. ఆ తర్వాత శరత్, తాతినేని రామారావు వంటి దిగ్దర్శకులు కూడా ఈ లోకాన్ని విడిచివెళ్లారు.
తాజాగా కన్నడలో పలు సూపర్ హిట్ చిత్రాలను నిర్మించిన ప్రముఖ నిర్మాత అనేకల్ బాలరాజ్ రోడ్ యాక్సిడెంట్‌లో కన్నుమూసారు. ఈయన మృతిపై కన్నడ చిత్రసీమలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆయన మృతిపై కన్నడ చిత్ర ప్రముఖులు నివాళులు అర్పిస్తున్నారు. ఈయన బెంగళూరులోని జేపీ నగరలో ఆయన ఇంటి వద్ద ఆదివారం మార్నింగ్ వాక్ కోసం బయలు దేరారు. ఈ సందర్భంగా ప్రతిరోజులాగే తన కారులో ఓ పార్క్ వద్ద వచ్చి రోడ్డు దాటుతుండగా ఇంతలోనే వేగంగా అటువైపు నుంచి వచ్చిన ఓ వాహనం ఈయన్ని బలంగా ఢీ కొట్టింది.
ఈ యాక్సిడెంట్‌లో ఆయన తలకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే ఆయన్ని సమీపంలోని ఓ ప్రైవేటు హాస్పిటల్‌కు తరలించారు. వైద్యులు ఆయన్ని వెంటిలేటర్ పై చికిత్స అందించినా.. ఈ రోజు ఉదయం 10 గంటలకు మృతి చెందారు. ఈయన 2003లో దర్శన్‌తో నిర్మించిన ‘కరియా’ చిత్రంతో నిర్మాతగా శాండిల‌్‌వుడ్‌లో అడుగుపెట్టారు. ఆ తర్వాత పలు సూపర్ హిట్ చిత్రాలను నిర్మించారు. ఇక 2009లో ఈయన ‘కెంప’ చిత్రంతో తన కుమారుడిని నటుడిగా పరిచయం చేశారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Kannada Cinema, Sandalwood