విక్టరీ వెంకటేష్ (Venkatesh ) ఆ మధ్య ఎఫ్3లో తన కామెడీతో అలరించిన సంగతి తెలిసిందే. ఆ సినిమా తర్వాత వెంకీ, రానాతో కలిసి రానా నాయుడు (Rana Naidu) అనే ఓ వెబ్ సిరీస్ చేశారు. ఇటీవల స్ట్రీమింగ్‌కు వచ్చిన ఈ వెబ్ సిరీస్ ప్రస్తుతం మంచి ఆదరణ పొందుతోంది. ఇక అది అలా ఉంటే వెంకీ తన 75వ సినిమాను యువ దర్శకుడు శైలేష్ కొలను(Sailesh Kolanu)తో చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సైంధవ్ (Saindhav) అనే పేరును ఖరారు చేశారు. మంచి అంచనాల నడుమ వస్తోన్న ఈచిత్రం ఇటీవలే షూటింగ్‌ను షురూ చేయనుంది. దీనికి సంబంధించి చిత్రబృందం ఓ ప్రకటన విడుదల చేసింది. ఇక అది అలా ఉంటే ఈ సినిమాలో హీరోయిన్‌గా తమిళ నటి ఆండ్రియా జర్మియాను ఓకే చేసినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. గతంలో ఆండ్రియా జర్మియా పలు తెలుగు సినిమాల్లో నటించింది. నాగ చైతన్య తడాఖాలో ఆండ్రియా నటించిన సంగతి తెలిసిందే.
ఇక సైంధవ్ సినిమాపై మంచి అంచనాలున్నాయి. గ్లింప్స్ అంటూ సినిమా ప్రకటన సమయంల విడుదల చేసిన ఓ చిన్న వీడియో మంచి రెస్పాన్స్‌ను దక్కించుకుంది. ఈ సినిమా యాక్షన్ ఎంటర్టైనర్‌గా వస్తున్నట్లు తెలుస్తోంది. హిట్ (Hit) సినిమాలతో మంచి క్రేజ్ తెచ్చుకున్న శైలేష్ కొలను ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సిరీస్‌లో వచ్చిన రెండు చిత్రాలు బాగానే హిట్ అయ్యాయి. ఈ సినిమాలో కీలకపాత్రలో హిందీ నటుడు నవాజ్జుద్దీన్ సిద్ధిఖీ నటుస్తున్నారు.
Happy Ugadi! #Saindhav@Nawazuddin_S @maniDop @vboyanapalli @Music_Santhosh @tkishore555 @NiharikaEnt #Venky75 @Garrybh88 #avinashkolla @SVR4446 @NeerajaKona @NenuMeeRamm @Sekharmasteroff pic.twitter.com/3RJ37eQRnS
— Venkatesh Daggubati (@VenkyMama) March 22, 2023
ఈ సినిమాను నానితో శ్యామ్ సింగ రాయ్ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించి, విజయాన్ని అందుకున్న వెంకట్ బోయనపల్లి నిహారిక ఎంటర్టైన్మెంట్స్ పై నిర్మిస్తున్నారు. సంతోష్ నారయణ్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా ప్యాన్ ఇండియా స్థాయిలో భారీగా నిర్మితమవుతోంది. తెలుగుతో పాటు హిందీ, తమిళ్, కన్నడ, మలయాళీ భాషల్లో విడుదలకానుంది.
This is Huge Update ????????#SAINDHAV #VenkateshDaggubati #andreajeremiah Follow us ???? @tollymasti pic.twitter.com/Xl8VcULgMf
— Tollymasti (@tollymasti) March 26, 2023
ఇక వెంకటేష్ సినిమాల విషయానికి వస్తే.. వెంకటేష్ ఇటీవల యువ హీరో విశ్వక్ సేన్ హీరోగా వచ్చిన ఓరి దేవుడాలో ఓ కీలకపాత్రలో కనిపించారు. ఈ సినిమా అనుకున్న రేంజ్‌లో ఆకట్టుకోలేకపోయింది. ఇక వెంకీ అంతకు ముందు ఎఫ్ 3 అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించారు. ఈ సినిమా ఎఫ్2కు సీక్వెల్‌గా వచ్చింది. అనుకున్న రేంజ్‌లో ఆకట్టుకోలేకపోయింది. ఈ సినిమాకు ముందు వెంకీ నారప్ప, దృశ్యం2 వంటి సినిమాలతో ముందుకొచ్చారు. అయితే ఈ సినిమాలు డైరెక్ట్‌గా ఓటీటీలో విడుదలై మంచి ఆదరణ పొందాయి.
Ab jaakar kuch bombaat lagra yeh poster! ???? #RanaNaidu dekhkar tum bhi bolenge ki #NagaNaidu hona mangta. NOW STREAMING, only on @NetflixIndia!@RanaDaggubati @krnx @suparn #SunderAaron #SurveenChawla @nowitsabhi @sushant_says @AshishVid @gauravchopraa @rajeshjais1 pic.twitter.com/fhW7pHVukn
— Venkatesh Daggubati (@VenkyMama) March 10, 2023
ఇక వెంకటేష్ నటిస్తున్న వెబ్ సిరీస్ ‘రానా నాయుడు’ విషయానికి వస్తే.. ఈ వెబ్ సిరీస్ హిందీతో పాటు తెలుగు, తమిళంతోపాటు ఇతర దక్షిణాది భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ వెబ్ సిరీస్‌లో వెంకటేష్ సాల్ట్ అండ్ పెప్పర్ లుక్‌లో కనిపించారు. గతంలో వీళ్లిద్దరు ‘కృష్ణం వందే జగద్గురుమ్’ సినిమాలో ఓ పాటలో దగ్గుబాటి బాబాయి అబ్బాయి కలిసి నటించారు. కానీ వీళ్లిద్దరు పూర్తి స్థాయిలో మాత్రం నటించలేదు. ఇపుడు ఆ కోరిక ఈ వెబ్ సిరీస్‌తో నెరవేరింది. మీర్జాపూర్, ది ఫ్యామిలీ మ్యాన్ లాంటి సిరీస్‌లకు పనిచేసిన సుపన్ వర్మ, కరణ్ అన్షుమాన్ డైరెక్ట్ చేసారు. థ్రిల్లర్ ఎలిమెంట్‌తో వెంకటేష్, రానా నెట్‌ప్లిక్స్‌లో సందడి చేస్తోంది.
ఇక దర్శకుడు శైలేష్ కొలను విషయానికి వస్తే.. మంచి అంచనాల నడుమ వచ్చిన హిట్ 2 సినిమా మొదటి ఆట నుంచి పాజిటివ్ టాక్‌తో అదరగొట్టింది.. థియేట్రికల్ రన్ పూర్తి అవ్వడంతో ఈ సినిమా ప్రముఖ ఓటీటీ అమెజాన్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. హిట్ యూనివర్స్ మూడో సినిమా హిట్3 త్వరలో రానుంది. ఈ సినిమాలో నాని హీరోగా నటిస్తున్నారు. త్వరలో షూటింగ్‌కు వెళ్లనుంది. ఈ సినిమాలో నాని అర్జున్ సర్కార్ అనే పాత్రలో కనిపించనున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Saindhav Movie, Tollywood news