హోమ్ /వార్తలు /సినిమా /

Theatres Ticket Rates: టికెట్ రేట్స్ తగ్గింపు.. థియేటర్స్ మూసుకుంటున్న ఎగ్జిబిటర్లు..

Theatres Ticket Rates: టికెట్ రేట్స్ తగ్గింపు.. థియేటర్స్ మూసుకుంటున్న ఎగ్జిబిటర్లు..

2. Non AC థియేటర్లలో కనిష్ఠం రూ.30+GST.. గరిష్ఠం రూ.70+GST

2. Non AC థియేటర్లలో కనిష్ఠం రూ.30+GST.. గరిష్ఠం రూ.70+GST

Theatres Ticket Rates: జనవరి నుంచి వరసగా సినిమాలు వస్తుండటంతో కాస్తో కూస్తో కుదుటపడింది ఇండస్ట్రీ. పెద్ద సినిమాలు విడుదలైతే మళ్లీ కచ్చితంగా పరిస్థితులన్నీ సెట్ అయిపోతాయి.. థియేటర్స్ వ్యవస్థ కూడా గాడిన పడుతుందని ఎగ్జిబిటర్లు భావించారు.

ఇంకా చదవండి ...

ఇప్పటికే కరోనా కారణంగా సినిమా ఇండస్ట్రీ దారుణంగా నష్టపోయింది. ఒకటి రెండు కాదు వేల కోట్ల రూపాయలు మట్టిలో కలిసిపోయాయి. ఇప్పుడిప్పుడే సినిమాలు వస్తున్నాయి.. విజయాలు కూడా వస్తుండటంతో ఊపిరి పీల్చుకుంటున్న నిర్మాతలకు మళ్లీ కరోనా వైరస్ రెండో దశ నరకంలా మారిపోయింది. గతేడాది లాక్ డౌన్ కారణంగా థియేటర్ వ్యవస్థ దాదాపు మూతపడిపోయింది. దేశవ్యాప్తంగా ఉన్న ఎన్నో వందల థియేటర్స్ కళ్యాణ మంటపాలుగా మారిపోయాయి. కొన్ని గోదౌన్స్ అయిపోయాయి. మిగిలిన వాటిని ఇప్పుడు నడిపిస్తున్నారు. అయితే జనవరి నుంచి వరసగా సినిమాలు వస్తుండటంతో కాస్తో కూస్తో కుదుటపడింది ఇండస్ట్రీ. పెద్ద సినిమాలు విడుదలైతే మళ్లీ కచ్చితంగా పరిస్థితులన్నీ సెట్ అయిపోతాయి.. థియేటర్స్ వ్యవస్థ కూడా గాడిన పడుతుందని ఎగ్జిబిటర్లు భావించారు. థియేటర్స్ ఓనర్స్ అంతా ఈ నమ్మకంతోనే ఉన్నారు. అయితే ఇప్పుడు ఏపీలో వచ్చిన కొత్త జీవో కారణంగా అసలుకే మోసం వచ్చేలా కనిపిస్తుంది. పవన్ కళ్యాణ్ ‘వకీల్ సాబ్’ విడుదల తర్వాత ప్రేక్షకులు సినిమా హాళ్లకు మునుపటిలా అలవాటు పడతారని ఆశించారు.

అయితే ఆంధ్ర ప్రదేశ్‌లో ఇప్పుడు తీసుకున్న నిర్ణయాలు థియేటర్స్‌పై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. పెద్ద సినిమాల విడుదల సమయంలో టికెట్ ధరలు పెంచడం ఎప్పటి నుంచో జరుగుతుంది. మొన్న విడుదలైన వైల్డ్ డాగ్, సుల్తాన్ వరకు వరకు కూడా ఇదే సాగింది.

vakeel saab movie ticket price ap high court,cinema ticket prices hiked,govt hike movie ticket price in ap,movie ticket price hike in telangana,movie ticket prices hiked in telangana,film ticket rates hiked in telangana,vakeel saab movie,movie theatres hike ticket prices in state,movie tickets prices in telangana,movie ticket price hike,movie tickets price,maharshi movie ticket price hike,vakeel saab movie ticket price,go over movie ticket price hike,టికెట్ రేట్స్ పెంపు,ఏపీలో సినిమా టికెట్ రేట్స్ పెంపు,తెలుగు సినిమా,థియేటర్స్ బంద్
సినిమా థియేటర్స్ (Movie Theatres)

అయితే వకీల్ సాబ్ సినిమాకు మాత్రం ఆ వెసులుబాటు తొలగించింది ఏపీ ప్రభుత్వం. నార్మల్ ధరలకే టికెట్లు విక్రయించాలని ఆదేశాలిచ్చింది. కోర్టు కూడా మూడు రోజులకు మించి టికెట్ రేట్లు పెంచొద్దని ఆర్డర్ పాస్ చేసింది. దీంతో డిస్ట్రిబ్యూటర్లు గగ్గోలు పెడుతున్నారు. పాత జీవో ప్రకారమే టికెట్లను విక్రయించాలని లేదంటే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రాత్రికి రాత్రే గవర్నమెంట్ ఇచ్చిన కొత్త జీవో ప్రకారం అమ్ముకుంటే తమకు నష్టాలు తప్పవని.. థియేటర్స్ అన్నీ మూసుకుని కూర్చోవాల్సిందే అంటూ వాళ్లు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు.

vakeel saab movie ticket price ap high court,cinema ticket prices hiked,govt hike movie ticket price in ap,movie ticket price hike in telangana,movie ticket prices hiked in telangana,film ticket rates hiked in telangana,vakeel saab movie,movie theatres hike ticket prices in state,movie tickets prices in telangana,movie ticket price hike,movie tickets price,maharshi movie ticket price hike,vakeel saab movie ticket price,go over movie ticket price hike,టికెట్ రేట్స్ పెంపు,ఏపీలో సినిమా టికెట్ రేట్స్ పెంపు,తెలుగు సినిమా,థియేటర్స్ బంద్
సినిమా థియేటర్స్ (Movie Theatres)

గ్రామ పంచాయతీల్లో ఏపీ థియేటర్లలో టికెట్ రేట్లు 20, 15, 10 రూపాయలుగా ఉన్నాయి. అదే నాన్ ఏసీ థియేటర్లలో 15, 10, 5 రూపాయలుగా ఉన్నాయి. నగర పంచాయితీల్లో ఏసీ థియేటర్ల హయ్యస్ట్ రేట్ 35 రూపాయలు మాత్రమే. అదే మున్సిపాలిటీల్లో హయ్యస్ట్ రేట్ 70 రూపాయలకు మించకూడదని జీవోలో తెలిపారు. ఈ ధరలతో థియేటర్లు నడపడం అసాధ్యమని అంటున్నారు థియేటర్ యజమానులు. ఈ రేట్స్ తట్టుకోలేక కొన్ని గ్రామ పంచాయతీల్లో సినిమా హళ్లు మూసేశారు కూడా. పరిస్థితి ఇలాగే ఉంటే బోలెడంత డబ్బు పెట్టి రెన్యుయేషన్ చేసుకున్న థియేటర్ యజమానులు కష్టాల్లో పడటం ఖాయం. మరి దీనిపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏం ఆలోచిస్తుందో చూడాలిక.

Published by:Praveen Kumar Vadla
First published:

Tags: Telugu Cinema, Theatres, Tollywood

ఉత్తమ కథలు