Home /News /movies /

ANDHRA PRADESH MOVIE TICKETS ISSUE MOHAN BABU LONG LETTER TO THE FILM INDUSTRY GOES VIRAL SR

Mohan Babu : ఏపీ సినిమా టిక్కెట్లు.. సినీ ఇండస్ట్రీకి మోహన్ బాబు సుదీర్ఘ లేఖ..

Mohan Babu Photo : Twitter

Mohan Babu Photo : Twitter

Tollywood | Mohan Babu : ఏపీలో సినిమా టిక్కెట్ల రేట్ల కారణంగా గత కొన్ని నెలలుగా సినీ ఇండస్ట్రీలో చర్చ జరుగుతోన్న సంగతి తెలిసిందే. సినీ పెద్దలు పలుమార్లు ఏపీ మంత్రులను కలిసి తమ కోరికలను విన్నవించారు. అయితే ఈ విషయంలో ఇంకా అనిశ్చితి అలానే ఉంది.

ఇంకా చదవండి ...
  ఏపీలో సినిమా టిక్కెట్ల రేట్ల కారణ:గా గత కొన్ని నెలలుగా సినీ ఇండస్ట్రీలో చర్చ జరుగుతోన్న సంగతి తెలిసిందే. సినీ పెద్దలు పలుమార్లు ఏపీ మంత్రులను కలిసి తమ కోరికలను విన్నవించారు. అయితే ఈ విషయంలో ఇంకా అనిశ్చితి అలానే ఉంది. టిక్కెట్ల రేట్లు మరి తక్కువుగా ఉన్నాయని సినీ ఇండస్ట్రీ పెద్దల వాదన. దీంతో పలు సినిమాలు వాయిదా పడుతుండగా.. కొన్ని మాత్రం విడుదలై ఓకే అనిపించుకుంటున్నాయి. ఇక ఇదంతా ఇలా ఉంటే ఈ టిక్కెట్ల రేట్ల విషయంలో పలు మార్లు చిరంజీవి ప్రత్యేక శ్రద్ద తీసుకుని.. ఈ విషయాన్ని ఏపీ సీఎం జగన్ దృష్టికి తీసుకువెళ్లాలనీ గట్టిగా ప్రయత్నించారు. అయితే ఆ విషయంలో పెద్దగా పురోగతి కనిపించలేదు. అంతేకాదు. ఈ విషయం గూర్చి మాట్లాడానికి చిరంజీవికి (Chiranjeevi) ఏపీ సీఎం జగన్ అపాయింట్ మెంట్ కూడ దొరకలేదని మరో టాక్. ఈ నేపథ్యంలో తాజాగా చిరంజీవి కొంత విసుగు చెందినట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే తాజాగా సినీ ఇండ‌స్ట్రీకి పెద్ద అని అనిపించుకోవ‌డం త‌న‌కు ఇబ్బంది అని, పెద్ద‌రికం అనే హోదా త‌న‌కిష్టం లేద‌ని అన్న మాటలు ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారాయి. తాను పెద్ద‌గా ఉండ‌న‌ని, కానీ బాధ్య‌త‌గ‌ల బిడ్డ‌గా ఉంటాన‌ని చిరంజీవి తాజాగా కామెంట్స్ చేశారు. ఈ నేప‌థ్యంలో న‌టుడు మోహ‌న్ బాబు (Mohanbabu) బ‌హిరంగ లేఖ రాయ‌డం సోషల్ మీడియాలో కొంత చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

  మోహ‌న్ బాబు రాసిన లేఖ...

  మనకెందుకు మనకెందుకు అని మౌనంగా వుండాలా... నా మౌనం చేతకానితనం కాదు... చేవలేనితనం కాదు. కొంతమంది శ్రేయోభిలాషులు వద్దని వారించారు. నీ మాటలు నిక్కచ్చిగా వుంటాయ్‌.. కఠినంగా వుంటాయ్‌... కానీ నిజాలే వుంటాయ్‌. ఇతరుల్ని ఇబ్బంది పెట్టడం ఎందుకు? ఇది నీకు అవసరమా అన్నారు. అంటే వాళ్ళు చెప్పినట్టు బతకాలా.. నాకు నచ్చినట్టు బతకాలా... అనే ప్రశ్న ఎదురైంది. దానికి సమాధానమే ఇది.


  సినిమా ఇండస్ట్రీ అంటే నలుగురు హీరోలు, నలుగురు ప్రొడ్యూసర్స్‌ నలుగురు డిస్ట్రిబ్యూటర్స్‌ కాదు... కొన్ని వేలమంది ఆశలు, కొన్ని వేల కుటుంబాలు... కొన్ని వేల జీవితాలు... 47 సంవత్సరాల అనుభవంతో చెప్తున్న మాట... అందరి జీవితాలతో ముడిపడిన ఈ సినిమా ఇండస్ర్రీ గురించి మనకు ఉన్న సమన్యల గురించి ముఖ్యమంత్రులకు వివరించాలనుకుంటే అందరూ కలిసి ఒకచోట సమావేశమై సమస్యలు ఏంటి, పరిష్కారాలు ఏంటి... ఏది చేస్తే నినీ పరిశ్రమకి మనుగడ వుంటుంది అని చర్చించుకోవాలి.

  ఆ తర్వాత మాత్రమే సినిమాటోగ్రఫీ మంత్రుల్ని రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల్ని కలిసిగట్టుగా కలవాలి. అలా కాకుండా నలుగుర్షే రమ్మన్నారు. ప్రొడ్యూసర్స్‌ నుంచి నలుగురు, డిస్ట్రిబ్యూటర్స్‌ నుంచి ఓ ముగ్గురు, హీరోల నుంచి ఇద్దరు, ఏంటిది..! మళ్లీ మళ్లీ చెప్తున్నా సినిమా పరిశ్రమలో ఒకరు ఎక్కువ, ఒకరు తక్కువ కాదు... అందరూ సమానం... ఏ ఒక్కరి గుత్తాధిపత్యం కాదు. చిన్న నిర్మాతల్ని కూడా కలుపుకుని ముఖ్యమంత్రుల దగ్గరకి వెళ్టి సమన్యల్ని వివరిస్తే మనకీరోజు ఇన్ని కష్టాలు వచ్చుండేవి కావు.

  Janhvi Kapoor : పొట్టి నిక్కరులో వావ్ అనిపించిన జాన్వీ.. వైరల్ అవుతోన్న పిక్స్..

  సినీ పరిశ్రమలో ఒక పార్టీ వాళ్ళు ఉండొచ్చు, లేదా వేరు వేరు పార్టీల వాళ్ళు ఉండొచ్చు అది వాళ్ట ఇష్టం, కాదనను. కాన్‌ ప్రజలు గెలిపించిన ముఖ్యమంత్రుల్ని ముందుగా మనం కలవాలి... వాళ్టని మనం గౌరవించుకోవాలి... మన కష్టసుఖాలు చెప్పకోవాలి..!
  అలా జరిగిందా? జరగలేదు. నేను 'మా' అధ్యక్షుడిగా ఉన్న టైంలో సినీ పరిశ్రమలో ఉన్న ప్రముఖలందర్షి కలుపుకొని ఒక్కటిగా వెళ్ళి అప్పటి సి.ఎం. డా రాజశేఖర్‌ రెడ్డి గారిని కలిసి పైరసీ కోరల్లో సినిమా నలిగిపోతుంది, మా మీద దయచూపి బిక్ష పెట్టండి అనగానే, ఆ మాట చాలా మందికి నచ్చలేదు... కానీ ఆయన్ని కదిలించింది. చాలావరకు పైరనీని కట్టడి చేసింది, సినిమా ఇండస్ట్రీకి ఉపయోగపడే పనులు చాలావరకు చేసిపెట్టింది అప్పటి ప్రభుత్వం.

  Vijay Devarakonda | Liger : దంచికొడుతోన్న విజయ్ లైగర్ ఫస్ట్ గ్లింప్స్.. ఆల్ టైమ్ రికార్డ్..

  350 రూపాయలు, 3౦00 రూపాయల టికెట్ల రేట్లతో చిన్న సినిమాలు నిలబడ్డం కష్టం. 50 రూపాయలు, 30 రూపాయలు టికెట్ల రేట్లతో పెద్ద సినిమాలు నిలబడ్డం కష్టం. చిన్న సినిమాలు ఆడాలి... పెద్ద సినిమాలు ఆడాలి... దానికి సరైన ధరలుండాలి. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల్ని కలిసి 'అయ్యా. మా సినీ రంగం పరిస్థితి ఇది... చిన్న సినిమాల్ని పెద్ద సినిమాల్ని దృష్టిలో పెట్టుకుని మనకి న్యాయం చేయమని అడుగుదాం. సినిమా పరిశ్రమలో 24 క్రాఫ్ట్‌ వున్నాయి. మా అందరికీ దేవుళ్ళు నిర్మాతలు... కానీ ఈరోజున ఆ నిర్మాతలు ఏమయ్యారు?

  అసలు ప్రొడ్యూసర్‌ కౌన్సిల్‌ సమస్యను భుజాల మీద వేసుకోకుండా ఎవరికి వారే యమునాతీరే అన్నట్టు ఎందుకు మౌనం వహిస్తుందో అర్థం కావట్లేదు. మీరు ముందుకు రావాల్సిన అవసరం ఉంది, ఒక్కటిగా ఉంటేనే సినిమా బ్రతుకుతుంది.
  రండి అందరం కలిసి సినిమాని బతికిద్దాం.. అంటూ ఓ సుదీర్ఘమైన నోట్‌ను ఆయన విడుదల చేశారు. ఆయన రాసిన లెటర్ ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చూడాలి మ‌రి మోహన్ బాబు రాసిన ఈ లేఖ‌పై సినీ పెద్ద‌లు ఎలా స్పందిస్తారో.
  Published by:Suresh Rachamalla
  First published:

  Tags: Mohan Babu, Tollywood news

  తదుపరి వార్తలు