Pawan Kalyan - Sampoornesh Babu: మా దృష్టిలో పవన్ కళ్యాణ్.. సంపూర్ణేష్ బాబు ఇద్దరూ ఒకటే: మంత్రి అనిల్ కుమార్

Pawan Kalyan - Sampoornesh Babu

 Pawan Kalyan - Sampoornesh Babu: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రిపబ్లిక్ సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో భాగంగా వైసీపీ ప్రభుత్వాన్ని ఉద్దేశించి పలు కీలక వ్యాఖ్యలు చేసిన సంగతి మనకు తెలిసిందే. కేవలం పవన్ కళ్యాణ్ కోసమే తెలుగు సినిమా

  • Share this:
    Pawan Kalyan - Sampoornesh Babu: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రిపబ్లిక్ సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో భాగంగా వైసీపీ ప్రభుత్వాన్ని ఉద్దేశించి పలు కీలక వ్యాఖ్యలు చేసిన సంగతి మనకు తెలిసిందే. కేవలం పవన్ కళ్యాణ్ కోసమే తెలుగు సినిమా ఇండస్ట్రీని ఇబ్బందుల్లో పెడుతున్నాం అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలపై ఏపీ మంత్రులు వరుసగా స్పందిస్తూ ఘాటుగా సమాధానం చెప్పారు. ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్ జల వనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ ఇదే విషయం గురించి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మా దృష్టిలో పెద్ద హీరో చిన్న హీరో ఇద్దరూ సమానమే... ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ప్రతి ఒకటి ఎంతో పారదర్శకంగా జరగాలన్న ఉద్దేశంతోనే ప్రభుత్వం ఈ విధమైనటువంటి నిర్ణయం తీసుకుందని అనిల్ కుమార్ తెలియజేశారు.

    కేవలం పవన్ కళ్యాణ్ కోసం మేము ఇండస్ట్రీని ఇబ్బంది పెట్టాలా? ఆయనని దృష్టిలో పెట్టుకుని ఈ సినిమా ఇండస్ట్రీని ఇంత ఇబ్బంది పెట్టాల్సిన అవసరం లేదు. మా ప్రభుత్వం అప్పుల్లో ఉందని సినిమా టికెట్లు రేట్లు పెంచుతున్నామని చేస్తున్న ఆరోపణల్లో నిజం లేదు. మాకు డబ్బు అవసరమైతే టికెట్లు రేట్లు పెంచుతాం కానీ ఇలా ఆన్లైన్ టికెటింగ్ నిర్ణయం తీసుకోమని తెలిపారు.

    ప్రభుత్వానికి హీరోలు అందరూ సమానులే. చిన్న హీరో అయిన పెద్ద హీరో అయినా సినిమా చేయాలంటే తప్పకుండా కష్టపడాల్సి ఉంటుంది. అలాంటప్పుడు పెద్ద హీరో సినిమాకు ఒక రేటు చిన్న హీరో సినిమాకు ఒక రేటు ఎలా ఉంటుంది. మేమందరం కళామతల్లి ముద్దుబిడ్డలమే మా దృష్టిలో పవన్ కళ్యాణ్, సంపూర్ణేష్ బాబు ఇద్దరు ఒకటే. పెద్ద హీరో సినిమాకు 200 రూపాయల టిక్కెట్టు పెడితే అది అభిమానం కాదు. వారి అభిమానాన్ని వీళ్ళు క్యాష్ చేసుకోవడం అంటూ అనిల్ కుమార్ పవన్ కళ్యాణ్ వాక్యాలకు ఘాటుగా స్పందించారు.

    మంత్రి అనిల్ కుమార్ మాట్లాడిన మాటలకు సంపూర్ణేష్ బాబు స్పందించారు. తనని పవన్ కళ్యాణ్ తో పోల్చినందుకు ఎంతో సంతోషం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే ఎలాంటి సమస్య వచ్చినా పెద్ద మనసుతో స్పందించి సహాయసహకారాలు చేసే చిత్ర పరిశ్రమ ప్రస్తుతం ఎన్నో ఇబ్బందులలో ఉంది. ముఖ్యంగా ఎగ్జిబిటర్లు ఎన్నో కష్టాలను ఎదుర్కొంటున్నారు. ముందుగా వారి సమస్యలను పరిష్కరించాలని ఈ సందర్భంగా ఏపీ ప్రభుత్వాన్ని సంపూర్ణేష్ బాబు కోరారు.
    Published by:Navya Reddy
    First published: