జూనియర్ ఎన్టీఆర్ ను కలిసిన చంద్రబాబు నాయుడు..

మొన్నటి ఎన్నికల్లో జూనియర్ ఎన్టీఆర్.. తెలుగు దేశం పార్టీ తరుపున ఎలాంటి  ప్రచారం నిర్వహించలేదు. ఎన్నికల తర్వాత చంద్రబాబు నాయుడు ..జూనియర్ ఎన్టీఆర్‌ను కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది.

news18-telugu
Updated: August 18, 2019, 3:15 PM IST
జూనియర్ ఎన్టీఆర్ ను కలిసిన చంద్రబాబు నాయుడు..
చంద్రబాబు నాయుడు,జూ ఎన్టీఆర్ (ఫైల్ ఫోటో)
  • Share this:
మొన్నటి ఎన్నికల్లో జూనియర్ ఎన్టీఆర్.. తెలుగు దేశం పార్టీ తరుపున ఎలాంటి  ప్రచారం నిర్వహించలేదు. అంతకు ముందు తెలంగాణ ఎన్నికల్లో సొంత అక్క సుహాసిని పోటీ చేసినా.. ప్రచారానికి దూరంగా ఉన్నారు. మొన్నటి ఎన్నికల్లో జూనియర్ మామ నార్నే శ్రీనివాసరావు  వైసీపీలో జాయిన్ అయిన సంగతి తెలిసిందే. గత కొన్ని రోజులుగా తెలుగు దేశం పార్టీకి దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల్లో ఏపీలో చంద్రబాబు నాయకత్వంలోని టీడీపీ కేవలం 23 సీట్లకే పరిమితం అయింది. ఆ తర్వాత జూనియర్, చంద్రబాబు నాయుడు కలిసింది లేదు. తాజాగా చంద్రబాబు నాయుడు,జూనియర్ ఎన్టీఆర్‌ను వాళ్లింట్లో కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. గతేడాది ఆగష్టు 29న రోడ్డు ప్రమాదంలో హరికృష్ణ కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఈ 29 వస్తే..యేడాది పూర్తవుతుంది. కానీ తెలుగు పంచాగం ప్రకారం హరికృష్ణ పుణ్యతిథి ఈ రోజు కావడంతో.. చంద్రబాబు నాయుడు ..జూనియర్ ఎన్టీఆర్‌ ఇంట్లో హరికృష్ణ సంవత్సరీకానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్‌తో పాటు కళ్యాణ్ రామ్‌ను కలిసారు చంద్రబాబు నాయుడు. ఈ సందర్భంగా వీళ్లిద్దరి మధ్య కుటుంబ విషయాలు మాట్లాడుకున్నట్టు సమాచారం. మరోవైపు చంద్రబాబు, తారక్ మధ్య ఏమైనా రాజకీయాలు చర్చకు వచ్చాయా లేదా అనే విషయం బయటకు రాలేదు.

First published: August 18, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు