జగన్ ప్రభుత్వం (AP CM Jagan) ఇటీవల సినీ నటుడు, కమెడియన్ ఆలీకి (Comedian Ali) ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుడిగా ((Electronic Media Advisor to AP Govt)) నియమిస్తూ ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఇక తాజాగా మరో నటుడు వైసీపీ సానుభూతిపరుడు పోసాని కృష్ణమురళికి (Posani Krishna Murali) కూడా మరో కీలకపదవిని ముట్ట జెప్పారు. పోసాని కృష్ణమురళీని తాజాగా ఏపీ ఫిలిమ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ గా ((AP Film Development Corporation Chairman)) నియమించింది. దీనికి సంబంధించి ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సినీ నటుడు పోసాని కృష్ణ మురళి గత కొన్ని సంవత్సరాలుగా వైసీపీ పార్టీలోనే ఉంటున్నారు. అంతేకాదు 2019 ఎన్నికల్లో వైసీపీ పార్టీ తరఫున జోరుగా ప్రచారం కూడా చేశారు పోసాని. ఇక మరోవైపు వీలున్నప్పుడల్లా పోసాని జనసేన పార్టీ (Janasena Party) పై, అధినేత పవన్ కళ్యాణ్‌పై (Pawan Kalyan) విమర్శలు చేయడం వంటివి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏపీ సీఎం జగన్, పోసానికి ఈ కీలకపదవిని కట్టబెట్టినట్లు తెలుస్తోంది.
ఇక ఆలీ ((Comedian Ali) ) కూడా వైసీపీకి చాలా దగ్గరగా ఉంటున్న సంగతి తెలిసిందే. నటుడుగా తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న అలీ, 2019 ఎన్నికల ముందు వైసీపీలో చేరి ఆ పార్టీ తరుపునా ప్రచారం కూడా చేశారు. ఇక పార్టీ అధికారంలోకి వస్తే అలీకి మంచి పదవి ఖాయం అంటూ ప్రచారం జరిగింది. అందులోనే భాగంగా ఆలీకి కాస్తా లేటుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుడిగా (Electronic Media Advisor to AP Govt) నియమించారు.
ఇక ఆలీ సినిమాల విషయానికి వస్తే.. ఆయన తాజాగా ‘‘అందరూ బాగుండాలి అందులో నేనుండాలి’’ (Andaru Bagundali Andulo Nenundali) చిత్రం అక్టోబర్ 28 నుండి ఆహా (Aha) ఓటీటీ ప్లాట్ఫామ్లో స్ట్రీమ్ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తోంది. నరేశ్, అలీలు హీరోలుగా చేశారు. దర్శకుడు శ్రీపురం కిరణ్ ఒక మలయాళ సినిమాని తీసుకుని తెలుగు ప్రేక్షకులకు నచ్చేలా చాలా మార్పులు, చేర్పులు చేసి తీశారు. ఈ సినిమాను అలీ తన సొంత బ్యానర్ ఆలీవుడ్ ఎంటర్టైన్మెంట్స్పై నిర్మించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Ap cm jagan, Posani Krishna Murali