Ravi- Lasya: ఒకప్పుడు బుల్లితెరపై క్రేజీ జంటగా పేరు సంపాదించుకున్న రవి-లాస్యలు ఆ తరువాత పలు కారణాలతో వారి స్నేహ బంధాన్ని తెంచుకున్నారు.. కారణాలు ఏవైనా దాదాపు ఐదు సంవత్సరాల పాటు వీరిద్దరు కలిసి ఎక్కడా కనిపించలేదు. అయితే ఈ ఏడాది మళ్లీ ఆ ఇద్దరు కలిశారు. సంక్రాంతి సందర్భంగా స్టార్ మాలో ప్రసారమైన ఇట్స్ ఎ ఫ్యామిలీ పార్టీ ప్రోగ్రామ్‌కు ఈ ఇద్దరు హోస్ట్‌లుగా వ్యవహరించారు. ఈ సందర్భంగా వారిద్దరు గత అనుభవాలను గుర్తు చేసుకుంటూ ఇకపై మంచి స్నేహితులుగా ఉంటామని అందరికీ చెప్పారు. ఇక వారిద్దరిని అలా చేసిన రవి-లాస్య అభిమానులు కూడా సంతోషం వ్యక్తం చేశారు. ఇకపై మళ్లీ ఈ క్రేజీ జోడీ పలు షోలలో సందడి చేయనుందని అందరూ భావించారు. అయితే కలిసి మూడు నెలలు కూడా కాలేదు. ఈ ఇద్దరి మధ్య మళ్లీ గొడవలు ప్రారంభం అయ్యాయి. అయితే ఆ గొడవలు సీరియస్‌గా కాదు కామెడీ కోసం.
స్టార్ మాలో ప్రతి ఆదివారం మధ్యాహ్నం కామెడీ స్టార్స్ అన్న కామెడీ షో ప్రసారం అవుతున్న విషయం తెలిసిందే. వర్షిణి వ్యాఖ్యతగా వ్యవహరిస్తోన్న ఈ షోకు శేఖర్ మాస్టర్, శ్రీదేవి జడ్జిలుగా ఉన్నారు. ఇందులో అవినాష్, అషు రెడ్డి, సుజాత, సిరి తదితరులు పాల్గొంటున్నారు. ఇక అప్పుడప్పుడు సెలబ్రిటీలు కూడా ఇందులో భాగం అవుతుంటారు. ఈ క్రమంలో రానున్న ఎపిసోడ్‌లో రాజేంద్ర ప్రసాద్ ఈ షోలో సందడి చేయనున్నారు.
Dynamic Duo Ravi & Lasya kalisthe navvula uppeney!#ComedyStars Sunday at 1:30 PM on Star Maa #SundayFunday pic.twitter.com/TE5WsbkGKs
— starmaa (@StarMaa) March 11, 2021
కాగా ఇక ఈ షోలో రవి, లాస్యలు స్కిట్ చేయబోతున్నారు. ఉప్పెన స్పూఫ్‌ని వీరిద్దరు చేస్తుండగా.. ఒకరిపై ఒకరు మాటల పంచ్‌లు వేసుకున్నారు. వీళ్ల నాన్న ఒక్క అబద్దం కూడా ఆడలేదేమోరా అందుకే ఇంత దరిద్రంగా పుట్టింది అని రవి, లాస్యను అనడం.. అర ఎకరం నుంచి నువ్వు, నేనే మాట్లాడుకోవాలి అని లాస్య అనడం ప్రోమోకు హైలెట్‌గా నిలిచాయి. ఇక వీరిద్దరు పంచే ఎంటర్‌టైన్ చూడాలంటే ఆదివారం వరకు ఆగాల్సిందే.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Anchor lasya, Anchor ravi