అఖిల్ అక్కినేనికి హిట్స్ లేవు కానీ మనోడికి అమ్మాయిల్లో ఫాలోయింగ్ మాత్రం బాగానే ఉంది. చాక్లెట్ బాయ్‌లా ఉంటాడు కదా అందుకే అమ్మాయిలు కూడా పడిపోతుంటారు. ముఖ్యంగా కొందరు అమ్మాయిలు అయితే ఏకంగా అఖిల్ అంటే పిచ్చితో ఊగిపోతున్నారు. అందులో టాలీవుడ్ యాంకర్ విష్ణుప్రియ కూడా ఉంది. తెలుగు ఇండస్ట్రీలో చాలా తక్కువ సమయంలోనే మంచి యాంకర్‌గా గుర్తింపు తెచ్చుకున్న విష్ణుప్రియకు అఖిల్ అంటే పిచ్చి. ఈ అమ్మాయికి అఖిల్ పేరు వినగానే ఏదో తెలియని పిచ్చి అంతే. అందుకే చేతిపై టాటూ కూడా వేయించుకుంది ఈ భామ.
ఈ విషయం చాలాసార్లు కెమెరా ముందు కూడా చెప్పింది విష్ణు. ఇప్పుడు కూడా ఇదే అంటుంది. అభిమానం కాస్తా పెరిగి ఇప్పుడు పిచ్చి రేంజ్‌కు వెళ్లిపోయింది. తనకు అవకాశం వస్తే అఖిల్‌ను పెళ్లి చేసుకొని అక్కినేని వారి కోడలు అవుతాను అంటుంది విష్ణు ప్రియ. ఈ మాటలు ఎవరో చెప్పింది కాదు.. స్వయంగా విష్ణుప్రియ తనకు చెప్పినట్లు మరో స్టార్ యాంకర్ శ్రీముఖి చెప్పుకొచ్చింది. తనకు అఖిల్ అంటే పిచ్చి అని.. నాగార్జున ఒప్పుకుంటే వెంటనే పెళ్లి చేసుకుని అక్కినేని ఇంటికి వెళ్ళిపోతానంటూ కామెంట్ చేస్తుంది విష్ణుప్రియ.
టాలీవుడ్లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్స్‌లో అఖిల్ కూడా ఒకడు. ప్రస్తుతం బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్' సినిమాలో నటిస్తున్నాడు అఖిల్. పూజా హెగ్డే ఇందులో హీరోయిన్. ఈ సినిమా తర్వాత తమిళ దర్శకుడు మిత్రన్ దర్శకత్వంలో ఓ సినిమా చేసే అవకాశం కనిపిస్తుంది. మొత్తానికి విష్ణుప్రియ చెప్పిన మాటలను అఖిల్ ఎంతవరకు పట్టించుకుంటాడో చూడాలి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Akkineni akhil, Telugu Cinema, Tollywood