Anchor Varshini : ఢీ షో నుంచి వర్షిణిని తీసేసారా.. లేక ఆమె తప్పుకుందా...

వర్షిణీ Phto : Instagram

Anchor Varshini : ఈటీవీలో వచ్చే డాన్స్‌ షోలో యాంకర్ వర్షిణి ముద్దు ముద్దు మాటలతో... అందమైన నవ్వుతో టీమ్ లీడర్‌గా అలరించేది. అయితే ఆమె తాజా ఎపిసోడ్‌లో కనిపించలేదు.. దీనికి ఏమైనా కారణాలు ఉన్నాయా..

  • Share this:
    Anchor Varshini : యాంకర్ వర్షిణి ముద్దు ముద్దు మాటలతో... అందమైన నవ్వుతో ఈటీవీలో వచ్చే డాన్స్ షోలో యాంకరింగ్ చేస్తూ అక్కడ ఓ టీమ్ లీడర్‌గా అలరించేది. ఢీ చాంపీయన్స్‌కు తనదైన శైలిలో టీమ్ లీడర్‌గా వ్యవహరిస్తూ, తన అందచందాలతో షోకు గ్లామర్ తెచ్చిన ఈ భామ తాజా సీజన్‌లో కనిపించకుండా పోయింది. టీమ్ లీడర్స్‌లో ఒకరైనా హైపర్ ఆది కొనసాగుతుండగా.. వర్షిణీ మాత్రం తాజా ఎపిసోడ్‌లో మిస్ అయ్యింది. ఆమె ప్లేస్‌లో కొత్త అమ్మాయి దీపికా పిల్లి వచ్చి చేరింది. దీపికా పిల్లి ఓ సోషల్ మీడియా స్టార్. ఆమె ముఖ్యంగా టిక్ టాక్‌లో డ్యాన్స్ వీడియోలు చేస్తూ పాపులర్ అయ్యింది. అయితే మరో జంట సుదీర్, రష్మి అలాగే ఈ తాజా సీజన్‌లో కొనసాగుతుండగా..వర్షిణీ కనిపించకపోవడం ఎంటనీ ఆమె అభిమానులు ప్రశ్నిస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ పెడుతున్నారు. వేర్ ఈజ్ అవర్ ఫేవరేట్ టీమ్ లీడర్ అని.. అయితే బహుశా వర్షిణీ ప్రస్తుతం వేరే షోలలో బిజీగా ఉండీ రాలేకపోవచ్చని కొందరు అంటుంటే మరికొందరు కావాలనే తీసేసి ఉంటారనీ, దీని వల్ల కొత్త వారికి అవకాశం ఇచ్చినట్లు ఉంటుందని భావించి మల్లెమాల యాజమాన్యం అలా చేసి ఉండవచ్చిని కామెంట్స్ పెడుతున్నారు. దీనిపై కొంత క్లారిటీ రావాల్సి ఉంది. ఆమె తాజా సీజన్‌లో కనిపించకపోవడానికి మరే ఇతర కారణమైన ఉండి ఉండవచ్చు. ఏది ఏమైనా తమ అభిమాన యాంకర్ ఎక్కడున్న మంచిగా రాణించాలనీ కొరుకుంటున్నారు ఆమె అభిమానులు.

    ఇక వర్షిణీ యాక్టింగ్ కెరీర్, పర్సనల్ విషయాల గురించి మాట్లాడితే ఆమె ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ ఫోర్ టాప్ ఫైవ్‌లో కేకపెట్టిస్తోన్న అభిజీత్‌తో ఓ వెబ్ సీరిస్ చేసింది. పెళ్లిగోల పేరుతో వచ్చిన ఈ వెబ్ సిరీస్ నెటిజన్స్‌ను బాగానే ఆకట్టుకుంది. దీంతో పలు సినిమాల్లోను నటించింది. వ‌ర్షిణి హైదరాబాదులో స్థిరపడిన తమిళ కుటుంబంలో రెండో కూతురుగా జన్మించింది. ఇక చదువు విషయానికి వస్తే ఆమె ఎలక్ట్రానిక్స్‌లో తన బ్యాచిలర్ డిగ్రీని పూర్తిచేసింది. ఆ తర్వాత మోడల్‌గా కెరీర్‌ను ప్రారంభించింది, శంభో శివ శంభో చిత్రంలో చిన్న పాత్ర చేసిన వర్షినీ ఆ తర్వాత జాతీయ పురస్కారం గెలుచుకున్న చందమామ కథలు సినిమాలో కూడా నటించింది. ఇక ఆ తర్వాత ఆమె లవర్స్ , కాయ్ రాజా కాయ్ , బెస్ట్ యాక్టర్స్ వంటి చిత్రాలలో కనిపించింది. అన్నపూర్ణా స్టుడియోస్ నిర్మించిన పెళ్ళి గొల అనే వెబ్ సిరీస్‌లో నటించి మంచిపేరు తెచ్చుకుంది. వర్షిణీ మరిన్ని సినిమాల్లో నటించి మంచి పేరు తెచ్చుకోవాలనీ ఆమె అభిమానులు కోరుకుంటున్నారు.
    Published by:Suresh Rachamalla
    First published: