Rashmi - Varshini: బుల్లితెరలో హాట్ యాంకర్ గా గుర్తింపు పొందిన వర్షిణి పరిచయం గురించి బుల్లితెర ప్రేక్షకులందరికీ తెలిసిందే. తన అందాలతో బాగా రచ్చ చేస్తుంది. ఇప్పటికే అనసూయ, శ్రీముఖి ల కంటే ఎక్కువగా రెచ్చిపోతుంది. వాళ్లని మించి ఓ రేంజ్ లో గ్లామర్ విందుని వడ్డిస్తుంది. సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటూ తన హాట్ లుక్ లతో యువతను కన్నార్పకుండా చేస్తుంది. ఇదిలావుంటే ఇంత తగ్గించుకున్నాను అంటూ రెచ్చిపోయింది వర్షిణి.
సోషల్ మీడియా ద్వారా పరిచయమైన వర్షిణి.. బుల్లితెర రియాలిటీ షో ఢీ లో యాంకర్ గా చేసింది. అందం విషయంలో టాప్ గ్లామర్ యాంకర్ గా నిలిచిన వర్షిణి తన డాన్స్ స్టెప్పులతో కూడా బాగా ఆకట్టుకుంది. ఇక ఢీ షో నుండి బయటకు వచ్చిన ఈ బ్యూటీ స్టార్ మా లో ప్రసారమవుతున్న కామెడీ షో లో చేస్తుంది. తన ఎంట్రీ డాన్సులతో అందరి దృష్టినీ తనవైపు లాక్కుంటుంది. ట్రెడిషనల్, గ్లామర్ లుక్ లతో కూడా బాగా ఆకట్టుకుంటుంది.
స్టార్ మా లో ఓంకార్ హోస్టింగ్ చేస్తున్న సిక్స్త్ సెన్స్ షో కు సంబంధించిన ఎపిసోడ్ ప్రోమో విడుదల కాక.. అందులో యాంకర్ వర్షిణి మరో బుల్లితెర యాంకర్ రష్మీ తో పాల్గొన్నది. ఇందులో వర్షిణి పొట్టి డ్రెస్ లో ఎంట్రీ ఇచ్చింది. ఇక రష్మీని ఓంకార్ తన మాటలతో పొగుడుతున్నట్లు కనిపించాడు. డాన్స్ స్టెప్పులతో కూడా బాగా రెచ్చిపోయారు. ఇక గేమ్ లో భాగంగా రష్మీ ని వాదించగా.. అందులో నటుడు ప్రకాష్ రాజ్ వాయిస్ తో 'ఇవే తగ్గించుకుంటే మంచిది' అనే డైలాగ్ రావడంతో వెంటనే వర్షిణి.. ఏంటి తగ్గించుకోవాలి.. ఆల్రెడీ ఇంత తగ్గించుకొని వచ్చాను అంటూ తను వేసుకొచ్చిన పొట్టి డ్రెస్ వైపు చూపిస్తూ బాగా రెచ్చిపోయింది. ఇక ప్రస్తుతం ఈ ప్రోమో వైరల్ గా మారింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Anchor rashmi, Anchor varshini, Omkar, Sixthsense season 4