హోమ్ /వార్తలు /సినిమా /

Anchor Syamala: వైఎస్ ష‌ర్మిల భ‌ర్త‌ను క‌లిసిన యాంక‌ర్ శ్యామ‌ల దంప‌తులు.. ఏం జ‌రుగుతోంది

Anchor Syamala: వైఎస్ ష‌ర్మిల భ‌ర్త‌ను క‌లిసిన యాంక‌ర్ శ్యామ‌ల దంప‌తులు.. ఏం జ‌రుగుతోంది

యాంకర్ శ్యామల

యాంకర్ శ్యామల

Anchor Syamala: ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్ సోద‌రి, వైఎస్ ష‌ర్మిల కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేయాల‌ని నిర్ణ‌యించిన విష‌యం తెలిసిందే. ఇందుకోసం తెలంగాణ‌లోని న‌ల్గొండ జిల్లాలో త‌న‌కు స‌న్నిహితంగా ఉండే కొంద‌రు నేత‌ల‌తో మంగ‌ళ‌వారం స‌మావేశ‌మ‌య్యారు. వారి అభిప్రాయాల‌ను తీసుకున్న షర్మిల‌

ఇంకా చదవండి ...

  Anchor Syamala: ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్ సోద‌రి, వైఎస్ ష‌ర్మిల కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేయాల‌ని నిర్ణ‌యించిన విష‌యం తెలిసిందే. ఇందుకోసం తెలంగాణ‌లోని న‌ల్గొండ జిల్లాలో త‌న‌కు స‌న్నిహితంగా ఉండే కొంద‌రు నేత‌ల‌తో మంగ‌ళ‌వారం స‌మావేశ‌మ‌య్యారు. వారి అభిప్రాయాల‌ను తీసుకున్న షర్మిల‌.. ఈ నెల 20న ఖ‌మ్మం జిల్లాలోని అభిమానులు, ముఖ్య నేతల‌తో స‌మావేశం అవ్వ‌నున్నారు. ఇక కొత్త పార్టీ ఏర్పాటు చేయాలని నిర్ణయించిన నేపథ్యంలో...హైదరాబాద్‌లో ఇందుకోసం పార్టీ కార్యాలయం ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్టు వార్త‌లు వినిపిస్తున్నాయి. దీంతో ఇప్పుడు ష‌ర్మిల హాట్ టాపిక్‌గా మారారు. ఇదిలా ఉంటే తాజాగా ప్ర‌ముఖ యాంక‌ర్ శ్యామ‌ల‌, ఆమె భ‌ర్త, న‌టుడు న‌ర‌సింహా రెడ్డితో పాటు ష‌ర్మిల భ‌ర్త బ్ర‌ద‌ర్ అనిల్ కుమార్‌ని క‌లిశారు.

  ఇవాళ బ్ర‌ద‌ర్ అనిల్ కుమార్ బ‌ర్త్‌డే సంద‌ర్భంగా లోట‌స్ పాండ్‌లో పుట్టిన‌రోజు వేడుక‌లు జ‌రిగాయి. ఈ విష‌యాన్ని శ్యామ‌ల త‌న సోష‌ల్ మీడియాలో వెల్ల‌డించారు. అనిల్‌తో తీసుకున్న ఫొటోను సోష‌ల్ మీడియాలో షేర్ చేసిన శ్యామ‌ల‌.. హ్యాపీ బ‌ర్త్, ఫ్రెండ్లీ మీట్, బ్ర‌ద‌ర్ అనిల్ కుమార్ అన్న అని హ్యాష్ ట్యాగ్‌లు పెట్టారు.


  కాగా శ్యామ‌ల‌, న‌ర‌సింహారెడ్డి ఇద్ద‌రు వైసీపీ పార్టీలో ఉన్న విష‌యం తెలిసిందే. 2019 ఎన్నిక‌ల‌కు ముందు వీరు వైసీపీ కండువాను క‌ప్పుకున్నారు. ఈ క్ర‌మంలో జ‌గ‌న్ కుటుంబంతో శ్యామ‌ల కుటుంబానికి మంచి సాన్నిహిత్యం ఏర్ప‌డింది. ఈ నేప‌థ్యంలో ఇవాళ బ్ర‌ద‌ర్ అనిల్ కుమార్ పుట్టిన‌రోజు కావ‌డంతో వారు స్నేహ‌పూర్వ‌కంగా క‌లిశారు.

  Published by:Manjula S
  First published:

  ఉత్తమ కథలు