Anchor Suma Vantalakka: మా వంటలక్కను ఏడిపిస్తావా.. డాక్టర్ బాబుకి యాంకర్ సుమ స్ట్రాంగ్ వార్నింగ్..

యాంకర్ సుమ, నిరుపమ్ (Anchor Suma Nirupam)

Anchor Suma Vantalakka: బుల్లితెరపై యాంకర్ అంటే సుమ కనకాల.. సీరియల్ అంటే కార్తీక దీపం. ఈ రెండింటికి మించి తెలుగులో మరోటి లేవు. వాళ్లను బీట్ చేయాలంటే కూడా అంత సులభం కాదు. ఎందుకంటే సీరియల్స్‌లో వంటలక్క రేంజ్ అలా..

  • Share this:
బుల్లితెరపై యాంకర్ అంటే సుమ కనకాల.. సీరియల్ అంటే కార్తీక దీపం. ఈ రెండింటికి మించి తెలుగులో మరోటి లేవు. వాళ్లను బీట్ చేయాలంటే కూడా అంత సులభం కాదు. ఎందుకంటే సీరియల్స్‌లో వంటలక్క రేంజ్ అలా ఉంది మరి. మరోవైపు సుమ యాంకరింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అలాంటిది ఈ ఇద్దరూ కలిస్తే ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి. ఇప్పుడు ఇదే జరిగింది. తాజాగా సుమ కనకాల హోస్టుగా మరో కార్యక్రమం మొదలైంది. ఇప్పటికే చాలా ప్రోగ్రామ్స్ చేస్తున్న సుమ.. ఇప్పుడు స్టార్ట్ మ్యూజిక్ అంటూ మరో కొత్త షోకు హోస్టింగ్ చేస్తుంది. స్టార్ మాలో వచ్చే ఈ ప్రోగ్రామ్‌ను ఓం ప్రదంగా కార్తీక దీపం టీం ఓపెన్ చేసింది. వంటలక్క కాకుండా అంతా వచ్చారు. అందులో నటించిన డాక్టర్ బాబు, హిమ, శౌర్య, మోనిత.. ఇలా అంతా అక్కడ కనిపించారు. అయితే మెయిన్ కారెక్టర్ దీప మాత్రం రాలేదు. వంటలక్క రాకపోవడంతో ఫ్యాన్స్ కూడా ఫీల్ అయ్యారు. అయితే అక్కడ వంటలక్క లేకపోయినా కూడా సుమక్క మాత్రం రెచ్చిపోయింది. డాక్టర్ బాబుపైకి ఏకంగా కత్తి తీసుకుని బయల్దేరింది. నిజానికి బయట చాలా మంది బుర్రలో కూడా ఇదే ఆలోచన ఉంది. ఎందుకంటే కార్తీక దీపం సీరియల్‌కు అంతగా కనెక్ట్ అయిపోయారు ప్రేక్షకులు. వంటలక్క కష్టాలు తమ కష్టాలుగా భావించే ఆడవాళ్లు ఎంతోమంది ఉన్నారు.

అలాంటి వాళ్ల ప్రోత్సాహంతోనే కొన్నేళ్లుగా ఈ సీరియల్ నెంబర్ వన్ ప్లేస్‌లో కొనసాగుతుంది. ఇదిలా ఉంటే షోకు వచ్చిన డాక్టర్ బాబును పట్టుకుని సుమ నిలదీసింది. మా వంటలక్కను ఎందుకంత బాధ పెడుతున్నావ్.. నిజమేంటో నీకు తెలియదా అంటూ కత్తి పట్టుకుని అతడి చుట్టూ తిరిగింది. దాంతో డాక్టర్ బాబు నిరుపమ్ కూడా సుమకు సపోర్ట్ చేసాడు. ఈ ఇద్దరూ చేసిన యాక్ట్ భలేగా పేలింది. ఇదే ప్రోమో ఇప్పుడు యూ ట్యూబ్‌లోనూ వైరల్ అవుతుంది. ఎంత ధైర్యముంటే మా వంటలక్కనే ఏడిపిస్తావ్ అంటూ డాక్టర్ బాబు పీకపై కత్తి పెట్టేసింది సుమక్క. ఏదేమైనా కూడా కార్తీక దీపం సీరియల్ రేంజ్ రోజురోజుకీ అలా పెరిగిపోతుంటే.. వంటలక్క క్రేజ్ కూడా ఆకాశంలా అలా అలా పైపైకి వెళ్లిపోతుంది.
Published by:Praveen Kumar Vadla
First published: