Anchor Suma: నోరు జారిన సుమ.. మీ టైమ్ అయిపోయిందంటూ సీనియర్ నటికి షాక్..!

యాంకర్ సుమ (Anchor Suma)

Anchor Suma: సాధారణంగా సుమ యాంకరింగ్ చేస్తుందంటే దర్శక నిర్మాతలకు ఎలాంటి కంగారు ఉండదు. ఎందుకంటే అక్కడ తప్పులకు ఛాన్సులే ఉండదు. అంత పక్కాగా ఆమె స్క్రిప్ట్ ఉంటుంది.

  • Share this:
సాధారణంగా సుమ యాంకరింగ్ చేస్తుందంటే దర్శక నిర్మాతలకు ఎలాంటి కంగారు ఉండదు. ఎందుకంటే అక్కడ తప్పులకు ఛాన్సులే ఉండదు. అంత పక్కాగా ఆమె స్క్రిప్ట్ ఉంటుంది. దాంతో పాటు వెంటవెంటనే పంచులు వేయడంలో సుమ అందరికంటే ముందుంటుంది. తెలుగు యాంకర్స్‌లో సుమ కంటే పంచులు వేసే యాంకర్స్ మరొకరు లేరంటే అతిశయోక్తి కాదేమో..? అయితే ఎంత అనుభవం ఉన్నా.. ఎంత బాగా యాంకరింగ్ చేసినా కూడా అప్పుడప్పుడూ తప్పులు దొర్లుతుంటాయి. ఇప్పుడు కూడా ఇలాంటిదే జరిగింది. తాజాగా క్యాష్ ప్రోమోలో యాంకర్ సుమ చిన్న మాట జారింది. దాంతో అక్కడున్న వాళ్లంతా ఒక్కసారిగా షాక్ అయిపోయారు. అయ్యో సుమ ఏంటి ఇలా అనేసింది అంటూ నోరెళ్లబెట్టారు. ఈ వారం సీనియర్ నటులను క్యాష్ షోకు పిలిచారు.

అందులో గౌతమ్ రాజు, బాబు మోహన్, శివ పార్వతి, రాజ్యలక్ష్మి వచ్చారు. అందరితోనూ సరదాగా కబుర్లు చెప్పింది సుమ. అందులో ఓ టాస్కులో భాగంగా స్టేజీపైకి వచ్చిన సీనియర్ నటి శివ పార్వతికి షాక్ ఇచ్చింది సుమ. మీ టైమ్ అయిపోయిందంటూ నోరు జారింది. అదేంటి.. అలా అనేసావ్ అంటూ సుమను వెంటనే అడిగేసింది శివ పార్వతి. అదే.. ఇక్కడ షోలో మీ టైమ్ అయిపోయింది అంటూ కవర్ చేసింది సుమ.

దాంతో నేనింకా చాలా ఏళ్ళ పాటు ఇండస్ట్రీలో ఉండాలనుకుంటే.. అప్పుడే నా టైమ్ అయిపోయిందంటావా అంటూ కామెడీగా కన్నీరు పెట్టుకుంది ఈ నటీమణి. అక్కడ సీరియస్ విషయాలేం జరక్కపోయినా కూడా ప్రోమోలో మాత్రం ఈ టైమ్ అయిపోయింది అనే డైలాగ్ మాత్రం బాగా హైలైట్ అయింది. ఇదంతా చూసిన తర్వాత సుమ కూడా అప్పుడప్పుడూ తనకు తెలియకుండానే నోరు జారుతుందని అర్థమవుతుంది.
Published by:Praveen Kumar Vadla
First published: