ANCHOR SUMA SHARES INTERESTING THINGS ABOUT LOVE MARRIAGE WITH RAJIV KANAKALA FULL DETAILS HERE HSN
HBD Suma Kanakala: పెళ్లి తర్వాత సినిమాలు మానేయమని రాజీవ్ కండీషన్ పెట్టాడు.. ఆసక్తికర విషయాలు బయటపెట్టిన యాంకర్ సుమ
రాజీవ్ కనకాల, సుమ (ఫైల్ ఫొటోలు)
నన్ను ఏదో స్టూడియోలో రాజీవ్ చూశాడట. ఆ తర్వాత ‘మేఘమాల’ అనే సీరియల్ సమయంలో నాకు ప్రేమ సందేశం పంపాడు. అంతకుముందు మాకిద్దరికీ కొద్ది పాటి పరిచయమే ఉంది. మొదట్లో రాజీవ్ ప్రేమ ప్రతిపాదనను నేను తిరస్కరించా..
ఆమె స్వతహాగా తెలుగమ్మాయి కాదు. కానీ ఆమె తెలుగు మాట్లాడితే తప్పులను పట్టుకోవడం ఎవరితరం కాదు. కేరళ నుంచి తెలుగు నేలపైకి అడుగుపెట్టి తెలుగు టీవీ రంగాన్ని దున్నేస్తున్నారామె. టీవీల్లో యాంకరింగే కాదు.. సినిమా ఫంక్షన్లలోనూ ఆమె వేసే పంచ్ లకు, ఆమె మాటలకు ఎవరైనా ఫిధా అవాల్సిందే. ఆమే యాంకర్ సుమ. సోమవారం (మార్చి 22వ తారీఖు) నాడు ఆమె పుట్టిన రోజు. 46వ పడిలోకి అడుగుపెడుతున్న ఆమెకు బంధువులు, స్నేహితులు, సినీ ప్రముఖుల నుంచి పుట్టిన రోజు శుభాకాంక్షలు వెల్లువలా వస్తున్నాయి. అదే సమయంలో ఆమె సినీరంగంలోకి, టీవీ రంగంలోకి అడుగుపెట్టిన విషయాల గురించి కూడా మీడియాలో వార్తలు ప్రముఖంగా వస్తున్నాయి. భర్త రాజీవ్ కనకాలతో ప్రేమ పెళ్లి గురించి ఓ ఆసక్తికరమైన విషయాన్ని సుమ గతంలో జరిగిన ఓ టీవీ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.
రాజీవ్ కనకాల, సుమలకు 1999వ సంవత్సరంలో ప్రేమ పెళ్లి జరిగింది. అయితే వీరిద్దరి మధ్య ప్రేమాయణం మాత్రం 1994వ సంవత్సరంలోనే మొదలైందంట. మొదటగా రాజీవ్ కనకాలే సుమకు లవ్ ప్రపోజ్ చేశారట. ‘1994లో నన్ను ఏదో స్టూడియోలో రాజీవ్ చూశాడట. ఆ తర్వాత ‘మేఘమాల’ అనే సీరియల్ సమయంలో నాకు ప్రేమ సందేశం పంపాడు. అంతకుముందు మాకిద్దరికీ కొద్ది పాటి పరిచయమే ఉంది. మొదట్లో రాజీవ్ ప్రేమ ప్రతిపాదనను నేను తిరస్కరించా. ఆ తర్వాత ఏడాది పాటు ఆటపట్టించా. చివరకు ఏడాది తర్వాత ఓకే చెప్పేశా. అయితే ప్రతీ ప్రేమ కథలోనూ కొన్ని చిన్న చిన్న గొడవలు కామన్. మా మధ్య కూడా చిన్న చిన్న గొడవలు వచ్చాయి.‘ అని సుమ వివరించారు.
‘పెళ్లి తర్వాత సినిమాలు చేయొద్దని రాజీవ్ కండీషన్ పెట్టాడు. దాంతో పెళ్లి చేసుకోనని చెప్పేశా. దీంతో మామధ్య ఏడాదిన్నర పాటు మాటల్లేవ్. రాజీవ్ మాట్లాడడానికి ప్రయత్నించినా నేను మాత్రం మాట్లాడలేదు. ఆ సమయంలో తెలుగు, మళయాలంలో రెండుమూడు సినిమాలు చేశాను. కానీ, సినిమా రంగం నాకెందుకో నచ్చలేదు. దాంతో సినిమాలు వదిలేశా. ఆ తర్వాత మళ్లీ రాజీవ్‌ను కలిశా. మా ప్రేమ గురించి రాజీవ్ తండ్రి దేవదాస్ కనకాల గారితో మాట్లాడాము. ఆయన కూడా ఒప్పుకున్నారు. అలా 1999లో మా ప్రేమ పెళ్లి జరిగింది.‘ అంటూ సుమ కనకాల ఆనాటి సంగతులను గుర్తుకు తెచ్చుకున్నారు. తనకు రాజీవే మొదటి విమర్శకుడనీ, ఏవైనా కార్యక్రమాల విషయంలో బాగుంటే చాలా మెచ్చుకుంటాడని చెప్పుకొచ్చారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.