హోమ్ /వార్తలు /సినిమా /

సుమతో ఉన్న ఈ ఆరడుగుల ఆజానుబాహుడు ఎవరబ్బా..

సుమతో ఉన్న ఈ ఆరడుగుల ఆజానుబాహుడు ఎవరబ్బా..

కుమారుడు రోషన్‌తో యాంకర్ సుమ.. Photo : Twitter

కుమారుడు రోషన్‌తో యాంకర్ సుమ.. Photo : Twitter

స్టార్ యాంకర్ సుమ తాజాగా తన సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేసింది. అందులో భాగంగా ఓ ఫోటోను కూడా షేర్ చేసింది.

యాంకర్ సుమ.. సినిమాల్లో చిరంజీవి తన డ్యాన్స్‌లతో, నటనతో తనదైన మేనరిజంతో ఎంత పేరు తెచ్చుకున్నాడో.. టీవీల్లో కూడా సుమ తన దైన స్టైల్లో యాంకరింగ్‌కు చేస్తూ అప్పటికప్పుడు సమయస్పూర్తిగా వ్యవహరిస్తూ అంత పేరు తెచ్చుకుంది. ఓ రకంగా టీవీ మెగాస్టార్ అని సుమను అనోచ్చు. దశాబ్ధాలుగా ఈమె టీవీ తెరపై అద్భుతాలు చేస్తూనే ఉంది. వయసు 40 దాటినా కూడా ఇప్పటికీ యాంకరింగ్‌లో ఆమెను అందుకునే శక్తి కానీ.. దాటే అర్హత కానీ ఎవరికీ కనిపించడం లేదు. కనీసం సుమ దరిదాపుల్లో కూడా ఎవరూ కనిపించడం లేదు. పెద్ద హీరోలకు సంబంధించిన ఏదైనా ఈవెంట్‌ అయినా.. సరే తన మాటలతో మాయ చేయడం సుమ స్పెషాలిటీ. తెలుగు ప్రేక్షకులు ఆమెను ఓ యాంకర్‌గా కాకుండా తమ ఇంటి సభ్యరాలిగానే భావిస్తారు. అంతలా తెలుగు వారికి కనెక్ట్ అయిపోయింది ఈ మలయాళీ కుట్టి. తన మాటలతో గానీ చేతలతో గానీ ఎవరనీ నోప్పించని సుమ తాజాగా తన ట్విట్టర్ ఆకౌంట్‌లో ఓ ఫోటోను షేర్ చేసింది.

ఆ ఫోటోలో ఓ ఆరడుగుల వ్యక్తి సుమ పక్కన నిల్చోని ఉన్నాడు. చూస్తే సుమకు చిన్న తమ్ముడులా ఉన్నాడు కానీ అతడు సుమ ముద్దుల కొడుకు రోషన్. సుమ ఆ ఫోటోను ఉద్దేశిస్తూ... ప్రియమైన రోషన్ నువ్వు పెద్దగా... బలంగా పెరిగావు లవ్ యూ.. అంటూ రాసుకుంది. అయితే ఈ ఫోటోను చూసిన నెటిజన్స్ మాత్రం అసలు నిన్ను సంతూర్ వాళ్లు ఎలా  మిస్ చేసుకున్నారు. అసలు సంతూర్ మమ్మి నువ్వంటూ కామెంట్స్ పెడుతున్నారు. అది అలా ఉంటే.. సుమ ఓ వైపు టీవీల్లో యాంకరింగ్ చేస్తూనే మరోవైపు డిజిటల్‌‌‌లోకి ప్రవేశించింది.  ఆ మధ్య సుమక్క అనే యూ ట్యూబ్ ఛానెల్ ఓపెన్ చేసి అందులో కొన్ని ఫన్నీ వీడియాలతో పాటు పర్సనల్ విషయాలను కూడా పోస్ట్ చేస్తోంది.

First published:

Tags: Anchor suma

ఉత్తమ కథలు