భల్లాలదేవ పెళ్లిపై యాంకర్ సుమ సెటైర్... పరుగులు పెట్టించిన రానా

రానా... మీకు త్వరలోనే అమ్మాయిలు, పెళ్లి, పిల్లలు గురించి బాగా అర్థం కావాలని సుమ.. చమత్కరిస్తూ మాట్లాడారు.

news18-telugu
Updated: April 29, 2019, 4:51 PM IST
భల్లాలదేవ పెళ్లిపై యాంకర్ సుమ సెటైర్... పరుగులు పెట్టించిన రానా
యాంకర్ సుమ, రానా దగ్గుబాటి
news18-telugu
Updated: April 29, 2019, 4:51 PM IST
నాని జెర్సీ చిత్రం సక్సెస్‌పై హైదరాబాద్‌లో థాంక్యూ మీట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రానా దగ్గుబాటి హాజరయ్యారు. ఈ ఈవెంట్‌కు సుమ యాంకరింగ్ చేశారు. అయితే సుమా రానా మధ్య ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. కార్యక్రమంలో రానా మాట్లాడుతూ తనకు పెళ్లి, పిల్లలు... క్రికెట్ అంటే పెద్దగా ఆసక్తి లేదని చెప్పాడు. కానీ జెర్సీ సినిమా చూస్తే మాత్రం ఏడుపు వచ్చేసిందన్నారు. ఇక మామూలు ప్రేక్షకులు ఎంత ఎమోషనల్ అయి ఉంటారో అని వ్యాఖ్యలు చేశారు రానా. అయితే రానా అలా మాట్లాడగానే.. వెంటనే సుమ అందుకున్నారు. మీకు త్వరలోనే అమ్మాయిలు, పెళ్లి, పిల్లలు గురించి బాగా అర్థం కావాలని చమత్కరిస్తూ మాట్లాడారు. సుమా అలా అనగానే.. రానా వెంటనే వెళ్లి ఆమె కాళ్లకు నమస్కరించే ప్రయత్నం చేశారు. అది చూసి సుమా అక్కడ్నుంచి పరుగులు తీశారు.

అందరూ పెళ్లిళ్లు చేసుకొని కష్టపడుతుంటే రానా మాత్రం సుఖంగా ఉండాలా ? అందుకే మీరు కూడా పెళ్లి చేసుకొని పిల్లల్ని కనండి అంటూ... సుమా రానాతో చెప్పారు. అమ్మాయిల మనసు అర్థం చేసుకోవాలంటూ రానాను ఆటపట్టిస్తూ.. వ్యాఖ్యలు చేశారు. దీంతో వీరిద్దరి మధ్య జరిగిన సంభాషణ చూసి అక్కడకు వచ్చిన వారంతా భలేగా ఎంజాయ్ చేశారు.

First published: April 29, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...