హోమ్ /వార్తలు /సినిమా /

Anchor Suma : బూజు పట్టిందనుకున్నా..పని చేస్తోంది..! సుమ వీడియోలో చాలా అర్ధం ఉందిగా..

Anchor Suma : బూజు పట్టిందనుకున్నా..పని చేస్తోంది..! సుమ వీడియోలో చాలా అర్ధం ఉందిగా..

Photo Credit : Twitter

Photo Credit : Twitter

Anchor Suma : యాంకర్ సుమ కనకాల అంటే ఎంతో మందికి అభిమానం. ఆమెను తమ కుటుబంలోని వ్యక్తిలా భావిస్తారు. బుల్లితెరలో ఆమె పొగ్రాం వస్తుందంటే చాలు ప్రేక్షకులు టీవీలకు అతుక్కుపోతారు. ప్రస్తుతం సుమకి మూవీ ఫంక్షన్లు ఏవీ లేకపోయినా..బుల్లితెరపై షోలతో బీజీగా గడుపుతున్నారు. అంతే కాదు సోషల్ మీడియాతోను యాక్టివ్ గా ఉంటారు.

ఇంకా చదవండి ...

  యాంకర్ సుమ కనకాల అంటే ఎంతో మందికి అభిమానం. ఆమెను తమ కుటుబంలోని వ్యక్తిలా భావిస్తారు. బుల్లితెరలో ఆమె పొగ్రాం వస్తుందంటే చాలు ప్రేక్షకులు టీవీలకు అతుక్కుపోతారు. ప్రస్తుతం సుమకి మూవీ ఫంక్షన్లు ఏవీ లేకపోయినా..బుల్లితెరపై షోలతో బీజీగా గడుపుతున్నారు. అంతే కాదు సోషల్ మీడియాతోను యాక్టివ్ గా ఉంటారు. ఎప్పటికప్పుడు తనకు సంబందించిన అన్ని విషయాలు అభిమానులతో ముచ్చటిస్తారు. సుమ అంటే కేవలం బుల్లితెర, సినిమా ఈవెంట్లలో చేసే రచ్చ మాత్రమే అందరికీ తెలిసేది. కానీ ఇంట్లో ఎలా ఉంటుంది.. షూటింగ్‌లు లేకపోతే ఖాళీగా ఉన్న సమయాల్లో ఎలా ఉంటుందనే విషయాలు ఎవ్వరికీ తెలిసేవి కావు.కానీ ఇప్పుడు సుమ మాత్రం తన పర్సనల్ విషయాలను ఎక్కువగా సోషల్ మీడియా వేదికగా పంచుకుంటున్నారు.ప్రస్తుతం సినీ ఇండస్ట్రీ ఎలాంటి పరిస్థితుల్లో ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. షూటింగ్‌లు లేక ఎక్కడి పనులు అక్కడే ఆగిపోవడంతో ఎంతో మంది ఉపాధి లేక అల్లాడిపోతోన్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితి, కళాకారుల ఆవేదన తెలిసేలా సుమ ఓ ఫన్నీ వీడియోను షేర్ చేశారు. వీడియో సరదాగా ఉన్నా కూడా అందులో ఆమె చెప్పిన విషయం మాత్రం చాలా లోతుగా ఉంది. ఆర్టిస్ట్‌ల జీవితాలు ఎప్పుడు ఎలా ఉన్నాయో చెప్పుకొచ్చారు.

  యాంకర్ సుమ ఓ వీడియోను షేర్ చేశారు. ఇందులో తన మేకప్ కిట్‌ను బయటకు తీశారు. తన మొహానికి మేకప్ వేసుకుంటూ ఉన్నారు. చాలా రోజులైంది కదా? పని చేస్తున్నాయో లేదో అని తెలుసుకునేందుకు మేకప్ వేసుకుంటున్నానని సుమ చెప్పుకొచ్చారు. అయితే ఈ వీడియోను షేర్ చేయడంతో పాటు కొన్ని విషయాలను చెప్పుకొచ్చారు. ఈ వీడియోను అంత సీరియస్‌గా తీసుకోకుండా లైటర్ వేలో చూడండని కోరారు.

  కానీ చెప్పే మ్యాటర్‌ను మాత్రం సీరియస్‌గా వినండని సుమ అన్నారు. మా జీవనాధరం, మా పొట్టి నింపేది ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీయే. మా కడుపు నిండాలి, మాకు ఇంత అన్నం దొరకాలంటే మేం అంతా పని చేయాలి.. యాక్టర్స్, యాంకర్స్, డైరెక్టర్స్, నిర్మాతలు, మ్యూజిక్ డైరెక్టర్స్, కెమెరామెన్, జిమ్మి, లైట్ మెన్, ఫైట్ మాస్టర్స్, ఎడిటర్స్, మేకప్ మెన్, హెయిర్ స్టైలీష్ట్, ఆర్ట్, ఫుడ్, ప్రొడక్షన్ ఇలా అందరూ సెట్స్ మీదకు రావాలి. మేమంతా మా పనులను ప్రారంభించాలి.. కుటుంబాలను పోషించాలని ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నాం.. త్వరలోనే ఇండస్ట్రీలో పనులు ప్రారంభమవుతాయని ఎదురుచూస్తున్నాను అని సుమ చెప్పుకొచ్చారు. మరోవైపు, ఈ వీడియోపై ఫ్యాన్స్ భిన్నంగా స్పందిస్తున్నారు. ఇంత కష్టమైన మ్యాటర్ ని సుమ చాలా ఈజీగా చెప్పిందంటూ కామెంట్లు పెడుతున్నారు.

  Published by:Sridhar Reddy
  First published:

  Tags: Anchor suma, Suma Kanakala, Tollywood news

  ఉత్తమ కథలు