Suma- Baba Bhasker: తెలుగు బుల్లితెరపై యాంకర్ సుమ కనకాలకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తన కామెడీ టైమింగ్, పంచ్‌లతో అదరగొట్టేస్తుంటుంది. ఎదుటివారు ఏం మాట్లాడినా పంచ్ వేస్తూ సుమ వీక్షకులను ఆకట్టుకుంటూ ఉంటుంది. అయితే అలాంటి సుమకు కూడా అప్పుడప్పుడు పంచ్‌లు పడుతుంటాయి. కొంతమంది సెలబ్రిటీలు ఆమెకు రివర్స్ పంచ్‌లు వేస్తుంటారు. అలాంటి వారిలో బాబా భాస్కర్ మాస్టర్ ఒకరు. మామూలుగానే యాక్టివ్‌గా ఉండే మాస్టర్, సుమ వచ్చినప్పుడు మరింత యాక్టివ్ అవుతారు. సుమ వ్యాఖ్యతగా చేసే షోలకు బాబా భాస్కర్ మాస్టర్ వచ్చాడంటే ఎంటర్టైన్మెంట్ రెట్టింపు అవుతుంది. ఇక మాస్టర్ వస్తున్నాడంటే సుమ కూడా అతడిని ఎదురుకునేందుకు రెడీగా ఉంటుంది. ఇప్పటికే క్యాష్ షోలో పలుమార్లు వీరిద్దరు మంచి ఎంటర్టైన్మెంట్ అందించారు. ఇక తాజాగా స్టార్ మాలో సుమ వ్యాఖ్యతగా చేస్తున్న స్టార్ట్ మ్యూజిక్‌కి మాస్టర్ వెళ్లాడు.
రఘు మాస్టర్, అనీ మాస్టర్, భాను శ్రీ, శ్వేతా నాయుడుతో పాటు బాబా భాస్కర్ మాస్టర్ స్టార్ట్ మ్యూజిక్‌లో పాల్గొన్నారు. దీనికి సంబంధించి ప్రోమో తాజాగా విడుదలైంది. అందులో షోలోకి ఎంట్రీ ఇవ్వగానే డ్యాన్స్ చేస్తూ సుమ కాళ్ల మీద పడుతుంటాడు మాస్టర్. ఆ తరువాత సుమ.. మళ్లీ మర్చిపోతాను. మీరు వెళ్లేటప్పుడు కాస్త బొచ్చు ఇవ్వండి సామన్లు కడిగేందుకు అని మాస్టర్ని అంటుంది. ఇక ఢోల ఢోల పాట వచ్చినప్పుడు శ్వేతానాయుడు పాడుతుంటే.. వాళ్లను మాస్టర్ ఆపమనడం కామెడీగా ఉంటుంది.
పంచదార బొమ్మ బొమ్మ పాట వచ్చే సమయంలో ఇది మీరే కంపోజ్ చేశారు కదా అని సుమ అనగా.. లేదమ్మా. కీరవాణి కంపోజ్ చేశారు. నేను డ్యాన్స్ కొరియోగ్రఫీ చేశాను అని మాస్టర్ అంటాడు. ఆ తరువాత అది ఎలా జరిగిందో చెప్పండి అని సుమ అనగా.. షూటింగ్లాగానే అంటూ పంచ్‌లు వేస్తాడు మాస్టర్. మధ్య మధ్యలో సుమ కూడా బాబాకు పంచ్‌లు వేస్తుంటుంది. మొత్తానికి ఈ ప్రోమో చూస్తుంటే ఈ ఆదివారం వీరిద్దరు సందడి చేయబోతున్నట్లు అర్థమవుతుంది.