హోమ్ /వార్తలు /సినిమా /

Suma Kanakala: ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి పిల‌వ‌లేద‌ని ఆ మూవీ టీమ్‌పై హ‌ర్ట్ అయిన సుమ

Suma Kanakala: ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి పిల‌వ‌లేద‌ని ఆ మూవీ టీమ్‌పై హ‌ర్ట్ అయిన సుమ

Suma Kanakala: తెలుగు బుల్లితెర‌పై యాంకర్ సుమకు ఉన్న ఫాలోయింగ్ గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. యాంక‌రింగ్‌లో ఆమెను ఎవ్వ‌రూ దాట‌లేర‌న్న‌ది ప్రేక్ష‌కులు ఎరిగిన స‌త్యం. న‌వ్వుతూ.. న‌వ్విస్తూ అంద‌రినీ ఎంట‌ర్‌టైన్ చేస్తుంది. స్టేజ్‌పై సుమ ఉందంటే చాలు అక్క‌డ న‌వ్వులు గ్యారెంటీ. ఇక ప్రీ రిలీజ్ ఈవెంట్ల‌లోనూ ఆమెకు ప్ర‌త్యేక స్థానం ఉంది.

ఇంకా చదవండి ...

    Suma Kanakala: తెలుగు బుల్లితెర‌పై యాంకర్ సుమకు ఉన్న ఫాలోయింగ్ గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. యాంక‌రింగ్‌లో ఆమెను ఎవ్వ‌రూ దాట‌లేర‌న్న‌ది ప్రేక్ష‌కులు ఎరిగిన స‌త్యం. న‌వ్వుతూ.. న‌వ్విస్తూ అంద‌రినీ ఎంట‌ర్‌టైన్ చేస్తుంది. స్టేజ్‌పై సుమ ఉందంటే చాలు అక్క‌డ న‌వ్వులు గ్యారెంటీ. ఇక ప్రీ రిలీజ్ ఈవెంట్ల‌లోనూ ఆమెకు ప్ర‌త్యేక స్థానం ఉంది. క్లీన్ ఇమేజ్‌తో ముందుకు వెళుతున్న సుమ‌పై కామెంట్లు చేయాల‌ని ఎవ్వ‌రికీ అనిపించదు. టాప్ హీరోలు సైతం ఆమెపై ప్ర‌శంస‌లు కురిపిస్తుంటారు. చిన్న హీరోలు సైతం త‌మ ప్రీ రిలీజ్ ఈవెంట్ల‌కు సుమ‌ను రావాల‌ని కోరుకుంటారు. అయితే ఎప్పుడూ బిజీగా ఉండే సుమ‌.. డేట్లు అడ్జెస్ట్ చేయ‌లేక‌ అప్పుడ‌ప్పుడు పేరు మోసిన హీరోల ప్రీ రిఈజ్ ఈవెంట్‌ల‌ను మిస్ అవుతూ ఉంటుంది. ఇదిలా ఉంటే ఇటీవ‌ల ఓ మూవీ యూనిట్ త‌న‌ను ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు పిల‌వ‌లేద‌ని సుమ హ‌ర్ట్ అయ్యింది.

    వివ‌రాల్లోకి వెళ్తే.. ప్ర‌ముఖ సంగీత ద‌ర్శ‌కుడు కీర‌వాణి కుమారుడు సింహా మ‌త్తువ‌ద‌ల‌రా మూవీ ద్వారా హీరోగా ఎంట్రీ ఇచ్చిన విష‌యం తెలిసిందే. ఇప్పుడు తెల్ల‌వారితే గురువారం అన్న మూవీతో మ‌ళ్లీ ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చాడు. ఇవాళే ఈ చిత్రం ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. ఇక ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆ మ‌ధ్య‌న జ‌ర‌గ్గా.. దానికి రాజ‌మౌళి, ఎన్టీఆర్ హాజ‌ర‌య్యారు.

    కాగా ఈ మూవీ ప్ర‌మోష‌న్ల‌లో భాగంగా టీమ్‌ని సుమ ఇంట‌ర్వ్యూ చేసింది. అయితే ఇంట‌ర్వ్యూ ప్రారంభానికి ముందు సుమ సైలెంట్‌గా త‌న ప‌ని తాను చూసుకుంటూ ఉండ‌గా.. సింహా, కాల‌భైర‌వ‌, స‌త్య‌, మ‌ణికాంత్ న‌లుగురు ఆమెను మాట్లాడించేందుకు ప్ర‌య‌త్నిస్తారు. ఆ త‌రువాత స‌త్య, సుమ‌ను ఆంటీ అని పిల‌వ‌గా.. అప్పుడు సుమ నేను లేకుండా ప్రీ రిలీజ్ ఈవెంట్ చేసుకున్నారు క‌దా అని మాట్లాడుతుంది. దానికి వారు.. మీ డేట్ల కోసం చూశాము. కానీ ఆ లోపు ఎన్టీఆర్ డేట్లు కూడా దొరికేశాయ్ అని చెబుతాడు. దాంతో సుమ చాలు ఆపండి అన‌గా.. మేం చెప్పిందే నిజ‌మే క‌దా అని స‌త్య అంటాడు. ఆ త‌రువాత త‌న‌దైన పంథాలో తెల్ల‌వారితే గురువారం టీమ్‌ను ఆడుకుంటుంది సుమ‌.

    First published:

    ఉత్తమ కథలు