రాజీవ్ కనకాల ఇంట్లో ప్రస్తుతం విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆయన సొంత అక్క శ్రీలక్ష్మి కనకాల అకాల మరణంతో ఆ కుటుంబం శోక సంద్రంలో మునిగిపోయింది. మూడేళ్లుగా వరస విషాదాలు ఆ కుటుంబాన్ని బాధ పెడుతూనే ఉన్నాయి. 2018లో రాజీవ్ తల్లి.. గతేడాది ఆయన తండ్రి దేవదాస్ కనకాల.. ఇప్పుడు ఆయన అక్క శ్రీలక్ష్మి కన్నుమూసారు. దాంతో రాజీవ్ కనకాల కోలుకోలేని షాక్‌లోకి వెళ్లిపోతున్నాడు. ఈ సమయంలో ఆయనకు తోడుగా కుటుంబ సభ్యులు ఉన్నారు. రెండేళ్లుగా క్యాన్సర్‌తో పోరాడుతున్న శ్రీలక్ష్మి.. ఆరోగ్యం విషమించడంతో ఎప్రిల్ 6న కన్నుమూసింది.
సీనియర్ జర్నలిస్ట్ పెద్ది రామారావు ఆమె భర్త. అప్పట్లోనే ఆయన్ని ప్రేమ వివాహం చేసుకుంది ఈమె. పెద్దలు కూడా అంగీకరించారు. ఇదిలా ఉంటే ఆడపడుచు మరణం తర్వాత సుమ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. ఈమె నిర్ణయాన్ని చూసి అంతా ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. శ్రీలక్ష్మికి ఇద్దరు సంతానం. ఓ పాప.. బాబు ఉన్నారు. అందులో పాప ఇంటర్మీడియట్ చదువుతుంటే.. బాబు పదో తరగతిలో ఉన్నాడు. ఇంత చిన్న వయసులోనే తల్లి మరణించడంతో ఎదుగుతున్న పిల్లలకు ఏం చేయాలో తోచడం లేదు. ఈ సమయంలో ఆ పిల్లలకు తల్లి అవసరం కూడా ఎక్కువే ఉంటుంది.
అందుకే ఇప్పుడు సుమ ఓ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. ఇప్పటి వరకు మేనత్తగా ఉన్న ఈమె.. ఇప్పుడు తల్లి లేని ఆ పిల్లలకు తల్లిగా మారాలని చూస్తుంది. రాజీవ్ కనకాలతో పాటు బంధువులు కూడా ఇదే చెప్పడంతో సుమ వాళ్ల సూచన మేరకు ఈ పని చేస్తుందని ప్రచారం అయితే జరుగుతుంది. మరోవైపు రాజీవ్ కూడా మేనల్లుడు, మేనకోడలుకి అండగా ఉండాలని నిశ్చయించుకున్నాడు. శ్రీలక్ష్మి భర్త పెద్ది రామారావు సలహాల మేరకు సుమ ఈ బాధ్యత తీసుకుంటుందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఏదేమైనా కూడా ఇప్పుడు ఆ పిల్లలకు తల్లి లేని లోటు తీర్చడం మాత్రం అవసరమే అంటున్నారు బంధువులు కూడా.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Anchor suma, Telugu Cinema, Tollywood