సుమ కనకాల డాన్స్.. రాములో రాములా అంటూ కుక్కతో..

రాములో రాములా పాటకు సుమ డాన్స్ (allu arjun suma)

Suma Kanakala: యాంకర్ సుమ కనకాలకు సోషల్ మీడియాలో కూడా మంచి ఫాలోయింగ్ ఉంది. అక్కడ ఆమె ఎప్పుడూ యాక్టివ్‌గానే ఉంటుంది. కొత్త కొత్త వీడియోలు పోస్ట్ చేస్తూనే ఉంటుంది.

  • Share this:
యాంకర్ సుమ కనకాలకు సోషల్ మీడియాలో కూడా మంచి ఫాలోయింగ్ ఉంది. అక్కడ ఆమె ఎప్పుడూ యాక్టివ్‌గానే ఉంటుంది. కొత్త కొత్త వీడియోలు పోస్ట్ చేస్తూనే ఉంటుంది. లాక్‌డౌన్ సమయంలో కూడా తోటి యాంకర్స్ అందరితో కలిసి ఫన్ ప్రోగ్రామ్స్ చేస్తుంది సుమ. దాంతో పాటు తన ఇంట్లోనే ఉండి కామెడీ వీడియోలు కూడా చేస్తుంది ఈ యాంకర్. ఇక ఇప్పుడు ఏకంగా డాన్సులు కూడా చేస్తుంది సుమ కనకాల. తాజాగా రాములో రాములా అంటూ అదిరిపోయే స్టెప్పులు వేస్తూ వీడియో పోస్ట్ చేసింది సుమ. అందులో కుక్క కూడా ఉంది. దాని ముందే సుమ కూడా స్టెప్పులేసింది.

ఇద్దరూ కలిసి వీడియోలో రచ్చ రచ్చ చేసారు. అల వైకుంఠపురములో సినిమాలోని రాములో రాములా పాట ఎంత పాపులర్ అయిందో చెప్పనక్కర్లేదు. బాలీవుడ్ సెలబ్రిటీస్ సైతం ఈ పాటకు స్టెప్పులేసారు. ఇప్పుడు సుమ కూడా బన్నీ పాటకు డాన్సులు ట్రై చేసింది. ఇది కాస్తా బాగానే వైరల్ అయిపోతుందిప్పుడు. అన్నట్లు లాక్‌డౌన్‌లో కూడా ఇంట్లోనే కూర్చుని తన సుమక్క ఛానెల్‌లో రవి, శ్రీముఖి, ప్రదీప్ లాంటి యాంకర్స్‌తో ప్రోగ్రామ్స్ చేస్తూ బాగానే సబ్‌స్క్రైబర్స్ పెంచుకుంటుంది సుమక్క.
Published by:Praveen Kumar Vadla
First published: