తెలుగు ఫేమస్ యాంకర్ సుమ ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ప్రముఖ నటుడు రాజీవ్ కనకాల సోదరి.. స్టార్ యాంకర్ సుమ కనకాల ఆడపడుచు శ్రీ లక్ష్మీ కనకాల ఈ రోజు అనారోగ్యంతో కన్నుమూసారు. గత కొద్ది కాలంగా లక్ష్మి కనకాల తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. ప్రముఖ నటుడు దేవదాసు, లక్ష్మీ కనకాల ఏకైక కూతురు శ్రీలక్ష్మి. ఆమెకు ఇద్దరు ఆడపిల్లలున్నారు. ప్రముఖ జర్నలిస్టు పెద్ద రామారావు ఈమె భర్త. గత యేడాది ఆగష్టులో రాజీవ్ కనకాల తండ్రి దేవదాసు కనకాల కన్నుమూసారు. అంతకు రెండేళ్ల క్రితం దేవదాసు కనకాల భార్య లక్ష్మీ కనకాల మృతి చెందారు. తాజాగా రాజీవ్ కనకాల కుటుంబంలో ఆమె సోదరి శ్రీలక్ష్మీ కనకాల మృతి చెందింది.
వరుసగా కనకాల కుటుంబంలో మూడో మరణం చోటు చేసుకోవడం విషాదకరం. ఆమె మృతిపై పలువురు సినీ నటులు తమ దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Anchor suma, Rajiv Kanakala, Telugu Cinema, Tollywood