Anchor Suma: సెట్‌ని ఇలా కూడా శుభ్రం చేయొచ్చా.. నవ్వులు పూయిస్తోన్న సుమ వీడియో

యాంకర్ సుమ కనకాల (Instagram/Photo)

Suma Kanakala: తెలుగు బుల్లితెర‌పై యాంకర్ సుమకు ఉన్న ఫాలోయింగ్ గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. యాంక‌రింగ్‌లో ఆమెను ఎవ్వ‌రూ దాట‌లేర‌న్న‌ది ప్రేక్ష‌కులు ఎరిగిన స‌త్యం. న‌వ్వుతూ.. న‌వ్విస్తూ అంద‌రినీ ఎంట‌ర్‌టైన్ చేస్తుంది.

 • Share this:
  Suma Kanakala: తెలుగు బుల్లితెర‌పై యాంకర్ సుమకు ఉన్న ఫాలోయింగ్ గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. యాంక‌రింగ్‌లో ఆమెను ఎవ్వ‌రూ దాట‌లేర‌న్న‌ది ప్రేక్ష‌కులు ఎరిగిన స‌త్యం. న‌వ్వుతూ.. న‌వ్విస్తూ అంద‌రినీ ఎంట‌ర్‌టైన్ చేస్తుంది. స్టేజ్‌పై సుమ ఉందంటే చాలు అక్క‌డ న‌వ్వులు గ్యారెంటీ. ఇక ప్రీ రిలీజ్ ఈవెంట్ల‌లోనూ ఆమెకు ప్ర‌త్యేక స్థానం ఉంది. క్లీన్ ఇమేజ్‌తో ముందుకు వెళుతున్న సుమ‌పై కామెంట్లు చేయాల‌ని ఎవ్వ‌రికీ అనిపించదు. టాప్ హీరోలు సైతం ఆమెపై ప్ర‌శంస‌లు కురిపిస్తుంటారు. ఇలాంటి సీనియ‌ర్ యాంక‌ర్.. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటారు. సెట్స్‌లో జ‌రిగిన సంభాష‌ణ‌లు, ఫ‌న్నీ వీడియోల‌ను ఆమె అభిమానుల‌తో షేర్ చేసుకుంటూ ఉంటారు.

  ఈ క్ర‌మంలో తాజాగా ఓ వీడియోను ఆమె ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు. సుమ వ్యాఖ్య‌త‌గా వ్య‌వ‌హ‌రించే షోలలో బిగ్ సెల‌బ్రిటీ ఛాలెంజ్ ఒక‌టి. జీ తెలుగులో వ‌స్తోన్న ఈ షోకు మంచి రేటింగ్ కూడా వ‌స్తోంది. ఇక ఈ షోలో ప‌లువురు సెల‌బ్రిటీలు పాల్గొంటుండ‌గా.. టాలెంట్ ఉన్న ఎంతోమంది త‌మ టాలెంట్‌ని చూపిస్తుంటారు.
  View this post on Instagram


  A post shared by Suma K (@kanakalasuma)

  ఇక ఈ షో షూటింగ్ పూర్తైన త‌రువాత అక్క‌డ ప‌డి ఉన్న చెత్త‌ను అక్క‌డి బాయ్స్ శుభ్రం చేస్తున్నారు. ఆ స‌మ‌యంలో సుమ కూడా త‌న డ్ర‌స్‌తో అలా ఇలా తిరుగుతూ శుభ్రం చేస్తుంది. ఇక ఈ వీడియోకు ఆడుతు పాడుతూ ప‌ని చేస్తుంటే అన్న పాట‌ను కూడా జోడించింది సుమ‌. ఈ వీడియో సుమ అభిమానుల‌తో పాటు నెటిజ‌న్ల చేత న‌వ్వులు పూయిస్తోంది. మీరు సూప‌ర్ సుమ‌క్క అంటూ అభిమానులు కామెంట్లు పెడుతున్నారు.
  Published by:Manjula S
  First published: