Anchor Suma : రాజీవ్‌ కనకాలను ఉద్దేశిస్తూ.. సుమ ఆసక్తికర ట్వీట్.. ఈ దెబ్బతో అందరికి క్లారిటీ..

సుమ, రాజీవ్ Photo : Twitter

Suma Kanakala : యాంకర్ సుమ అంటే తెలియని తెలుగు టీవీ ప్రేక్షకులుండరు. అంత పాపులర్ సుమ. టీవీ తెరపై ఆమె ఓ మెగాస్టార్. ఎంత పెద్ద షో ఐనా ఏ మాత్రం బెదరకుండా తన మాటలతో రంజింప చేస్తుంది.

  • Share this:
    యాంకర్ సుమ కనకాల... ఈ పేరును సెపరేట్‌గా పరిచయం చేయాల్సిన అక్కరలేదు. అంత పాపులర్ సుమ. టీవీ తెరపై తన వాక్చాతుర్యంతో కొన్నిసంవత్సరాలుగా.. కొన్ని లక్షల మంది హృదయాలను దోచుకున్నారు సుమ. అవ్వడానికి మలయాళీ కుట్టి అయినప్పటికి తెలుగులో అనర్గళంగా మాట్లాడుతూ, ఎదుటి వారిపై పంచ్‌లు వేస్తూ.. వారిని ఏమాత్రం నొప్పించకుండా కడుపుబ్బా నవ్విస్తుంటారు. యాంకరింగ్‌, ఆడియో ఫంక్షన్స్, సినిమాలు‌.. ఇలా అన్నింటిలోనూ అందె వేసిన చేయి ఆమెది. సినిమాల్లో చిరంజీవి తన డ్యాన్స్‌లతో, నటనతో తనదైన మేనరిజంతో ఎంత పేరు తెచ్చుకున్నాడో.. టీవీల్లో కూడా సుమ తన దైన స్టైల్లో యాంకరింగ్‌కు చేస్తూ అప్పటికప్పుడు సమయస్పూర్తిగా వ్యవహరిస్తూ అంత పేరు తెచ్చుకుంది. ఓ రకంగా టీవీ మెగాస్టార్ అని సుమను అనోచ్చు. దశాబ్ధాలుగా సుమ టీవీ తెరపై అద్భుతాలు చేస్తూనే ఉంది. వయసు 40 దాటినా కూడా ఇప్పటికీ యాంకరింగ్‌లో ఆమెను అందుకునే శక్తి కానీ.. దాటే అర్హత కానీ ఎవరికీ కనిపించడం లేదు. కనీసం సుమ దరిదాపుల్లో కూడా ఎవరూ కనిపించడం లేదు. పెద్ద హీరోలకు సంబంధించిన ఏ ఈవెంట్‌ అయినా.. సరే తన మాటలతో మాయ చేయడం సుమ స్పెషాలిటీ. తెలుగువారు ఆమెను ఓ యాంకర్‌గా కాకుండా తమ ఇంటి సభ్యరాలిగానే భావిస్తారు. అంతలా వారికి కనెక్ట్ అయిపోయింది ఈ మలయాళీ కుట్టి.


    తన మాటలతో గానీ చేతలతో గానీ ఎవరనీ నోప్పించని సుమ తాజాగా తన సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టింది. తన భర్త, సినీనటుడు రాజీవ్ కనకాల పుట్టినరోజు సందర్భంగా యాంకర్ సుమ ఈ పోస్ట్ చేసింది. రాజీవ్‌పై తనకున్న ప్రేమాభిమానాలను ఆమె ఇందులో స్పష్టంగా వెల్లడించింది. ఈ సందర్భంగా సుమ రాజీవ్‌ను ఉద్దేశిస్తూ.. 'నా ప్రియమైన రాజా.. నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు. నీవే నా బలం, సంతోషం. నీతో కలిసి జీవితాన్ని పంచుకునే అవకాశాన్ని నాకు దేవుడిచ్చాడు. నీతో కలిసి జీవించే ప్రతిరోజు ఓ కొత్త రోజులా ఉండాలని నేను అనుకుంటున్నాను. లవ్ యూ రాజా..అని సుమ ఏంతో ప్రేమగా తనలోని భావాన్ని తెలియజేసింది. ప్రస్తుతం ఆమె ట్వీట్ నెటిజన్స్‌ను ఆకట్టుకుంటోంది.  ఇక అది అలా ఉంటే సుమ.. తన భర్త రాజీవ్ కనకాలతో ఆమె విడిపోయినట్టు ఇటీవలి కాలంలో కొన్ని వదంతులు వినిపించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సుమ.. రాజీవ్ బర్త్ డే సందర్భంగా ఈ ట్వీట్ చేయడంతో అవన్ని ఉత్త రూమర్స్ అనే విషయం తేటతెల్లమైంది. తన భర్తతో కలిసి గతంలో తీసుకున్న ఫొటోను రాజీవ్ పుట్టినరోజు ఈ సందర్భంగా సుమ పోస్ట్ చేసింది. రాజీవ్‌ కనకాలను సుమ ప్రేమించి పెళ్లి చేసుకుంది. వీరు 1999లో వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు సంతానం. కొడుకు రోషన్‌, కుతూరు మనస్వీని ఉన్నారు. సుమ కొడుకు రోషన్ సినీ రంగ ప్రవేశం చేస్తున్న విషయం తెలిసిందే.
    Published by:Suresh Rachamalla
    First published: