ఈ మధ్య ఇండస్ట్రీలో చాలా మంది ఇంటి వాళ్లు అవుతున్నారు. మొన్నటికి మొన్న రష్మిక మందన్న కూడా ఓ ఇంటిది అయిపోయింది. ఒకప్పుడు ఇంటివాళ్లు కావడం అంటే పెళ్లి అనుకునేవాళ్లు కానీ ఇప్పుడు ఇల్లు తీసుకుని ఇంటివాళ్లు అయిపోతున్నారు మన సెలబ్రిటీస్. ఇప్పుడు సుమ కనకాల దంపతులు కూడా ఇదే చేసారని తెలుస్తుంది. ఈ ఇద్దరూ ఓ కొత్త ఇంటిని కొనుగోలు చేసారని ప్రచారం జరుగుతుంది. కొన్ని రోజులుగా ఈ ఇంటి గురించి చర్చలు నడుస్తున్నాయని.. ఇప్పుడు పూర్తైపోయిందని వార్తలు వస్తున్నాయి. అత్యంత విలాసవంతంగా ఉండే ఈ ఇంటి కోసం కొన్ని కోట్లు వెచ్చించినట్లు తెలుస్తుంది. తమకు నచ్చినట్లు వాస్తు ప్రకారం చూసుకుని భారీగా ఈ ఇంటిని తీసుకున్నారని.. త్వరలోనే గృహప్రవేశం కూడా జరగబోతుందని తెలుస్తుంది.
నిజానికి ఇల్లు తీసుకుని చాలా రోజులైనా కూడా దేవదాస్ కనకాల చనిపోవడంతో అక్కడితో అది వాయిదా పడింది. మరో ఇంటి కోసం రాజీవ్ కనకాల కూడా చాలా ఏళ్లుగా కష్టపడుతున్నాడు. ఇన్నాళ్లకు ఆ సమయం రానే వచ్చింది. చాలా రోజుల కిందే ఇల్లు తీసుకున్నా కూడా ఇంట్లో పెద్దవాళ్లు పోయినపుడు ఏడాది వరకు కొత్తింట్లోకి వెళ్లకూడదనే నియమం ఉండటంతో ఇంకా ఇల్లు మారలేదు ఈ జంట. అప్పటి వరకు ఇంటికి మరిన్ని హంగులు దిద్దించుకున్నారని.. ప్రస్తుతం సుమ కొత్త ఇంటిపై టాలీవుడ్‌లో బాగానే చర్చలు కూడా జరుగుతున్నాయి.
ఇదిలా ఉంటే కొన్ని రోజులుగా సుమ, రాజీవ్ వేర్వేరుగా ఉంటున్నారనే ప్రచారం కూడా ఇండస్ట్రీలో జరుగుతుంది. ఒకప్పుడు ఉన్నంత సఖ్యత ఇప్పుడు వాళ్లిద్దరి మధ్య కనిపించడం లేదనే వాదన కూడా వినిపిస్తున్న వేళ.. కొత్త ఇల్లు తీసుకోవడంతో అంతా బాగానే ఉందని అర్థమైపోతుంది. పైగా భర్త గురించి ఈ మధ్య కొన్ని ప్రోగ్రామ్స్‌లో సెటైర్లు కూడా వేస్తుంది సుమ. అంటే బాగున్నట్లే కదా లెక్క. త్వరలోనే ఈ ఇంటి ఓపెనింగ్ గురించి పూర్తి వివరాలు బయటికి రానున్నాయి. ఏదేమైనా కూడా చాలా ఏళ్లుగా కష్టపడుతున్న దానికి ఇప్పుడు ఇలా ప్రతిఫలం దక్కిందన్నమాట.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Anchor suma, Telugu Cinema, Tollywood